Realme P3 Pro: స్నాప్ డ్రాగన్ లేటెస్ట్ పవర్ ఫుల్ చిప్ సెట్ తో లాంచ్ డేట్ అనౌన్స్.!
Realme P3 Pro లాంచ్ డేట్ అనౌన్స్ చేసింది
ఈ ఫోన్ కీలకమైన ఫీచర్స్ కూడా రియల్ మీ వెల్లడించింది
క్యాంపైన్ నుంచి ఈ ఫోన్ యొక్క కీలకమైన వివరాలు వెల్లడించింది
Realme P3 Pro: రియల్ మీ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ రియల్ మీ పి 3 ప్రో లాంచ్ డేట్ అనౌన్స్ చేసింది. ఈ స్మార్ట్ ఫోన్ లాంచ్ డేట్ తో పాటు ఈ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ ప్రోసెసర్ తో పాటు మరిన్ని కీలకమైన ఫీచర్స్ కూడా రియల్ మీ వెల్లడించింది. ఈ అప్ కమింగ్ ఫోన్ సిరీస్ లాంచ్ కోసం చేపట్టిన టీజింగ్ క్యాంపైన్ నుంచి ఈ ఫోన్ యొక్క కీలకమైన వివరాలు వెల్లడించింది.
SurveyRealme P3 Pro ఎప్పుడు లాంచ్ అవుతుంది?
ఇండియాలో రియల్ మీ పి 3 ప్రో ఫిబ్రవరి 18వ తేదీ లాంచ్ అవుతుందని రియల్ మీ ప్రకటించింది. ఈ అప్ కమింగ్ రియల్ మీ స్మార్ట్ ఫోన్ కోసం Flipkart సేల్ పార్ట్నర్ గా వ్యవహరిస్తుంది. అందుకే, ఈ అప్ కమింగ్ ఫోన్ కోసం ప్రత్యేకమైన మైక్రో సైట్ పేజి అందించి టీజింగ్ చేస్తోంది.
Realme P3 Pro : ఫీచర్స్
రియల్ మీ పి 3 ప్రో ను Snapdragon 7s Gen 3 చిప్ సెట్ తో లాంచ్ చేస్తున్నట్లు అనౌన్స్ చేసింది. ఈ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ ను ప్రత్యేకమైన డిజైన్ తో తీసుకు వస్తున్నట్టు కూడా రియల్ మీ టీజింగ్ చేస్తోంది. అయితే, ఈ ఫోన్ డిజైన్ ను ఇంకా రివీల్ చేయలేదు. కానీ, త్వరలోనే ఈ ఫోన్ డిజైన్ కూడా రివీల్ చేస్తుందని తెలిపింది.

రియల్ మీ పి 3 సిరీస్ ఫోన్ లలో 6000 mAh హెవీ బ్యాటరీ సపోర్ట్ ఉంటుంది మరియు దీనికి జతగా ఈ ఫోన్ లను అత్యంత వేగంగా ఛార్జ్ చేసే 80W ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ కూడా ఉంటుందట. అంతేకాదు, ఈ అప్ కమింగ్ రియల్ మీ స్మార్ట్ ఫోన్ పెద్ద వేపర్ ఛాంబర్ కూలింగ్ సిస్టం ను కలిగి ఉంటుంది.
రియల్ మీ ఈ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ గురించి మరిన్ని కీలకమైన ఫీచర్స్ కూడా త్వరలోనే వెల్లడిస్తుంది. ఈ ఫోన్ యొక్క మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం.