Price Cut: Moto G45 5G స్మార్ట్ ఫోన్ పై భారీ తగ్గింపు.!
Motorola G45 5G ఇప్పుడు భారీ ప్రైస్ కట్ అందుకుంది
ఈ మోటోరోలా 5G స్మార్ట్ ఫోన్ ఇప్పుడు 9 వేల రూపాయల కంటే తక్కువ ధరలో లభిస్తుంది
బ్యాంక్ కార్డ్స్ తో కొనుగోలు చేసే వారికి మరింత అదనపు తగ్గింపు కూడా లభిస్తుంది
Price Cut: మోటోరోలా బడ్జెట్ సిరీస్ గా వెలుగుతున్న G సిరీస్ నుంచి ఇటీవల సరికొత్తగా వచ్చిన స్మార్ట్ ఫోన్ Motorola G45 5G ఇప్పుడు భారీ ప్రైస్ కట్ అందుకుంది. ఇండియాలో రూ. 10,999 రూపాయల ప్రారంభ ధరలో వచ్చిన ఈ మోటోరోలా స్మార్ట్ ఫోన్ ఇప్పుడు 10 వేల రూపాయల కంటే తక్కువ ధరలో లభిస్తుంది. అంతేకాదు, ఈ ఫోన్ ను బ్యాంక్ కార్డ్స్ తో కొనుగోలు చేసే వారికి మరింత అదనపు తగ్గింపు కూడా లభిస్తుంది.
SurveyMoto G45 5G Price Cut
మోటోరోలా ఇటీవల విడుదల చేసిన మోటో G45 5జి స్మార్ట్ ఫోన్ ఇండియాలో రూ. 10,999 రూపాయల ప్రారంభ ధరకు లాంచ్ అయ్యింది. ఈ ఫోన్ ఇప్పుడు రూ. 1,000 తగ్గింపు అందుకొని కేవలం రూ. 9,999 రూపాయల ఆఫర్ ధరకు లభిస్తుంది. ఈ స్మార్ట్ ఫోన్ యొక్క 8GB + 128GB వేరియంట్ కూడా తగ్గింపు అందుకొని కేవలం రూ. 11,999 రూపాయల ఆఫర్ ధరకు లభిస్తోంది.
కేవలం తగ్గినౌ మాత్రమే కాదు ఈ ఫోన్ పై Axis మరియు IDFC బ్యాంక్ క్రెడిట్ కార్డ్ రూ. 1,000 అదనపు డిస్కౌంట్ ఆఫర్ ను కూడా మోటోరోలా జత చేసింది. ఈ బ్యాంక్ ఆఫర్ ఈ ఫోన్ బేసిక్ వేరియంట్ ను కేవలం రూ. 8,999 రూపాయల ఆఫర్ ధరకే అందుకోవచ్చు.
Also Read: Realme GT 7 Pro: పవర్ ఫుల్ చిప్ సెట్ మరియు గొప్ప డిజైన్ అవుతోంది.!
Moto G45 5G : ఫీచర్స్
మోటో జి45 5జి ఫోన్ Snapdragon 6s Gen 3 చిప్ సెట్ తో పని చేస్తుంది. ఈ ఫోన్ 4GB / 8GB ర్యామ్ మరియు 128GB ఇంటర్నల్ స్టోరేజ్ ను కలిగి ఉంటుంది. ఈ ఫోన్ వేగన్ లెథర్ డిజైన్ తో మూడు అందమైన కలర్ ఆప్షన్ లలో లభిస్తుంది. ఈ మోటో జి45 5జి ఫోన్ 6.5ఇంచ్ HD+ రిజల్యూషన్ స్క్రీన్ ను కలిగి ఉంటుంది మరియు ఇది 120Hz రిఫ్రెష్ రేట్ తో ఉంటుంది.

ఈ మోటోరోలా స్మార్ట్ ఫోన్ వెనుక 50MP + 2MP డ్యూయల్ రియర్ కెమెరా మరియు ముందు 16MP సెల్ఫీ కెమెరా కలిగి ఉంటుంది. ఈ ఫోన్ 5000mAh బ్యాటరీని ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ తో కలిగి వుంది. ఈ ఫోన్ లో Dolby Atmos సౌండ్ సపోర్ట్ కలిగిన డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ కూడా ఉన్నాయి.
Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile