లాంచ్ అయిన REALME 5s : అతితక్కువ ధరతో మంచి ఫీచర్లతో వచ్చింది

లాంచ్ అయిన REALME 5s : అతితక్కువ ధరతో మంచి ఫీచర్లతో వచ్చింది
HIGHLIGHTS

ఒక 48MP ప్రధాన కెమెరాను ఇవ్వడం పెద్ద మార్పుగా చెప్పొచ్చు.

గత కొద్దీ రోజులుగా టీజింగులతో అదరగొడుతున్న రియల్మీ యొక్క స్మార్ట్ ఫోన్ అయినటువంటి REALME 5s స్మార్ట్ ఫోన్ను,  ఎట్టకేలకు ఈరోజు ఇండియాలో విడుదల చేసింది.దేనికంటే, ముందుగా బడ్జెట్ ధరలో లాంచ్ చేసినటువంటి రియల్మీ5 మాదిరిగానే ఈ ఫోన్ కూడా అటువంటి ప్రత్యేకతలతోనే వచ్చింది. కానీ, కెమేరాల పరంగా ఈ స్మార్ట్ ఫోన్ కొంత వైవిధ్యంగా ఉంటుంది. ఇందులో ఒక 48MP ప్రధాన కెమెరాను ఇవ్వడం పెద్ద మార్పుగా చెప్పొచ్చు.        

Realme 5s  ధరలు

1. Realme 5s  (4GB + 64GB) ధర – Rs.9,999

2. Realme 5s  (4GB + 128GB) ధర – Rs.10,999   

Realme 5 :  ప్రత్యేకతలు

 ఈ Realme 5s స్మార్ట్ ఫోన్, ఒక 6.5 అంగుళాల మినీ డ్రాప్ డిజైన్ డిస్ప్లేతో వస్తుంది. ఈ అతి చిన్నని నోచ్ డిజైనులో ఒక సెల్ఫీ కెమేరాని ఇందులో అందించింది. ఈ స్మార్ట్ఫోన్ 89 శాతం స్క్రీన్-టు-బాడీ నిష్పత్తితో వస్తుంది. అలాగే, వెనుక భాగంలో సరికొత్తగా ఒక క్రిస్టల్ డిజైన్ అందించింది. ఇందులో 10 W వేగవంతమైన ఛార్జింగ్ టెక్నాలజీతో 5000 mAh బ్యాటరీతో వస్తుంది. ఈ స్మార్ట్ ఫోన్స్ ఒక స్నాప్డ్రాగెన్ 665 ఆక్టా కోర్ ప్రాసెసరుతో పనిచేస్తుంది. ఇది గరిష్టంగా, 2.0GHz వరకు క్లాక్ స్పీడును అందిస్తుంది దీని జతగా 3GB/4GB ర్యామ్ మరియు 32GB /64GB /128GB స్టోరేజి ఎంపికలతో ఎంచుకోవచ్చు.

ఈ  స్మార్ట్ ఫోను యొక్క వెనుక భాగంలో ఒక క్వాడ్ కెమేరా సెటప్పును  అందించింది. ఒక ప్రధాన 48MP (samsung GM1) కెమేరాతో కూడిన క్వాడ్ రియర్ కెమెరా ఇందులో ఇవ్వబడింది. అలాగే, ఇది 8MP వైడ్ యాంగిల్ లెన్స్ మరియు 2MP డెప్త్ సెన్సార్ కి జతగా 2MP మాక్రో కెమేరా కలిగి ఉంది. ఈ కెమెరాలో అందించిన కెమేరాతో 10X డిజిటల్ జూమ్ చేసుకోవచ్చు. ముందు కెమెరా విషయానికి వస్తే, 13 MP  సెల్ఫీ కెమేరాతో వస్తుంది. ఇది క్రిస్టల్ బ్లూ , క్రిస్టల్ పర్పల్ మరియు క్రిస్టల్ రెడ్ వంటి మూడు రంగుల ఎంపికలతో లభిస్తుంది. ఈ ఫోన్, కలర్ OS 6 స్కిన్ తో ఆండ్రాయిడ్ 9 ఫై ఆధారితంగా నడుస్తుంది.  

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo