24 న వస్తున్న Realme Narzo 50 స్మార్ట్ ఫోన్ …! ఫీచర్లు ఎలా ఉన్నాయంటే ..!

HIGHLIGHTS

Realme Narzo 50 స్మార్ట్ ఫోన్ ను విడుదల చెయ్యడానికి రియల్ మీ సిద్దమవుతోంది

ఈ ఫోన్ యొక్క కీలకమైన స్పెక్స్ తో కూడా టీజింగ్ చేస్తోంది

మీడియాటెక్ హీలియో G96 చిప్‌సెట్ శక్తితో పనిచేస్తుంది

24 న వస్తున్న Realme Narzo 50 స్మార్ట్ ఫోన్ …! ఫీచర్లు ఎలా ఉన్నాయంటే ..!

Realme Narzo 50 స్మార్ట్ ఫోన్ ను ఫిబ్రవరి 24న ఇండియాలో విడుదల చెయ్యడానికి రియల్ మీ సిద్దమవుతోంది. ఇటీవలే, 9 Pro సిరీస్ నుండి రెండు స్మార్ట్ ఫోన్లను విడుదల చేసిన రియల్ మీ ఇప్పుడు Narzo సిరీస్ నుండి మరొక స్మార్ట్ ఫోన్ విడుదల చేస్తోంది. ఈ రియల్ మీ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ నార్జో 50 స్మార్ట్ ఫోన్ యొక్క టీజింగ్ కూడా మొదలుపెట్టింది. ఈ ఫోన్ యొక్క కీలకమైన స్పెక్స్ తో కూడా టీజింగ్ చేస్తోంది.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

Realme narzo 50.jpg

Realme Narzo 50: రివీల్డ్& అంచనా స్పెక్స్

ఇక Realme Narzo 50 యొక్క రివీల్డ్ స్పెక్స్ గురించి చూస్తే, ఈ ఫోన్ మీడియాటెక్ హీలియో G96 చిప్‌సెట్ శక్తితో పనిచేస్తుందని కంపెనీ తెలిపింది.  అలాగే, ఈ ఫోన్ లో అందించిన డిస్ప్లే గురించి కూడా రివీల్ చేసింది. ఈ ఫోన్ లో 120Hz అల్ట్రా స్మూత్ డిస్ప్లే ఉన్నట్లు రియల్ మీ పేర్కొంది. ఇక అంచనా స్పెక్స్ పరంగా, ఈ ఫోన్ 4+64GB మరియు 6+128GB వేరియంట్‌లతో అందించవచ్చని అంచనా వేస్తున్నారు. ఈ ఫోన్‌ స్పీడ్ బ్లాక్ మరియు స్పీడ్ బ్లూ రంగులలో అందించబడుతుంది.

ఈ రియల్ మీ అప్ కమింగ్  USB-C పోర్ట్ ద్వారా ఛార్జ్ చేయబడే 33W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కలిగిన 5000mAh బ్యాటరీతో ఉండవచ్చు.

కెమెరా విభాగంలో, ఈ ఫోన్‌లో 50MP + 2MP + 2MP వెనుక కెమెరా సెటప్ మరియు ఈ ఫోన్ ముందు భాగంలో 16MP సెల్ఫీ కెమెరా ఇవ్వబడింది. ఈ స్మార్ట్ ఫోన్ Android 12 (Android 12) ఆధారంగా realme UI 3.0లో పని చేస్తుంది.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo