రియల్ మీ ఇండియాలో లేటెస్ట్ గ విడుదల చేసిన బడ్జెట్ గేమింగ్ స్మార్ట్ ఫోన్ నార్జో 50. ఈ స్మార్ట్ ఫోన్ కేవలం బడ్జెట్ ధరలో హీలియో G96 ఆక్టా కోర్ గేమింగ్ ప్రొసెసర్, 120Hz హై రిఫ్రెష్ రేట్ డిస్ప్లే మరియు 33W డార్ట్ ఛార్జ్ వంటి ఆకర్షణీయమైన స్పెక్స్ తో వచ్చింది. ఈ ఫోన్ రేపు మధ్యాహ్నం 12 గంటలకు మొదటి సారిగా అమ్మకానికి రానుంది. ఈ ఫోన్ అమెజాన్ స్పెషల్స్, realme.com మరియు మీ దగ్గరలోని రిటైల్ స్టార్ లలో కూడా లభిస్తుంది.
Survey
✅ Thank you for completing the survey!
Realme Narzo 50: ధర
రియల్‌మీ నార్జో 50 స్మార్ట్ ఫోన్ స్టార్టింగ్ వేరియంట్ 4GB ర్యామ్ మరియు 64GB స్టోరేజ్ తో రూ.12,999 రూపాయల ప్రారంభ ధరతో వచ్చింది. రెండవ వేరియంట్ 6GB ర్యామ్ మరియు 128GB స్టోరేజ్ తో రూ.15,499 ధరతో ప్రకటించబడింది. ఈ
రియల్‌మీ నార్జో 50 స్మార్ట్ ఫోన్ 6.6 ఇంచ్ FHD+ డిస్ప్లే ని 120Hz రిఫ్రెష్ రేట్ తో కలిగివుంది. ఈ డిస్ప్లే 90% స్క్రీన్ టూ బాడీ రేషియో మరియు 180 టచ్ శాంప్లింగ్ రేట్ తో వస్తుంది.ఈ ఫోన్ మీడియాటెక్ Helio G96 ఆక్టా కోర్ ప్రోసెసర్ శక్తితో పనిచేస్తుంది మరియు దీనికి జతగా 6GB ర్యామ్ కూడా ఉంది. అదనంగా, ఈ ఫోన్ లో అందించిన డైనమిక్ ర్యామ్ ఎక్స్ ఫ్యాన్షన్ ఫీచర్లతో 5GB వరకు వర్చువల్ జత అవుతుందని కూడా తెలిపింది. అంటే, 6GB + 5GB తో 11GB వరకూ పనితనాన్ని అందించగలదని వెల్లడించింది.
ఈ ఫోన్ లో వెనుక ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ వుంది. ఇందులో, 50MP మైన్ సెన్సార్, 2MP మ్యాక్రో సెన్సార్ మరియు 2MP B&W కెమెరాని కలిగి ఉంది. ఇక సెల్ఫీల కోసం 16MP ఇన్ డిస్ప్లే సెల్ఫీ కెమెరాని కూడా కలిగివుంది. ఈ ఫోన్ Realme UI 2.0 స్కిన్ పైన Android 11 OS పైన నడుస్తుంది. ఈ ఫోన్ 33W డార్ట్ ఛార్జ్ సపోర్ట్ కలిగిన 5,000 బిగ్ బ్యాటరీతో వచ్చింది. ఈ ఫోన్ సైడ్ మౌంట్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ తో వస్తుంది మరియు స్పీడ్ బ్లూ మరియు స్పీడ్ బ్లాక్ అనే రెండు కలర్ లలో లభిస్తుంది.