రియల్ మీ ఈరోజు ఇండియాలో Realme Narzo 50 5G సిరీస్ ను విడుదల చేసింది. నార్జో 50 5G సిరీస్ నుండి రెగ్యులర్ మరియు ప్రో వేరియంట్ రెండు ఫోన్లను ప్రకటించింది. ఈ స్మార్ట్ ఫోన్లు కూడా చిప్ సెట్, డిస్‌ప్లే రకం మరియు వెనుక కెమెరా సెటప్ పరంగా విభిన్నంగా ఉంటాయి. అయితే, ఈ రెండు ఫోన్లలో కొన్ని సారూప్యతలు కూడా ఉన్నాయి.ఫోన్లు 48MP ప్రధాన కెమెరా, 90Hz రిఫ్రెష్ రేట్ మరియు 33W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కలిగిన 5000mAh బ్యాటరీ వంటి సారూప్యతలు కలిగి ఉన్నాయి. రియల్ మీ యొక్క ఈ కొత్త ఫోన్ల ధర, స్పెక్స్ మరియు ఫీచర్ల గురించి తెలుసుకుందామా.
Survey
✅ Thank you for completing the survey!
Realme Narzo 50 5G : ధర
రియల్‌మీ నార్జో 50 5G స్మార్ట్ ఫోన్ అన్ని వేరియంట్స్ ధరలను క్రింద చూడవచ్చు.
మే 24 నుండి Narzo 50 5G సేల్ ప్రారంభమవుతుంది మరియు Narzo 50 Pro 5G మే 26 నుండి అందుబాటులోకి వస్తుంది. ఈ ఫోన్లను రియల్ మీ అధికారిక వెబ్ సైట్, అమెజాన్ మరియు మీకు దఃహ్రాలోని అన్ని మొబైల్ స్టోర్ నుండి కొనుగోలు చేయవచ్చు.
Realme Narzo 50 5G & Pro 5G : స్పెక్స్
రియల్‌మీ నార్జో 50 స్మార్ట్ ఫోన్ 6.6 ఇంచ్ FHD+ డిస్ప్లే ని 90Hz రిఫ్రెష్ రేట్ తో కలిగివుంది. అయితే, Narzo 50 Pro 5G మాత్రం 6.4 ఇంచ్ AMOLED డిస్ప్లేని FHD+ రిజల్యూషన్ 360HZ టచ్ శాంప్లింగ్ రేట్ తో కలిగి వుంది. Narzo 50 Pro 5Gలో MediaTek డైమెన్సిటీ 920 SoC మరియు Narzo 50 ప్రాసెసర్‌లో MediaTek డైమెన్సిటీ 810 చిప్‌సెట్ ఉన్నాయి.నార్జో 50 5G మూడు మోడళ్లలో లభిస్తే, నార్జో 50 ప్రో 5G రెండు మోడళ్లలో లభిస్తుంది.
నార్జో 50 5G ఫోన్ లో వెనుక కెమెరాలలో 48MP సెన్సార్ మరియు పోర్ట్రెయిట్ లెన్స్ ఉన్నాయి, ముందు భాగంలో 8MP సెన్సార్ ఉంది. అయితే, నార్జో 50 ప్రో 5G స్మార్ట్ ఫోన్ లో వెనుక ట్రిపుల్ కెమెరా వుంది. ఇందులో, 48MP మైన్ సెన్సార్, 8MP అల్ట్రావైడ్ సెన్సార్ మరియు 2MP మాక్రో షూటర్‌ను కలిగి ఉంటాయి.