Realme 9 5G: రియల్ మీ ఈరోజు రెండు కొత్త 5G ఫోన్లను విడుదల చేసింది!!

HIGHLIGHTS

ఈరోజు Realme 9 5G మరియు 9 5G స్పీడ్ ఎడిషన్(SE) లను విడుదల చేసింది

ఈ ఫోన్లు Android 11 ఆధారిత Realme UI 2.0

144Hz అడాప్టివ్ రిఫ్రెష్ రేట్ LCD స్క్రీన్‌ 600 నిట్స్ పీక్ బ్రైట్నెస్ స్పీడ్ ఎడిషన్ ప్యాక్ చేస్తుంది

Realme 9 5G: రియల్ మీ ఈరోజు రెండు కొత్త 5G ఫోన్లను విడుదల చేసింది!!

ఈరోజే రియల్ మీ తన 9 సిరీస్ నుండి Realme 9 5G మరియు 9 5G స్పీడ్ ఎడిషన్(SE) లను విడుదల చేసింది. వీటిలో రియల్ మీ 9 5G ఫోన్ ను మీడియాటెక్ 5G ప్రోసెసర్ తోనూ రియల్ మీ 9 5G స్పీడ్ ఎడిషన్ ను క్వాల్కామ్ 5G ప్రోసెసర్ తో ఇండియన్ మార్కెట్లో విడుదల చేసింది. ఈ రెండు స్మార్ట్ ఫోన్లు కూడా 5,000 mAh బిగ్ బ్యాటరీ, 48ఎంపి ట్రిపుల్ కెమెరా సెటప్ మరియు Android 11 వంటి ఒకేవిధమైన ఫీచర్లతో వస్తాయి. మరి రియల్ మీ లేటెస్ట్ గా విడుదల చేసిన ఈ కొత్త ఫోన్ల గురించి పూర్తి వివరాలను తెలుసు కుందాం.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

Realme 9 5G: స్పెక్స్

Realme 9 5G స్మార్ట్ ఫోన్ 6.5-అంగుళాల FHD+ రిజల్యూషన్ LCD స్క్రీన్ తో వస్తుంది. ఈ డిస్ప్లే 90Hz రిఫ్రెష్ రేట్ మరియు 180Hz టచ్ శాంప్లింగ్ రేట్ కలిగివుంది మరియు ఇది పంచ్-హోల్‌ డిజైన్ తో వస్తుంది. ఈ ఫోన్ డైమెన్సిటీ 810 ఆక్టా కోర్ ప్రోసెసర్ కి జతగా 6GB ర్యామ్ మరియు 128GB (UFS 2.1) స్టోరేజ్‌తో వస్తుంది.

వెనుకవైపు, ఈ ఫోన్ లో ట్రిపుల్ కెమెరా సెటప్ వుంది. ఇందులో 48MP ప్రైమరీ కెమెరా, 2MP (4cm) మాక్రో సెన్సార్ మరియు 2MP B/W సెన్సార్‌ ఉన్నాయి.ఈ కెమెరాతో 30FPS తో 1080P వీడియో రికార్డింగ్ చేయవచ్చు. అలాగే, ఈ ఫోన్ 5000mAh బ్యాటరీని 18W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో కలిగివుంది. డ్యూయల్ సిమ్, 3.5mm హెడ్‌ఫోన్ జాక్, 5GB వరకు వర్చువల్ ర్యామ్, డ్యూయల్-మోడ్ 5G, సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ రీడర్, బ్లూటూత్ 5.1 మొదలైన ఫీచర్లు కూడా అందుకుంటారు.

Realme 9 5G: ధర

Realme 9 5G యొక్క బేసిక్ వేరియంట్ (4GB+64GB) ధర రూ.14,999 మరియు మరొక వేరియంట్ (6GB +128GB) ధర రూ.17,499. మార్చి 14న మధ్యాహ్నం 12 గంటలకు Flipkart మరియు Realme.com నుండి ఈ రెండు స్మార్ట్ ఫోన్ల మొదటి సేల్ జరుగుతుంది.

Realme 9 SE.jpg

Realme 9 5G స్పీడ్ ఎడిషన్: స్పెక్స్

రియల్ మీ 9 5G SE ఫోన్ 6.6-అంగుళాల 144Hz అడాప్టివ్ రిఫ్రెష్ రేట్ LCD స్క్రీన్‌ను 240Hz టచ్ శాంప్లింగ్ రేట్, HDR10, DCI-P3 కలర్ గామట్ మరియు 600 నిట్స్ పీక్ బ్రైట్నెస్ తో ప్యాక్ చేస్తుంది. స్పీడ్ ఎడిషన్ వెనుకవైపు, 48MP ప్రధాన సెనర్ తో పాటు 2MP మాక్రో ప్లస్ మోనోక్రోమ్ సెన్సార్‌తో కూడిన కెమెరాను పొందుతారు. ఈ ఫోన్ తో మీరు 30 FPS వద్ద 4K వరకు వీడియోని షూట్ చేయవచ్చు.

ఈ స్మార్ట్ ఫోన్ వేగవంతమైన స్నాప్‌డ్రాగన్ 778G ఆక్టా కోర్ ప్రోసెసర్ కి జతగా 8GB LPDDR4x RAM మరియు 128GB UFS 2.2 స్టోరేజ్ లను కలిగివుంది. ఈ ఫోన్‌లో 30W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌ క్లైగిన 5000mAh బ్యాటరీ కూడా ఉంది. ఈ ఫోన్ Android 11 ఆధారిత Realme UI 2.0, డ్యూయల్ 5G సపోర్ట్, 3.5mm జాక్, WiFi 6, బ్లూటూత్ 5.2, మొదలైన వాటితో వస్తుంది.

Realme 9 5G SE: ధర 

Realme 9 SE బేస్ వేరియంట్‌(6GB + 128GB) ధర రూ.19,999 మరియు 8GB + 128GB మోడల్‌ ధర రూ.22,999. మార్చి 14న మధ్యాహ్నం 12 గంటలకు Flipkart మరియు Realme.com నుండి ఈ రెండు స్మార్ట్ ఫోన్ల మొదటి సేల్ జరుగుతుంది.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo