Realme GT7 ఇండియా లాంచ్ అనౌన్స్ చేసిన రియల్ మీ.!
Realme GT7 స్మార్ట్ ఫోన్ ను ఇండియాలో లాంచ్ అవుతోంది
రియల్ మీ ప్రీమియం స్మార్ట్ ఫోన్ సిరీస్ అయిన GT Series నుంచి ఈ ఫోన్ ను లాంచ్ చేస్తోంది
ఈ స్మార్ట్ ఫోన్ ను అమెజాన్ స్పెషల్ గా తీసుకు వస్తుంది
Realme GT7 స్మార్ట్ ఫోన్ ను ఇండియాలో లాంచ్ అవుతోంది. రియల్ మీ ప్రీమియం స్మార్ట్ ఫోన్ సిరీస్ అయిన GT Series నుంచి ఈ ఫోన్ ను లాంచ్ చేస్తోంది. వాస్తవానికి, గత వారం చైనాలో రియల్ మీ రియల్ మీ GT7 స్మార్ట్ ఫోన్ ను లాంచ్ చేసింది. ఇప్పుడు ఈ ఫోన్ ను ఇండియాలో కూడా లాంచ్ చేయడానికి సిద్దమయ్యింది. ఈ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ ఇండియా లాంచ్ కోసం టీజింగ్ మొదలు పెట్టింది.
SurveyRealme GT7 : లాంచ్ డేట్ ఏమిటీ?
రియల్ మీ GT7 స్మార్ట్ ఫోన్ లాంచ్ డేట్ ఇంకా అనౌన్స్ చేయలేదు. ఈ స్మార్ట్ ఫోన్ ను అమెజాన్ స్పెషల్ గా తీసుకు వస్తుంది. అంటే, ఈ స్మార్ట్ ఫోన్ కోసం అమెజాన్ ప్రత్యేకమైన సేల్ పార్ట్నర్ గా ఉంటుంది. రియల్ మీ ఈ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ ను GT6 నెక్స్ట్ జెనరేషన్ స్మార్ట్ ఫోన్ గా తీసుకొస్తోంది.
Realme GT7 : ఫీచర్స్
రియల్ మీ డేట్ మాత్రమే కాదు ఈ ఫోన్ యొక్క ఫీచర్స్ కూడా ఇంకా ప్రకటించలేదు. అయితే, ఈ స్మార్ట్ ఫోన్ 120 FPS వద్ద 6 గంటల స్టేబుల్ BGMI గేమింగ్ అందించే ఇండస్ట్రీ ఫస్ట్ ఫోన్ అవుతుందని రియల్ మీ గొప్పగా చెబుతోంది. అలాగే, రియల్ మీ టీజర్ ఇమేజ్ ద్వారా ఈ ఫోన్ చాలా స్లీక్ డిజైన్ మరియు అతి సన్నని అంచులు కలిగిన స్క్రీన్ కలిగి ఉన్నట్లు కనిపిస్తోంది. ఇది కంపెనీ అందించిన టీజర్ పేజీ ద్వారా కన్ఫర్మ్ అయిన వివరాలు.
ఒకవేళ రియల్ మీ చైనాలో అందించిన అదే GT7 స్మార్ట్ ఫోన్ ఇండియాలో కూడా అందించే మాత్రం భారీ ఫీచర్స్ తో లాంచ్ అవుతుంది. చైనాలో విడుదలైన రియల్ మీ GT6 స్మార్ట్ ఫోన్ కంప్లీట్ ఫీచర్స్ ఈ క్రింద చూడవచ్చు.
Realme GT7 : ఫీచర్స్ (చైనా)
రియల్ మీ GT7 చైనా వేరియంట్ కలిగిన ఫీచర్స్ విషయానికి వస్తే, రియల్ మీ ఈ ఫోన్ ను మీడియాటెక్ లేటెస్ట్ పవర్ ఫుల్ చిప్ సెట్ Dimensity 9400+ చిప్ సెట్ తో అందించింది. ఈ చిప్ సెట్ 30 లక్షలకు పైగా AnTuTu స్కోర్ అందిస్తుందని కోడోత్ కంపెనీ తెలిపింది. ఈ ఫోన్ లో 6,500 నిట్స్ పీక్ లోకల్ బ్రైట్నెస్, 144Hz రిఫ్రెష్ రేట్ మరియు ఇన్ స్క్రీన్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ కలిగి ఉంటుంది.

ఈ ఫోన్ లో 50MP (Sony IMX896) మెయిన్ సెన్సార్ + 8MP అల్ట్రా వైడ్ కెమెరా కలిగిన డ్యూయల్ రియర్ కెమెరా మరియు ముందు 16MP సెల్ఫీ కెమెరా కలిగి ఉంటుంది. ఈ ఫోన్ 4K స్టేబుల్ వీడియో సపోర్ట్ మరియు AI కెమెరా ఫీచర్స్ కూడా కలిగి ఉంటుంది.
రియల్ మీ ఈ ఫోన్ ను చైనా మార్కెట్ లో భారీ 7200 mAh టైటాన్ బ్యాటరీతో అందించింది. ఈ బ్యాటరీని అతి వేగంగా ఛార్జ్ చేసే 100W ఫ్లాష్ ఛార్జ్ సపోర్ట్ తో కూడా అందించింది. ఇవన్నీ కూడా చైనా వేరియంట్ కలిగిన ఫీచర్స్.
Also Read: boAt Chrome Horizon స్మార్ట్ వాచ్ ను వీడియో వాచ్ ఫేసెస్ ఫీచర్ తో లాంచ్ చేసింది.!
అయితే, ఇండియాలో విడుదల కాబోతున్న ఈ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ యొక్క ఫీచర్స్ లేదా స్పెక్స్ గురించి కంపెనీ ఇంకా ఎటువంటి అధికారిక ప్రకటన చేయలేదు. మరి ఇండియన్ వేరియంట్ ఎలా ఉంటుందో చూడాలి.