కేవలం రూ. 10,999 ధరకే జబర్దస్త్ 5G Smartphone విడుదల చేసిన Realme

కేవలం రూ. 10,999 ధరకే జబర్దస్త్ 5G Smartphone విడుదల చేసిన Realme
HIGHLIGHTS

రియల్ మి బడ్జెట్ 5G Smartphone ను జబర్దస్త్ ఫీచర్స్ తో రూ. 10,999 కే విడుదల చేసింది

రియల్ మి బడ్జెట్ కేటగిరిలో కొత్త ఫోన్లను చాలా త్వరగా విడుదల చేస్తోంది

కూపన్ డిస్కౌంట్ ఆఫర్ తో ఈ ఫోన్ ను 10 వేల ధరలో అందుకునే అవకాశం వుంది

Realme ఈరోజు ఇండియాలో తన లేటెస్ట్ బడ్జెట్ 5G Smartphone ను జబర్దస్త్ ఫీచర్స్ తో కేవలం రూ. 10,999 ధరకే విడుదల చేసింది. ఇండియాలో ఇప్పటికే 5జి ఫోన్ల హవా కొనసాగుతుండగా, రియల్ మి బడ్జెట్ కేటగిరిలో కొత్త ఫోన్లను చాలా త్వరగా విడుదల చేస్తోంది. ఇటీవల, P1 సిరీస్ నుండి కొత్త ఫోన్ లను విడుదల చేసిన రియల్ మీ ఇప్పుడు Realme NARZO 70x 5G స్మార్ట్ ఫోన్ ను కూడా లాంఛ్ చేసింది.

Realme 5G స్మార్ట్‌ఫోన్

రియల్ మీ ఈరోజు ఇండియాలో నార్జో 70X సిరీస్ నుంచి రెండు ఫోన్లు విడుదల చేసింది. వీటిలో Realme NARZO 70x 5G స్మార్ట్ ఫోన్ ను కేవలం 12 వేల రూపాయల కేటగిరిలో జబర్దస్త్ ఫీచర్లతో లాంఛ్ చేసింది. వాస్తవానికి, ఈ ఫోన్ ను 12 వేల రూపాయల కేటగిరిలో విడుదల చేసినా, ఈ ఫోన్ పైన అందించిన కూపన్ డిస్కౌంట్ ఆఫర్ తో ఈ ఫోన్ ను 10 వేల ధరలో అందుకునే అవకాశం వుంది.

Realme NARZO 70x 5G : Price

రియల్ మి నార్జో 70x 5జి స్మార్ట్ ఫోన్ ను రూ. 11,999 రూపాయల ప్రారంభ ధరతో విడుదల చేసింది. ఈ ఫోన్ యొక్క 4GB + 128GB వేరియంట్ ను ఈ ప్రైస్ తో అందించింది. అలాగే, ఈ ఫోన్ యొక్క 6GB+128GB వేరియంట్ ను రూ. 13,499 ధరతో విడుదల చేసింది. అయితే, ఈ ఫోన్ పైన అందించిన రూ. 1,500 కూపన్ ఆఫర్ ద్వారా ఈ ఫోన్ ను రూ. 11,999 రూపాయల ధరకే అందుకోవచ్చు.

Realme NARZO 70x 5G Smartphone Sale offers
Realme NARZO 70x 5G Smartphone Sale offers

ఈ ఫోన్ యొక్క ఎర్లీ బర్డ్ సేల్ ఈరోజు సాయంత్రం 6 PM నుంచి 8 PM వరకు జరుగుతుంది. అంతేకాదు, ఈ సేల్ నుండి ఈ ఫోన్ ను కొనుగోలు చేసే యూజర్లకు రూ. 1,299 విలువైన Realme Buds T110 ను కూడా ఉచితంగా పొందవచ్చు అని కంపెనీ తెలిపింది.

Also Read : చవక ధరలో 24GB RAM తో వచ్చిన Infinix Note 40 Pro+ 5G ఫస్ట్ సేల్.!

Realme NARZO 70x 5G : ప్రత్యేకతలు

రియల్ మీ ఈ ఫోన్ ను జబర్దస్త్ ఫీచర్స్ తో తీసుకు వచ్చినట్లు తెలిపింది. ఈ ఫోన్ ను ఈ బడ్జెట్ కేటగిరిలో 45W ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ కలిగిన ఫోన్ గా తీసుకు వచ్చింది. ఈ ఫోన్ లో పెద్ద 5000 mAh బ్యాటరీ కూడా కలిగి వుంది. ఈ ఫోన్ లో 6.72 ఇంచ్ బిగ్ డిస్ప్లేని 120Hz రిఫ్రెష్ రేట్ మరియు 950 నిట్స్ పీక్ బ్రైట్నెస్ మరియు 91.4% స్క్రీన్ టూ బాడీ రేషియోతో అందించింది.

ఈ ఫోన్ మీడియాటెక్ లేటెస్ట్ బడ్జెట్ ప్రోసెసర్ Dimensity 6100+ చిప్ సెట్ మరియు జతగా 6GB RAM + 6GB డైనమిక్ ర్యామ్ ఫీచర్ తో టోటల్ 12GB ర్యామ్ ఫీచర్ ను అందిస్తుంది. అలాగే, 128GB బిగ్ స్టోరేజ్ ను కూడా కలిగి ఉంటుంది. ఈ ఫోన్ త్వరగా చల్లబరచడానికి వీలుగా VC Cooling సిస్టమ్ ను కూడా జత చేసింది.

ఇక ఈ ఫోన్ లో అందించిన కెమేరా సెటప్ వివరాల్లోకి వెళితే, ఈ ఫోన్ లో వెనుక 50MP AI డ్యూయల్ రియర్ కెమేరా మరియు ముందు 8MP సెల్ఫీ కెమేరా ఉన్నాయి. ఈ ఫోన్ కెమేరా 1080p వీడియోలను 30fps వద్ద షూట్ చేయడానికి అనుమతిస్తుంది. ఇక ఈ ఫోన్ లో అందించియున్న ఇతర ఫీచర్స్ విషయానికి వస్తే, డ్యూయల్ స్టీరియో స్పీకర్లు, IP54 డస్ట్ & వాటర్ రెసిస్టెంట్ మరియు మినీ క్యాప్సూల్ 2.0 వంటి ఇతర ఫీచర్లు ఈ ఫోన్ లో ఉన్నాయి.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo