Realme GT 7 మీడియాటెక్ ఫుల్ చిప్ సెట్ Dimensity 9400e తో లాంచ్ అవుతోంది.!
Realme GT 7 స్మార్ట్ ఫోన్ కొత్త అప్డేట్ ను ఈరోజు కంపెనీ రిలీజ్ చేసింది
ఈ ఫోన్ కలిగిన చిప్ సెట్ వివరాలు ఈరోజు రియల్ మీ అందించింది
ఫోన్ మీడియాటెక్ ఫుల్ చిప్ సెట్ Dimensity 9400e తో లాంచ్ అవుతోంది
Realme GT 7 స్మార్ట్ ఫోన్ కొత్త అప్డేట్ ను ఈరోజు కంపెనీ రిలీజ్ చేసింది. ఈ ఫోన్ కలిగిన చిప్స్ సెట్ వివరాలు ఈరోజు రియల్ మీ అందించింది. రియల్ మీ జిటి 7 సిరీస్ నుంచి తీసుకు వస్తున్న ఈ ఫోన్ భారీ చిప్ సెట్ మరియు అత్యంత ప్రకాశవంతమైన స్క్రీన్ కూడా కలిగి ఉంటుందని రియల్ మీ కొత్త టీజర్ ద్వారా ప్రకటించింది. ఈ ఫోన్ మీడియాటెక్ ఫుల్ చిప్ సెట్ Dimensity 9400e తో లాంచ్ అవుతోంది.
SurveyRealme GT 7 : కీలకమైన ఫీచర్స్
రియల్ మీ జిటి 7 స్మార్ట్ ఫోన్ లాంచ్ కోసం కంపెనీ అందించిన టీజింగ్ పేజీ నుంచి ఈరోజు ఈ కొత్త అప్డేట్ అందించింది. రియల్ మీ జిటి 7 స్మార్ట్ ఫోన్ మీడియాటెక్ Dimensity 9400e చిప్ సెట్ తో లాంచ్ అవుంతుందని రియల్ మీ అనౌన్స్ చేసింది. ఇది గరిష్టంగా 3.62 GHz క్లాక్ స్పీడ్ కలిగి ఉండే 5G చిప్ సెట్ మరియు దాని ముందు తరం ప్రోసెసర్ Dimensity 9300 కంటే 28% అధిక పెర్ఫార్మెన్స్ అందిస్తుంది. ఈ చిప్ సెట్ తో ఈ ఫోన్ 2.45 Mn+ AnTuTu స్కోర్ అందిస్తుంది. అంతేకాదు, ఈ చిప్ సెట్ తో వచ్చే మొదటి ఫోన్ ఇదే అవుతుంది.

ఈ ఫోన్ యొక్క మరిన్ని వివరాలు కూడా రియల్ మీ వెల్లడించింది. ఈ ఫోన్ లో అత్యంత ప్రకాశవంతమైన 6000 నిట్స్ పీక్ బ్రైట్నెస్ కలిగిన స్క్రీన్ ఉన్నట్లు కంపెనీ కన్ఫర్మ్ చేసింది. ఈ ఫోన్ 120FPS తో 6 గంటల స్టేబుల్ BGMI గేమ్ ప్లే అందిస్తుందని రియల్ మీ గొప్పగా చెబుతోంది. అంతేకాదు, ఈ ఫోన్ భారీ బ్యాటరీ కూడా కలిగి ఉంటుంది.
ఈ రియల్ మీ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ 7000 mAh సిలికాన్ యానోడ్ బ్యాటరీ కలిగి ఉంటుంది. ఈ బిగ్ బ్యాటరీని వేగంగా ఛార్జ్ చేసే 120W ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ కూడా ఇందులో అందించింది. ఈ ఫోన్ బ్యాటరీ పర్యవేక్షించడానికి ప్రత్యేకమైన లాంగ్ లైఫ్ బ్యాటరీ చిప్ ను కూడా రియల్ మీ ఇందులో జత చేసింది. ఇది కాకుండా ఈ ఫోన్ ను వేగంగా చల్లబరిచే గ్రాఫిన్ కవర్ ఐస్ సెన్స్ డిజైన్ కూడా ఈ ఫోన్ కలిగి ఉంటుంది.
Also Read: Flipkart Sale నుంచి భారీ డిస్కౌంట్ తో 5వేలకే లభిస్తున్న 350W 5.1 సౌండ్ బార్.!
రియల్ మీ జిటి 7 స్మార్ట్ ఫోన్ ను ఐస్ సెన్స్ బ్లూ మరియు ఐస్ సెన్స్ బ్లాక్ రెండు కలర్ లలో రియల్ మీ లాంచ్ చేస్తోంది. ఈ ఫోన్ లో ట్రిపుల్ రియర్ కెమెరా ఉన్నట్లు ఇమేజెస్ ద్వారా స్పష్టం అవుతుంది. ఈ ఫోన్ యొక్క కెమెరా వివరాలు కూడా మే 19వ తేదీ వెల్లడిస్తుంది. ఈ ఫోన్ మే 27వ తేదీ గ్లోబల్ మరియు ఇండియన్ మార్కెట్లో కూడా విడుదల అవుతుంది.