Dor Play App: ముందుగా స్మార్ట్ టీవీ కోసం WiFi ఆధారిత ఎంటర్టైన్మెంట్ సర్వీస్ లను తీసుకు వచ్చిన స్ట్రీమ్ బాక్స్ మీడియా, ఇప్పుడు Entertainment Super App ని కూడా తీసుకు వచ్చింది. డోర్ ప్లే పేరుతో ఈ కొత్త సూపర్ ఎంటర్టైన్మెంట్ యాప్ ని అందించింది. ఈ యాప్ సర్వీస్ లను ఈరోజు ప్రారంభించింది. మూడు నెలకు కేవలం రూ. 399 ఖర్చుతోనే 20+ OTT మరియు 300+ లైవ్ టీవీ సర్వీస్ తో కొత్త యాప్ ను ప్రవేశపెట్టింది.
Survey
✅ Thank you for completing the survey!
ఏమిటి ఈ Dor Play App?
ఎంటర్టైన్మెంట్ కోసం ప్రతి OTT ని సబ్ స్క్రిప్షన్ ను తీసుకునే అవసరం లేకుండా చాలా OTT లను ఒకే వద్ద ఆఫర్ చేసే సూపర్ ఎంటర్టైన్మెంట్ యాప్ ఈ ‘డోర్ ప్లే యాప్’. ఈ యాప్ తో కేవలం సింగిల్ సబ్ స్క్రిప్షన్ తో 20 కి పైగా OTT లు మరియు 300లకు పైగా లైవ్ టీవీ ఛానల్స్ ఒకే వద్ద పొందవచ్చు. స్ట్రీమ్ బాక్స్ మీడియా ముందుగా ఈ సర్వీసులను టీవీ కోసం అందించింది మరియు ఇప్పుడు స్మార్ట్ టీవీ కోసం కూడా లాంచ్ చేసింది.
డోర్ ప్లే యాప్ ని గూగుల్ ప్లే స్టోర్ ను లిస్ట్ చేసింది. ఈ సూపర్ ఎంటర్టైన్మెంట్ యాప్ ని గూగుల్ ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకుని ఇన్స్టాల్ చేసుకోవాలి. ఈ యాప్ సబ్ స్క్రిప్షన్ ను Flipkart ద్వారా ఆఫర్ చేస్తోంది.
Dor Play App ప్లాన్స్ ఏమిటి?
డోర్ ప్లే యాప్ ని కంపెనీ ఉచితంగా ఆఫర్ చేయడం లేదు. ఈ యాప్ సర్వీస్ కోసం సబ్ స్క్రిప్షన్ తీసుకోవాల్సి ఉంటుంది. ఈ యాప్ సబ్ స్క్రిప్షన్ కోసం ప్రస్తుతం రూ. 399 రూపాయల ప్లాన్ అందించింది. ఈ ప్లాన్ మూడు నెలల సబ్ స్క్రిప్షన్ అందిస్తుంది. అంటే, కేవలం రూ. 399 తో ఈ ప్లాన్ సబ్ స్క్రిప్షన్ తీసుకునే యూజర్లు మూడు నెలల పాటు 20+ OTT మరియు 300+ లైవ్ టీవీలను ఎంజాయ్ చేయవచ్చని స్ట్రీమ్ బాక్స్ మీడియా తెలిపింది.
ఈ యాప్ తో డిస్నీ+ హాట్ స్టార్, ZEE5, Sony LIV, లయన్స్ గేట్ ప్లే, సన్ నెక్స్ట్, Dollywood Play, డిస్కవరీ+, ఫ్యాన్ కోడ్, షెమారు మీ, ఈటీవీ విన్, చౌపాల్, స్టేజ్, ట్రావెల్ XP, నమ్మ ఫ్లిక్స్, ఆహా, రాజ్ డిజిటల్, ప్లే ఫ్లిక్, డిస్ట్రో టీవీ, మనోరమ, VR ఓటీటీ మరియు OTT plus సబ్ స్క్రిప్షన్ ఒకే వద్ద అందిస్తుంది.
అయితే, ఇది కేవలం మొబైల్ ఫోన్ లలో మాత్రమే పని చేస్తుంది. టీవీ లేదా ల్యాప్ టాప్ లలో పని చేయదని కంపెనీ తెలిపింది.