Realme GT7 సరికొత్త ఐస్ సెన్స్ డిజైన్ తో లాంచ్ అవుతోంది.!
Realme GT7 స్మార్ట్ ఫోన్ ను ఇండియాలో లాంచ్ చేస్తున్నట్లు ప్రకటించిన కంపెనీ
ఇప్పుడు ఈ ఫోన్ యొక్క ఫీచర్స్ తో టీజింగ్ వేగాన్ని పెంచింది
కీలకమైన ఫీచర్స్ మరియు కలర్ వేరియంట్ వివరాలతో కొత్త టీజర్ అందించింది
Realme GT7 స్మార్ట్ ఫోన్ ను ఇండియాలో లాంచ్ చేస్తున్నట్లు ప్రకటించిన కంపెనీ, ఇప్పుడు ఈ ఫోన్ యొక్క ఫీచర్స్ తో టీజింగ్ వేగాన్ని పెంచింది. ఈ ఫోన్ యొక్క కీలకమైన ఫీచర్స్ మరియు కలర్ వేరియంట్ వివరాలతో కొత్త టీజర్ అందించింది. ఈ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ గురించి రియల్ మీ అందించిన లేటెస్ట్ అప్డేట్ ఏమిటో ఒక లుక్కేద్దామా.
SurveyRealme GT7 : కొత్త అప్డేట్
రియల్ మీ జిటి 7 స్మార్ట్ ఫోన్ ఇండియా లాంచ్ గురించి కంపెనీ అనౌన్స్ చేసింది. అయితే, ఈ ఫోన్ లాంచ్ డేట్ మాత్రం ఇంకా ప్రకటించలేదు. కానీ, ఈ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ యొక్క కీలకమైన ఫీచర్స్ తో టీజింగ్ మాత్రం చేస్తోంది. ఈరోజు ఈ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ యొక్క కొత్త అప్డేట్ ను కూడా రియల్ మీ అందించింది.

రియల్ మీ జిటి 7 స్మార్ట్ ఫోన్ ను గ్రాఫీన్ కవర్ ఐస్ సెన్స్ డిజైన్ కలిగిన మొదటి ఫోన్ గా తీసుకొస్తున్నట్లు కన్ఫర్మ్ చేసింది. ఈ ఫోన్ రెండు కలర్ ఆప్షన్ లలో లభిస్తుందని కూడా కంపెనీ అనౌన్స్ చేసింది. ఈ రియల్ మీ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ ఐస్ సెన్స్ బ్లూ మరియు ఐస్ సెన్స్ బ్లాక్ రెండు కలర్ లలో లాంచ్ అవుతుందని రియల్ మీ కన్ఫర్మ్ చేసింది.
ఈ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ డిజైన్ వివరించే టీజర్ ఇమేజ్ ను కూడా ఈరోజు విడుదల చేసింది. ఈ ఫోన్ చూడటానికి చైనాలో విడుదలైన వేరియంట్ మాదిరిగా కనిపిస్తోంది. ఈ ఫోన్ శక్తివంతమైన బ్యాటరీ మరియు అల్ట్రా ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ తో లాంచ్ అవుతుందని కూడా కంపెనీ టీజింగ్ ద్వారా వెల్లడించింది.
Also Read: MOTOROLA Edge 60 Pro సేల్ కి అందుబాటులోకి వచ్చింది: ధర మరియు ఫీచర్స్ తెలుసుకోండి.!
Realme GT7 : అంచనా ఫీచర్స్ (చైనా వేరియంట్)
రియల్ మీ జిటి 7 స్మార్ట్ ఫోన్ చూడటానికి చైనా వేరియంట్ మాదిరిగా గా కనిపిస్తుంది. ఒకవేళ ఈ ఫోన్ ఫీచర్స్ కూడా ఇదే ఫోన్ ను పోలి ఉండవచ్చని ఈ అంచనా ఫీచర్స్ వెల్లడిస్తున్నారు. ఈ ఫోన్ మీడియాటెక్ లేటెస్ట్ 3nm పవర్ ఫుల్ చిప్ సెట్ Dimensity 9400+ తో లాంచ్ అయ్యే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. అల్ట్రా సోనిక్ 3D ఫింగర్ ప్రింట్ సెన్సార్ మరియు 144Hz రిఫ్రెష్ రేట్ కలిగిన గొప్ప స్క్రీన్ తో ఈ ఫోన్ లాంచ్ కావచ్చని కూడా అంచనా.
రియల్ మీ జిటి 7 లో పవర్ Sony కెమెరా కలిగిన కెమెరా సెటప్ కలిగి ఉండవచ్చు. ఈ ఫోన్ లో 7200mAh బిగ్ బ్యాటరీ మరియు 100W సూపర్ ఫ్లాష్ ఛార్జ్ సపోర్ట్ కూడా ఉండవచ్చని అంచనా వేస్తున్నారు. అయితే, రియల్ మీ నుంచి అధికారిక ప్రకటన వచ్చే వరకు ఇవన్నీ కూడా అంచనా ఫీచర్స్ గా మాత్రమే పరిగణించాలి.