Realme GT8 Pro కీలక ఫీచర్స్ రివీల్ చేసిన రియల్ మీ.!
Realme GT8 Pro స్మార్ట్ ఫోన్ ఇండియా లాంచ్ అనౌన్స్ చేసింది
ఈ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ డిజైన్ మరియు కీలక ఫీచర్స్ కూడా రిలీజ్ చేసింది
రియల్ మీ GT8 ప్రో Snapdragon 8 Elite Gen 5 తో లాంచ్ అవుతుంది
Realme GT8 Pro స్మార్ట్ ఫోన్ ఇండియా లాంచ్ అనౌన్స్ చేసింది. ఈ స్మార్ట్ ఫోన్ లాంచ్ అనౌన్స్ చేస్తూ రియల్ మీ అఫీషియల్ X అకౌంట్ నుంచి ట్వీట్ చేసింది. ఈ ట్వీట్ నుంచి ఈ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ డిజైన్ మరియు కీలక ఫీచర్స్ కూడా రిలీజ్ చేసింది. కొత్త అప్డేట్ ద్వారా ఈ అప్ కమింగ్ ఫోన్ రియల్ మీ ఫోన్స్ లో ఎన్నడూ చూడని కొత్త డిజైన్ కలిగి ఉన్నట్లు క్లియర్ గా అర్థం అవుతోంది. ఈ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ గురించి కంపెనీ కొత్తగా విడుదల చేసిన అప్డేట్ పై ఒక లుక్కేద్దామా.
SurveyRealme GT8 Pro : లాంచ్
రియల్ మీ GT8 ప్రో స్మార్ట్ ఫోన్ ఇండియా లాంచ్ డేట్ ఇంకా అనౌన్స్ చేయలేదు. అయితే, ఈ ఫోన్ కీలక ఫీచర్స్ ఈరోజు కంపెనీ రిలీజ్ చేసింది. ఈ ఫోన్ కోసం ఫ్లిప్ కార్ట్ సేల్ పార్ట్నర్ గా ఉంటుంది. అందుకే, ఈ ఫోన్ కోసం ప్రత్యేకమైన టీజర్ పేజీ తో టీజింగ్ చేస్తోంది.
Realme GT8 Pro : కీలక ఫీచర్స్
రియల్ మీ GT8 ప్రో స్మార్ట్ ఫోన్ క్వాల్కమ్ లేటెస్ట్ పవర్ ఫుల్ చిప్ సెట్ Snapdragon 8 Elite Gen 5 టోడ్ లాంచ్ అవుతుంది. ఈ ఫోన్ చిప్ సెట్ గురించి కంపెనీ వివరాలు వెల్లడించింది మరియు డిస్ప్లే కోసం అదనపు చిప్ కూడా ఉంటుంది. ఈ ఫోన్ లో స్క్రీన్ కోసం హైపర్ విజన్ AI చిప్ ని అదనంగా అందించింది. ఇక డిజైన్ విషయానికి వస్తే, ఈ ఫోన్ లో వెనుక సరికొత్త కెమెరా మోడ్యూల్ ఉంటుంది. ఇది ఈ ఫోన్ లుక్ ని పూర్తిగా మార్చేస్తుంది.

జిటి 8 ప్రో స్మార్ట్ ఫోన్ లో వెనుక ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో ఇక టెలిస్కోప్ కెమెరా మరియు మరో రెండు కెమెరాలు ఉంటాయి. ప్రముఖ కాంపాక్ట్ డిజిటల్ కెమెరా కీ ప్లేయర్ RICOH GR కో ఇంజనీరింగ్ ద్వారా ఈ ఫోన్ కెమెరా అందించినట్లు రియల్ మీ తెలిపింది. ఈ కెమెరా ఫీచర్ ఈ ఫోన్ ను ఇతర ఫోన్స్ తో పోటీ లేనిదిగా చేస్తుంది. ఇందులో కెమెరా సెటప్ పెద్ద సౌండ్ బంప్ లో ఉంటుంది.
Also Read: Lava Agni 4: మెటల్ ఫ్రెమ్ మరియు ప్రీమియం డిజైన్ తో వస్తోంది.!
రియల్ మీ GT8 ప్రో స్మార్ట్ ఫోన్ లంచ్ డేట్ మరియు మరిన్ని కీలక ఫీచర్లు కూడా రియల్ మీ త్వరలోనే అనౌన్స్ చేస్తుంది. వాస్తవానికి, ఈ ఫోన్ నవంబర్ నెలలో లాంచ్ అవుతుందని రియల్ మీ ఇప్పటికే అనౌన్స్ చేసింది. ఈ ఫోన్ యొక్క కచ్చితమైన లాంచ్ డేట్ అనౌన్స్ కావాల్సి ఉంది.
Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile
