MOTOROLA Edge 60 Pro సేల్ కి అందుబాటులోకి వచ్చింది: ధర మరియు ఫీచర్స్ తెలుసుకోండి.!

HIGHLIGHTS

MOTOROLA Edge 60 Pro స్మార్ట్ ఫోన్ ఈరోజు నుంచి సేల్ కి అందుబాటులోకి వచ్చింది

ఈ స్మార్ట్ ఫోన్ ను సరికొత్త డిజైన్ మరియు కలర్ ఆప్షన్ లతో మోటోరోలా అందించింది

ఈ ఫోన్ పై Flipkart Axis Bank క్రెడిట్ కార్డ్ 5% బ్యాంక్ ఆఫర్ కూడా అందించింది

MOTOROLA Edge 60 Pro సేల్ కి అందుబాటులోకి వచ్చింది: ధర మరియు ఫీచర్స్ తెలుసుకోండి.!

MOTOROLA Edge 60 Pro స్మార్ట్ ఫోన్ ఈరోజు నుంచి సేల్ కి అందుబాటులోకి వచ్చింది. ఈ స్మార్ట్ ఫోన్ ను సరికొత్త డిజైన్ మరియు కలర్ ఆప్షన్ లతో మోటోరోలా అందించింది. ఈ లేటెస్ట్ స్మార్ట్ ఫోన్ లేటెస్ట్ చిప్ సెట్, పవర్ ఫుల్ కెమెరా మరియు మరిన్ని ఫీచర్స్ తో ఇండియన్ మార్కెట్లో లాంచ్ అయ్యింది మరియు ఈరోజు మొదటిసారిగా సేల్ కి అందుబాటులోకి వచ్చింది.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

MOTOROLA Edge 60 Pro : ప్రైస్

మోటోరోలా ఎడ్జ్ 60 ప్రో స్మార్ట్ ఫోన్ రెండు వేరియంట్స్ లో లాంచ్ అయ్యింది. ఈ ఫోన్ యొక్క 8GB + 128GB వేరియంట్ రూ. 29,999 ధరతో మరియు 12GB + 256GB వేరియంట్ రూ. 33,999 ధరతో లాంచ్ అయ్యింది. ఈ ఫోన్ ఈరోజు నుంచి Flipakrt మరియు మోటోరోలా అధికారిక వెబ్సైట్ నుంచి సేల్ కి అందుబాటులోకి వచ్చింది. ఫ్లిప్ కార్ట్ ఈ ఫోన్ పై Flipkart Axis Bank క్రెడిట్ కార్డ్ 5% బ్యాంక్ ఆఫర్ కూడా అందించింది.

MOTOROLA Edge 60 Pro : ఫీచర్స్

మోటోరోలా ఎడ్జ్ 60 ప్రో స్మార్ట్ ఫోన్ 6.7 ఇంచ్ Super HD+ 1.5K స్క్రీన్ కలిగి ఉంటుంది. ఈ స్క్రీన్ HDR10+ సపోర్ట్, 120Hz రిఫ్రెష్ రేట్, ఇన్ స్క్రీన్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ మరియు 4500 వంటి ఆకట్టుకునే ఫీచర్స్ కలిగి ఉంటుంది. ఈ మోటోరోలా స్మార్ట్ ఫోన్ మీడియాటెక్ Dimensity 8350 చిప్ సెట్ తో పని చేస్తుంది మరియు దీనికి జతగా 12GB LPDDR5X మరియు 256GB (UFS 4.0) స్టోరేజ్ కలిగి ఉంటుంది.

ఈ ఫోన్ లో 50MP (Sony LYTIA 700C) ప్రధాన కెమెరా, 50MP అల్ట్రా వైడ్ సెన్సార్ మరియు 10MP టెలిఫోటో సెన్సార్ కలిగిన ట్రిపుల్ రియర్ కెమెరా ఉంటుంది. ఈ ఫోన్ లో 50MP సెల్ఫీ కెమెరా కూడా ఉంటుంది. ఏ ఫోన్ AI కెమెరా ఫీచర్స్ మరియు 4K UHD వీడియో రికార్డింగ్ సపోర్ట్ కూడా కలిగి ఉంటుంది.

Also Read: Amazon Sale నుంచి భారీ డిస్కౌంట్ తో 16 వేలకే లభిస్తున్న Lava డ్యూయల్ స్క్రీన్ ఫోన్.!

ఈ ఫోన్ 90W TurboPower ఛార్జ్ సపోర్ట్ కలిగిన 6000 mAh బిగ్ బ్యాటరీ కలిగి ఉంటుంది. ఈ స్మార్ట్ ఫోన్ moto ai సపోర్ట్ మరియు Dolby Atmos సౌండ్ సపోర్ట్ కలిగిన డ్యూయల్ స్టీరియో స్పీకర్లు కూడా కలిగి ఉంటుంది. ఈ ఫోన్ IP68, IP69 రేటింగ్ తో డస్ట్ మరియు వాటర్ రెసిస్టెంట్ గా ఉండటమే కాకుండా MIL-STD 810H సర్టిఫికేషన్ తో చాలా స్ట్రాంగ్ కూడా ఉంటుందట.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo