Realme P4 Power: డ్యూయల్ చిప్ సెట్ మరియు 10,001 mAh బ్యాటరీతో లాంచ్ అవుతోంది.!

Updated on 25-Jan-2026
HIGHLIGHTS

రియల్‌మీ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ గురించి ఇప్పుడు సర్వత్రా చర్చ మొదలయ్యింది

Realme P4 Power 10,001 mAh బిగ్ బ్యాటరీతో భారత్ లో లాంచ్ అయ్యే మొదటి ఫోన్

జబర్దస్త్ కెమెరా సెటప్ తో లాంచ్ అవుతున్నట్లు కూడా కంపెనీ అనౌన్స్ చేసింది

Realme P4 Power: రియల్‌మీ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ గురించి ఇప్పుడు సర్వత్రా చర్చ మొదలయ్యింది. ఎందుకంటే, భారత మార్కెట్లో ఎన్నడూ లేని విధంగా 10,001 mAh బిగ్ బ్యాటరీతో ఈ ఫోన్ ను లాంచ్ చేస్తున్నట్లు అనౌన్స్ చేసింది. ఈ విషయం అనౌన్స్ చేసిన తర్వాత ఈ ఫోన్ పై ఈ చర్చ మొదలయ్యింది. అంతేకాదు, రియల్‌మీ పి4 పవర్ స్మార్ట్ ఫోన్ డ్యూయల్ చిప్ సెట్ మరియు జబర్దస్త్ కెమెరా సెటప్ తో లాంచ్ అవుతున్నట్లు కూడా కంపెనీ అనౌన్స్ చేసింది.

Realme P4 Power: ఎప్పుడు లాంచ్ అవుతుంది?

జనవరి 29వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకు రియల్‌మీ పి4 పవర్ స్మార్ట్ ఫోన్ ను ఇండియన్ మార్కెట్లో విడుదల చేయడానికి డేట్ కన్ఫర్మ్ చేసింది. ఈ ఫోన్ కీలకమైన ఫీచర్స్ ను కూడా కంపెనీ ముందగా వెల్లడించింది.

Also Read: BSNL Plan: అతి తక్కువ ఖర్చులో ఎక్కువ లాభాలు అందించే బెస్ట్ ప్లాన్.!

Realme P4 Power: ఫీచర్స్

రియల్‌మీ పి4 పవర్ స్మార్ట్ ఫోన్ భారీ 10,001 mAh బిగ్అండ్ పవర్ ఫుల్ బ్యాటరీ తో లాంచ్ అవుతోంది. ఇంత పవర్ ఫుల్ బ్యాటరీతో ఇండియాలో లాంచ్ అయ్యే మొదటి ఫోన్ ఇదే. అంతేకాదు, ఈ ఫోన్ ను వేగంగా ఛార్జ్ చేసే 80W సూపర్ ఊక్ ఛార్జ్ సపోర్ట్ తో పటు పాటు ఇతర పరికరాలను వేగంగా ఛార్జ్ చేసే 27W ఫాస్ట్ రివర్స్ ఛార్జ్ సపోర్ట్ ను కూడా ఈ ఫోన్ కలిగి ఉంటుంది. ఈ ఫోన్ ను డ్యూయల్ చిప్ సెట్ తో లాంచ్ చేస్తోంది. ఇందులో మీడియాటెక్ Dimensity 7400 చి సెట్ జతగా హైపర్ విజన్ ప్లస్ AI చిప్ సెట్ ఉంటాయి.

ఈ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ 144Hz రిఫ్రెష్ రేట్ కలిగిన 4D డిస్ప్లే కలిగి ఉంటుంది. ఈ డిస్ప్లే 6500 నిట్స్ పీక్ బ్రైట్నెస్, HDR 10+ సపోర్ట్ మరియు Netflix HDR సపోర్ట్ కూడా కలిగి ఉంటుంది. ఈ ఫోన్ 50MP Sony IMX 882 ప్రధాన కెమెరా జతగా మరో రెండు కెమెరాలు కలిగిన ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ కలిగి ఉంటుంది. ఇది 4K రిజల్యూషన్ వీడియోలు మరియు సూపర్ AI కెమెరా ఫీచర్స్ కూడా కలిగి ఉంటుంది.

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :