BSNL Plan: అతి తక్కువ ఖర్చులో ఎక్కువ లాభాలు అందించే బెస్ట్ ప్లాన్.!

HIGHLIGHTS

బిఎస్ఎన్ఎల్ ఇప్పుడు దేశం మొత్తం పూర్తిగా 4జి సర్వీస్ విస్తరించింది

యూజర్లకు గొప్ప ప్రయోజనాలు అందించే మంచి బడ్జెట్ ప్రీపెయిడ్ ప్లాన్స్

ఈ అన్లిమిటెడ్ ప్రీపెయిడ్ ప్లాన్ చాలా తక్కువ రేటుకే సంవత్సరం అన్లిమిటెడ్ లాభాలు అందిస్తుంది

BSNL Plan: అతి తక్కువ ఖర్చులో ఎక్కువ లాభాలు అందించే బెస్ట్ ప్లాన్.!

BSNL Plan: బిఎస్ఎన్ఎల్ ఇప్పుడు దేశం మొత్తం పూర్తిగా 4జి సర్వీస్ విస్తరించింది. విస్తరణతో పాటు యూజర్లకు గొప్ప ప్రయోజనాలు అందించే మంచి బడ్జెట్ ప్రీపెయిడ్ ప్లాన్స్ కూడా అందించింది. టారిఫ్ రేట్లు పెరుగుతున్న ఈ రోజుల్లో బిఎస్ఎన్ఎల్ మాత్రం చవక ప్రీపెయిడ్ ప్లాన్స్ తో ఆకట్టుకుంటోంది. వాటిలో బెస్ట్ వన్ ఇయర్ ప్రీపెయిడ్ ప్లాన్ గురించి ఈరోజు మనం చూడనున్నాము. ఈ అన్లిమిటెడ్ ప్రీపెయిడ్ ప్లాన్ చాలా తక్కువ రేటుకే సంవత్సరం అన్లిమిటెడ్ లాభాలు అందిస్తుంది. బిఎస్ఎన్ఎల్ ఆఫర్ చేస్తున్న ఈ బెస్ట్ ప్రీపెయిడ్ ప్లాన్ ఏమిటో చూద్దామా.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

BSNL Plan: ఏమిటి ఆ ప్లాన్?

బిఎస్ఎన్ఎల్ యూజర్ల కోసం అందించిన రూ. 2,399 రూపాయల ప్రీపెయిడ్ ప్లాన్ గురించే మనం ఇప్పుడు చెప్పుకుంటుంది. ఈ ప్రీపెయిడ్ ప్లాన్ 365 అన్లిమిటెడ్ లాభాలు అందిస్తుంది. ఇది కాకుండా ఈ ప్లాన్ తో ఇప్పుడు సంవత్సరం మొత్తం డైలీ అదనపు డేటా కూడా అందిస్తోంది. ఈ ప్లాన్ కోసం మీరు చెల్లించే అమౌంట్ ను 12 నెలలకు లెక్కిస్తే ఇది నెలకు కేవలం రూ. 200 రూపాయలు మాత్రమే అవుతుంది.

BSNL Plan: రూ. 2399 ప్లాన్ బెనిఫిట్స్

ఈ బీఎస్ఎన్ఎల్ ప్రీపెయిడ్ ప్లాన్ 365 రోజులు, అంటే సంవత్సరం మొత్తం చెల్లుబాటు అవుతుంది. ఈ వన్ ఇయర్ ప్రీపెయిడ్ ప్లాన్ తో రీఛార్జ్ చేస్తే మీకు 365 రోజులు అన్లిమిటెడ్ లాభాలు అందుతాయి. అంటే, అన్లిమిటెడ్ కాలింగ్, డైలీ 2 జీబీ హై స్పీడ్ డేటా, ఈ డేడేటా ముగిసిన తర్వాత 40Kbps తో అన్లిమిటెడ్ డేటా మరియు డైలీ 100 SMS ప్రయోజనాలు అందిస్తుంది. ఈ ప్రీపెయిడ్ ప్లాన్ ను యూజర్లు అందరికీ అందుబాటులోకి తెచ్చింది. పైన తెలిపిన విధంగా ఈ ప్రీపెయిడ్ ప్లాన్ కోసం చేసే ఖర్చును నెలవారీగా లెక్కిస్తే నెలకు కేవలం రూ. 200 మాత్రమే అవుతుంది.

Also Read: Redmi Note 15 Pro 5G స్మార్ట్ ఫోన్ లాంచ్ డేట్ అండ్ ఫీచర్స్ కన్ఫర్మ్ చేసిన షియోమీ.!

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo