Flipkart sale ముగిసినా ముగియని ఆఫర్లు: ఈ స్మార్ట్ ఫోన్ డీల్స్ పై లుక్కేయండి.!
Flipkart sale ను మంచి ఆఫర్లు మరియు డీల్స్ తో అందించింది
ఇప్పుడు కొత్తగా Smartphone festive Days Sale ను ఫ్లిప్ కార్ట్ అనౌన్స్ చేసింది
లేటెస్ట్ సేల్ నుంచి అనేక స్మార్ట్ ఫోన్ లను భారీ డిస్కౌంట్ లతో ఆఫర్ చేస్తోంది
దీపావళి 2024 కోసం Flipkart sale ను మంచి ఆఫర్లు మరియు డీల్స్ తో అందించింది. ఈ సేల్ ను అక్టోబర్ 3వ తేదీ తో ముగించింది. అయితే, పండుగ సేల్ ముగిసిన వెంటనే Smartphone festive Days Sale ను ఫ్లిప్ కార్ట్ అనౌన్స్ చేసింది. ఈ సేల్ లేటెస్ట్ సేల్ నుంచి అనేక స్మార్ట్ ఫోన్ లను భారీ డిస్కౌంట్ లతో ఆఫర్ చేస్తోంది. ఈ దీపావళి సేల్ నుంచి కొత్త ఫోన్ కొనలేక మిస్ అయిన వారు ఈ కొత్త సేల్ నుంచి అందిస్తున్న బెస్ట్ డీల్స్ ను పరిశీలించవచ్చు.
SurveyFlipkart sale New offers
ఫ్లిప్ కార్ట్ కొత్తగా ప్రకటించిన స్మార్ట్ ఫోన్ ఫెస్టివ్ సేల్ నుంచి Nothing Phone (2a) 5G మరియు Xiaomi 14 CIVI స్మార్ట్ ఫోన్స్ పై గొప్ప డీల్స్ ను ఫ్లిప్ కార్ట్ అందించింది. ఈ రెండు ఫోన్స్ కూడా ఈరోజు గొప్ప డిస్కౌంట్ మరియు గొప్ప బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్స్ తో లభిస్తున్నాయి.
Xiaomi 14 CIVI
ఇండియాలో రూ. 43,999 రూపాయల ప్రారంభ ధరతో విడుదలైన ఈ షియోమీ ప్రీమియం స్మార్ట్ ఫోన్ ఈరోజు రూ. 40,999 రూపాయల ఆఫర్ ధరకే ఫ్లిప్ కార్ట్ సేల్ నుంచి లభిస్తుంది. అంతేకాదు, All Banks నాన్ EMI రూ. 3,000 రూపాయల అదనపు డిస్కౌంట్ ఆఫర్ ను కూడా ఫ్లిప్ కార్ట్ అందించింది. ఈ ఆఫర్ తో ఈ ఫోన్ ను రూ. 37,999 రూపాయల ఆఫర్ ధరకే అందుకోవచ్చు.

ఈ షియోమీ ఫోన్ పూర్తిగా Leica Camera సెటప్ తో వస్తుంది. ఇందులో వెనుక ట్రిపుల్ లైకా కెమెరా సెటప్ మరియు ముందు డ్యూయల్ 32MP సెల్ఫీ కెమెరా సెటప్ ను కలిగి ఉంటుంది. ఈ ఫోన్ 1.5K 120Hz క్వాడ్ కర్వ్ AMOLED స్క్రీన్, Snapdragon 8s Gen 3 చిప్ సెట్ మరియు గొప్ప ఆకర్షణీయమైన డిజైన్ వంటి వివరాలతో ఆకట్టుకుంటుంది.
Also Read: Price Cut: Moto G45 5G స్మార్ట్ ఫోన్ పై భారీ తగ్గింపు.!
Nothing Phone (2a) 5G
ఈ ఫోన్ ఈరోజు రూ . 2,000 రూపాయల డిస్కౌంట్ మరియు రూ. 2,000 రూపాయల HDFC బ్యాంక్ క్రెడిట్ మరియు డెబిట్ కార్డ్ ఆఫర్ తో లభిస్తుంది. ఈ రెండు ఆఫర్స్ ద్వారా ఈ ఫోన్ ను కేవలం రూ. 21,999 రూపాయల ఆఫర్ ధరకే అందుకోవచ్చు.

ఈ నథింగ్ బడ్జెట్ స్మార్ట్ ఫోన్ బుక్ 50MP రియర్ మరియు 32MP సెల్ఫీ కెమెరా సెటప్ కలిగి ఉంటుంది. ఈ ఫోన్ Dimensity 7200 Pro చిప్ సెట్, 120Hz 10 bit AMOLED స్క్రీన్ మరియు 45W ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ కలిగిన పెద్ద AMOLED స్క్రీన్ వంటి ఫీచర్స్ ను కలిగి ఉంటుంది.
Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile