Realme P3 Pro 5G: కలర్ చేంజింగ్ ఫైబర్ మరియు Sony కెమెరాతో లాంచ్ అయ్యింది.!

Realme P3 Pro 5G: కలర్ చేంజింగ్ ఫైబర్ మరియు Sony కెమెరాతో లాంచ్ అయ్యింది.!
HIGHLIGHTS

రియల్ మీ ఈరోజు కొత్త ఫోన్ ను విడుదల చేసింది

Realme P3 Pro 5G ఫోన్ ను సరికొత్త ఫీచర్స్ తో లాంచ్ చేసింది

ఈ ఫోన్ ను సరికొత్త Luminous Color-Changing Fiber మరియు నెబ్యులా డిజైన్ తో అందించింది

Realme P3 Pro 5G: రియల్ మీ ఈరోజు కొత్త ఫోన్ ను విడుదల చేసింది. అదే రియల్ మీ పి 3 ప్రో 5జి స్మార్ట్ ఫోన్ మరియు ఈ ఫోన్ ను సరికొత్త ఫీచర్స్ తో లాంచ్ చేసింది. ఈరోజు రియల్ మీ నిర్వహించిన ఆన్లైన్ ఈవెంట్ నుంచి రియల్ మీ పి 3 ప్రో మరియు Realme P3x 5G ఫోన్ ను కూడా విడుదల చేసింది. ఈ రోజే సరికొత్తగా విడుదలైన రియల్ మీ పి 3 ప్రో 5జి స్మార్ట్ ఫోన్ ధర మరియు ఫీచర్స్ ఎలా ఉన్నాయో చూద్దామా.

Realme P3 Pro 5G: ఫీచర్స్

రియల్ మీ పి 3 ప్రో స్మార్ట్ ఫోన్ 6.83 ఇంచ్ క్వాడ్ కర్వుడ్ AMOLED స్క్రీన్ కలిగి ఉంటుంది. ఈ స్క్రీన్ 120Hz రిఫ్రెష్ రేట్, 1.5K (2800×1472) రిజల్యూషన్ మరియు 1500 నిట్స్ పీక్ బ్రైట్నెస్ వంటి ఫీచర్స్ కలిగి ఉంటుంది. ఈ ఫోన్ ను సరికొత్త Luminous Color-Changing
Fiber మరియు నెబ్యులా డిజైన్ తో అందించింది. ఇది వెలుగు తక్కువ సమయంలో బ్యాక్ ప్యానల్ ను వెలిగేలా చేస్తుంది.

రియల్ మీ పి 3 ప్రో స్మార్ట్ ఫోన్ ను Snapdragon 7s Gen 3 చిప్ సెట్ తో అందించింది. ఇది 4nm TSMC చిప్ సెట్ మరియు ఇది గరిష్టంగా 800K AnTuTu స్కోర్ అందిస్తుంది. ఈ ఫోన్ 8GB ర్యామ్ మరియు 128GB స్టోరేజ్ తో వస్తుంది. ఈ ఫోన్ రియల్ మీ UI 6.0 సాఫ్ట్ వేర్ తో Android 15 OS పై నడుస్తుంది. ఈ ఫోన్ లో 6000mAh టైటాన్ బ్యాటరీ మరియు 80W SUPERVOOC ఛార్జ్ సపోర్ట్ ఉంటుంది.

Realme P3 Pro 5G Launched

ఒక కెమెరా విషయానికి వస్తే, ఈ ఫోన్ లో వెనుక 50MP (Sony IMX896 OIS) ప్రధాన కెమెరా కలిగిన డ్యూయల్ రియర్ కెమెరా మరియు ముందు 16MP Sony IMX480 సెల్ఫీ కెమెరా ఉన్నాయి. ఈ ఫోన్ మెయిన్ కెమెరా 30fps తో 4K Video రికార్డింగ్ ఫీచర్ మరియు AI కెమెరా ఫీచర్స్ కూడా కలిగి ఉంటుంది. ఈ ఫోన్ ను NEXT Ai సపోర్ట్ తో రియల్ మీ లాంచ్ చేసింది.

ఈ రియల్ మీ ఫోన్ IP 66, IP 68 మరియు IP 69 రేటింగ్ తో టాప్ లెవల్ డస్ట్ మరియు వాటర్ రెసిస్టెంట్ గా ఉంటుంది. గేమింగ్ కోసం ప్రత్యేకమైన GT Boost ఫీచర్ మరియు ఫోన్ ను అత్యంత వేగంగా చల్లబరిచే ఏరో స్పేస్ 6K వేపర్ ఛాంబర్ కూలింగ్ సపోర్ట్ తో అందించింది.

Also Read: New Scam: కొత్త Call Merging Scam అలర్ట్ జారీ చేసిన NPCI

Realme P3 Pro 5G: ప్రైస్

Realme P3 Pro 5G: ప్రైస్

రియల్ మీ ఈ ఫోన్ ను మూడు వేరియంట్లలో ప్రవేశపెట్టింది. ఈ ఫోన్ యొక్క 8GB + 128GB బేసిక్ వేరియంట్ ను రూ. 23,999 రూపాయల ధరతో అందించింది. ఈ ఫోన్ యొక్క 8GB + 256GB వేరియంట్ ను రూ. 24,999 రూపాయల ధరతో లాంచ్ చేసింది. ఈ ఫోన్ యొక్క హైఎండ్ 12GB + 256GB వేరియంట్ ను రూ. 26,999 ధరతో లాంచ్ చేసింది.

ఆఫర్స్

ఈ ఫోన్ పై గొప్ప లాంచ్ ఆఫర్స్ కూడా రియల్ మీ ఆఫర్ చేస్తోంది. ఈ ఫోన్ యొక్క అన్ని వేరియంట్స్ పై రూ. 2,000 రూపాయల వరకు డిస్కౌంట్ అందుకునే ఆఫర్స్ జత చేసినట్లు తెలిపింది. ఈ ఫోన్ యొక్క మొదటి సేల్ ఫిబ్రవరి 25వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకు మొదలవుతుంది.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo