రియల్మీ C3 ఫోన్ కేవలం రూ.6,999 ధరలో గేమింగ్ ప్రాసెసర్, పెద్ద బ్యాటరీతో విడుదలయ్యింది

రియల్మీ C3 ఫోన్ కేవలం రూ.6,999 ధరలో గేమింగ్ ప్రాసెసర్, పెద్ద బ్యాటరీతో విడుదలయ్యింది
HIGHLIGHTS

ఫాస్ట్ ఇంటర్నెట్ అందించే ఫోనుగా ఉంటుంది.

ఈరోజు ఆన్లైన్ లాంచ్ ఈవెంట్ ద్వారా తన సరికొత్త స్మార్ట్ ఫోన్ అయినటువంటి Realme C3 స్మార్ట్ ఫోన్ను ఇండియన్ మార్కెట్లోకి విడుదల చేసింది. ఈ స్మార్ట్ ఫోన్, మీడియా టెక్ హీలియో G70 చిప్సెట్ తో విడుదలైన మొట్టమొదటి స్మార్ట్ ఫోనుగా నిలుస్తుంది మరియు ఇది ఎంట్రీ లెవెల్ గేమింగ్ చిప్సెట్ కాబట్టి గేమింగ్ ప్రియులకు శుభవార్తే అవుతుంది. ఎందుకంటే, కేవలం రూ.6,999 ధరలో మీకు మంచి గేమింగ్, కెమేరా మరియు మంచి ఫాస్ట్ ఇంటర్నెట్ అందించే ఫోనుగా ఉంటుంది.  flipkart మరియు realme.com వంటి ఆన్లైన్ ప్లాట్ఫారల ద్వారా ఫిబ్రవరి 14 వ తేదికి మొట్టమొదటి సరిగా అమ్మకాలను సాగించనుంది.                    

ఈ రియల్మీ C3 స్మార్ట్ ఫోన్ యొక్క డిస్ప్లేని, ప్రస్తుతం రియల్మీ అన్ని ఫోన్లలో అందిస్తున్న MiniDrop నోచ్ డిస్ప్లేని ఒక 6.5 అంగుళాల పరిమాణంతో ఇస్తోంది. ఇక ఈ డిస్ప్లే ని ఒక కార్నింగ్ గొరిల్లా గ్లాస్ యొక్క ప్రొటెక్షన్ తో మరియు 89.9% స్క్రీన్-టూ-బాడీ రేషియాతో వస్తుంది. మీడియా టెక్ హీలియో ఇటీవల ప్రకటించిన ఎంట్రీ లెవాల్ గేమింగ్ ప్రాసెసర్ అయినటువంటి, MediaTek Helio G70 ఆక్టా కోర్ ప్రాసెసర్ తో, ఈ రియల్మీ C3 స్మార్ట్  ఫోన్ను ప్రకటించింది. ఈ ప్రాసెసర్ తో విడుదలైన  మొట్ట మొదటి స్మార్ట్ ఫోనుగా Realme C3 ఈ జాబితాలో నిలుస్తుంది.

ఇక ఈ ప్రాసెసర్ గురించి మాట్లాడితే, ఇది గరిష్ఠంగా 2Ghz వరకూ క్లాక్ స్పీడ్ అందిస్తుంది మరియు ARM G52 GPU తో వస్తుంది. ఇది మీకు ప్రీమియం గ్రాఫిక్స్ చూసేందుకు వీలు కల్పిస్తుంది. ముఖ్యంగా, ఇది నెట్ వర్క్ ని మెరుగుపరిచేలా 300Mbps డౌన్లోడ్ లింక్ స్పీడ్ కలిగిన డ్యూయల్ 4G మోడెమ్ తో ఇది వస్తుంది. అంటే, మీ ఆన్లైన్ మరియు గేమింగ్ ఎక్స్పీరియన్సు మరింత చక్కగా మారుతుంది.

ఈ ఫోన్ను రెండు ర్యామ్ వేరియంట్ ఎంపికలతో రియల్మీ ప్రకటించింది. అవి : 3GB ర్యామ్ +32GB స్టోరేజి మరియు 4GB + 64GB స్టోరేజి వంటి రెండు వేరియంట్లను అందించింది. వాటి ధరలు క్రింద చూడండి.

1. రియల్మీ C3 – (3GB ర్యామ్ + 32GB స్టోరేజి) ధర -Rs.6,999                  

2. రియల్మీ C3 – (4GB ర్యామ్ + 64GB స్టోరేజి) ధర -Rs.7,999                  

ఈ ఫోన్ లో కేవలం డ్యూయల్ కెమెరాని మాత్రమే అందించింది. ఈ డ్యూయల్ కెమెరాలో, f/1.8 ఎపర్చర్ కలిగిన ఒక 12MP ప్రధాన కెమెరా మరియు జతగా మరొక 2MP డెప్త్ సెన్సారుతో వుంటుంది. సెల్ఫీ కెమేరా గురించి చూస్తే, ఇందులో ఒక 5MP సెల్ఫీ కెమేరాని అందించింది. ఈ ఫోన్ యొక్క కెమేరా Chroma Boost ఫీచరుతో వస్తున్నట్లు చెబుతోంది. ఇక మిగిలిన కెమేరా ప్రత్యేకతలు గురించి చూస్తే, స్లోమోషన్ వీడియో, HDR మోడ్ మరియు పనోరమా సెల్ఫీ వంటి ఫీచర్లను హైలెట్ చేసి చూపిస్తోంది.

ఈ రియల్మీ C3 ని ఒక అతిపెద్ద 5,000mAh బ్యాటరీతో విడుదల చేసింది. అలాగే, దీనితో ఒక పవర్ బ్యాంక్ లాగా రివర్స్ ఛార్జ్ కూడా చేసే వీలుంటుంది. ఇక ఫోను గురించిన మరొక విశేషం ఏమిటంటే, Realme యొక్క సొంత UI అయినటువంటి బాక్స్ నుండి Realme UI తో వచ్చిన మొట్టమొదటి స్మార్ట్ ఫోన్ ఇదే అవుతుంది          

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo