Realme P3x 5G ఫోన్ ను IP69 వాటర్ రెసిస్టెంట్ తో ఆకర్షణీయమైన ధరలో లాంచ్ చేసింది.!
Realme P3x 5G ఈరోజు ఇండియన్ మార్కెట్లో విడుదల చేయబడింది
అండర్ 15 వేల ధరలో IP69 వాటర్ రెసిస్టెంట్ వంటి మరిన్ని ఆకర్షణీయమైన ఫీచర్స్ తో వచ్చింది
రియల్ మీ ఈ ఫోన్ ను చాలా స్లీక్ డిజైన్ మరియు ప్రీమియం వేగాన్ లెథర్ తో అందించింది
Realme P3x 5G స్మార్ట్ ఫోన్ ఈరోజు ఇండియన్ మార్కెట్లో విడుదల చేయబడింది. ఈ స్మార్ట్ ఫోన్ ను అండర్ 15 వేల ధరలో IP69 వాటర్ రెసిస్టెంట్ వంటి మరిన్ని ఆకర్షణీయమైన ఫీచర్స్ తో రియల్ మీ లాంచ్ చేసింది. రియల్ మీ ఈ ఫోన్ ను చాలా స్లీక్ డిజైన్ మరియు ప్రీమియం వేగాన్ లెథర్ తో అందించింది.
Realme P3x 5G : ప్రైస్
రియల్ మీ పి 3x 5జి స్మార్ట్ ఫోన్ 6GB మరియు 128GB బేసిక్ వేరియంట్ రూ. 13,999 రూపాయల ధరతో లాంచ్ అయ్యింది. ఈ ఫోన్ యొక్క హై ఎండ్ 8GB + 128GB వేరియంట్ రూ. 14,999 ధరతో లాంచ్ అయ్యింది. రియల్ మీ పి 3x 5జి స్మార్ట్ ఫోన్ రెండు వేరియంట్స్ పై రూ. 1,000 రూపాయల బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్స్ కూడా అందించింది. ఫిబ్రవరి 28వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకు ఈ ఫోన్ మొదటి సేల్ ప్రారంభం అవుతుంది. ఈ ఫోన్ Flipkart మరియు realme.com నుంచి సేల్ అవుతుంది.
ఈ ఫోన్ పై రూ. 1,000 రూపాయల బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్ కూడా అందించింది. ICICI, HDFC, SBI మరియు Axis బ్యాంక్ కార్డ్స్ తో ఈ ఫోన్ కొనే వారికి ఈ డిస్కౌంట్ అందిస్తుంది.
Also Read: Realme P3 Pro 5G: కలర్ చేంజింగ్ ఫైబర్ మరియు Sony కెమెరాతో లాంచ్ అయ్యింది.!
Realme P3x 5G : ఫీచర్స్
రియల్ మీ పి 3x 5జి స్మార్ట్ ఫోన్ Dimensity 6400 5G చిప్ సెటప్ తో వస్తుంది. దీనికి జతగా 8GB ర్యామ్ మరియు 128GB ఇంటర్నల్ స్టోరేజ్ కలిగి ఉంటుంది. ఈ ఫోన్ 6.72 ఇంచ్ స్క్రీన్ ను కలిగి ఉంటుంది. ఈ స్క్రీన్ FHD+ రిజల్యూషన్, 120Hz రిఫ్రెష్ రేట్ మరియు 950 నిట్స్ పీక్ బ్రైట్నెస్ కలిగి ఉంటుంది. ఈ ఫోన్ మిలటరీ గ్రేడ్ షాక్ రెసిస్టెంట్, IP 68 మరియు IP 69 రేటింగ్ డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెంట్ ఫీచర్ తో వస్తుంది.
ఈ రియల్ మీ కొత్త ఫోన్ 50MP ఓమ్ని విజన్ మెయిన్ కెమెరా మరియు 2MP పోర్ట్రైట్ సెన్సార్ కలిగిన డ్యూయల్ రియర్ కెమెరా కలిగి ఉంటుంది. ఈ ఫోన్ లో సూపర్ లైనర్ స్పీకర్ వుంది. ఈ ఫోన్ లో నోయిస్ క్యాన్సిలేషన్ సపోర్ట్ కలిగిన డ్యూయల్ మైక్, O రియాలిటీ సౌండ్ ఎఫెక్ట్ మరియు Hi-Res ఆడియో సర్టిఫికేషన్ తో వస్తుంది.
P3x 5G స్మార్ట్ ఫోన్ రియల్ మీ UI 6.0 జతగా Android 15 OS తో పని చేస్తుంది. ఈ ఫోన్ లో 6000mAh లాంగ్ లాస్టింగ్ బ్యాటరీ 45W ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ తో కలిగి వుంది.