Realme GT 7 Pro ఫోన్ 120X AI కెమెరా మరియు స్నాప్ డ్రాగన్ 8 ఎలైట్ తో లాంచ్ అవుతోంది.!

HIGHLIGHTS

Realme GT 7 Pro స్మార్ట్ ఫోన్ లాంచ్ గురించి కంపెనీ అనౌన్స్ చేసింది

గత నెల చివరిలో ఈ ఫోన్ లాంచ్ గురించి టీజింగ్ మొదలు పెట్టిన కంపెనీ

ఈ అప్ కమింగ్ రియల్ మీ ఫోన్ ను 120X AI కెమెరాతో లాంచ్ అవుతోంది

Realme GT 7 Pro ఫోన్ 120X AI కెమెరా మరియు స్నాప్ డ్రాగన్ 8 ఎలైట్ తో లాంచ్ అవుతోంది.!

Realme GT 7 Pro స్మార్ట్ ఫోన్ లాంచ్ గురించి కంపెనీ అనౌన్స్ చేసింది. గత నెల చివరిలో ఈ ఫోన్ లాంచ్ గురించి టీజింగ్ మొదలు పెట్టిన కంపెనీ, ఇప్పుడు ఈ టీజింగ్ పై మరింత వేగం పెంచింది. ఈ ఫోన్ ను నవంబర్ లో విడుదల చేస్తున్నట్లు ప్రకటించిన రియల్ మీ, ఇప్పుడు ఈ ఫోన్ యొక్క కీలకమైన స్పెక్స్ ను ఒక్కొక్కటిగా విడుదల చేయడం మొదలు పెట్టింది. ఈ అప్ కమింగ్ రియల్ మీ ఫోన్ ను 120X AI కెమెరాతో తీసుకు వస్తున్నట్లు కంపెనీ కొత్తగా అనౌన్స్ చేసింది.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

Realme GT 7 Pro

రియల్ మీ అప్ కమింగ్ ఫోన్ GT 7 ప్రో 5జి స్మార్ట్ ఫోన్ ను నవంబర్ నెలలో విడుదల చేస్తుందని కంపెనీ తెలిపింది. అయితే, ఈ ఫోన్ లాంచ్ డేట్ ను మాత్రం ఇంకా కన్ఫర్మ్ చెయ్యలేదు. అయితే, ఈ ఫోన్ ను త్వరలోనే లాంచ్ చేస్తుందని మాత్రం తెలిపింది. ఈ ఫోన్ ను Snapdragon 7 Elite చిప్ సెట్ తో లాంచ్ చేస్తుందని కూడా కంపెనీ ముందు వెల్లడించింది. ఈ చిప్ సెట్ 30 లక్షలకు పైగా AnTuTu స్కోర్ కలిగి ఉంటుంది మరియు చాలా వేగవంతమైన ప్రోసెసర్ గా లిస్ట్ చెయ్యబడింది.

120X AI కెమెరా

realme gt 7 pro

రియల్ మీ GT 7 ప్రో 5జి స్మార్ ఫోన్ యొక్క మరొ ఫీచర్ ను రియల్ మీ ఇప్పుడు వెల్లడించింది. ఈ ఫోన్ లో 120X AI కెమెరా ఉన్నట్లు కంపెనీ తెలిపింది. అంతేకాదు, ఈ ఫోన్ రియల్ మీ యొక్క Hyper Image + ఫీచర్ తో మరింత పవర్ ఫుల్ కెమెరా సెటప్ తో ఉండే అవకాశం వుంది. ఈ ఫోన్ టీజర్ ఇమేజ్ ద్వారా ఈ ఫోన్ లో వెనుక ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉన్నట్టు క్లియర్ చేసింది.

Also Read: Flipkart sale ముగిసినా ముగియని ఆఫర్లు: ఈ స్మార్ట్ ఫోన్ డీల్స్ పై లుక్కేయండి.!

Expected ఫీచర్స్ ఏమిటి?

స్నాప్ డ్రాగన్ 8 ఎలైట్ ప్రోసెసర్ చాలా శక్తివంతమైనది మరియు దీనికి అనుకూలమైన కొన్ని ఫీచర్స్ ను మనము ఎక్స్ పెక్ట్ చేయవచ్చు. ఈ ఫోన్ లో LPDDR5X ర్యామ్ ను మరియు UFS 4.0 ఇంటర్నల్ స్టోరేజ్ ను జత చేసే అవకాశం ఉంటుంది. అంతేకాదు, ఈ ఫోన్ ను 1.5K రిజల్యూషన్ కలిగిన స్క్రీన్ మరియు ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ కలిగిన పెద్ద బ్యాటరీ వంటి ఫీచర్స్ ను ఈ ఫోన్ కలిగి ఉండవచ్చని అంచనా వేస్తున్నారు.

అయితే, ఈ ఫోన్ లాంచ్ నాటికి ఈ అంచనా ఫీచర్స్ లో ఎన్ని నిజమౌతాయి అని తెలుస్తుంది. ఈ ఫోన్ అమెజాన్ స్పెషల్ గా వస్తుంది మరియు ఈ ఫోన్ లాంచ్ తర్వాత అమెజాన్ నుంచి ప్రతేకంగా సాల్ అవుతుంది.

Raja Pullagura

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo