Flipkart Sale నుంచి భారీ డిస్కౌంట్ తో 5వేలకే లభిస్తున్న 350W 5.1 సౌండ్ బార్.!
Flipkart Sale నుంచి ఈరోజు బెస్ట్ సౌండ్ బార్ డీల్ ఆఫర్ చేస్తోంది
ఫ్లిప్ కార్ట్ బిగ్ బచాత్ డేస్ సేల్ చివరి రోజు ఈ డీల్ అందించింది
ఈ సౌండ్ బార్ ఆకట్టుకునే ఫీచర్స్ తో వస్తుంది
Flipkart Sale నుంచి ఈరోజు బెస్ట్ సౌండ్ బార్ డీల్ ఆఫర్ చేస్తోంది. మే 2025 నెల కోసం ఫ్లిప్ కార్ట్ తీసుకు వచ్చిన బిగ్ బచాత్ డేస్ సేల్ ఈరోజు చివరి రోజు కావడంతో, ఈ బెస్ట్ డీల్ అందించినట్లు ఊహిస్తున్నారు. అదేమిటంటే, ఇటీవల మార్కెట్లో విడుదలైన 350W 5.1 సౌండ్ బార్ మంచి డిస్కౌంట్ ఆఫర్స్ తో 5 వేల బడ్జెట్ ధరలో ఆఫర్ చేస్తోంది. ఈ సౌండ్ బార్ ఆకట్టుకునే ఫీచర్స్ తో వస్తుంది మరియు ఈరోజు మంచి ఆఫర్ ధరలో లభిస్తుంది.
SurveyFlipkart Sale 350W 5.1 సౌండ్ బార్: ఆఫర్స్
Mivi రీసెంట్ గా మార్కెట్లో విడుదల చేసిన 5.1 ఛానల్ సౌండ్ బార్ Fort H350 పై ఈ బిగ్ డీల్స్ అందించింది. ఈ సౌండ్ బార్ ఈరోజు ఫ్లిప్ కార్ట్ సేల్ నుంచి 82% భారీ డిస్కౌంట్ అందుకుని రూ. 5,999 రూపాయల ఆఫర్ ధరకు లభిస్తోంది. ఈ సౌండ్ బార్ పై DBS బ్యాంక్ మరియు BOBCARD EMI ఆప్షన్ పై 10% అదనపు బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్ కూడా అందించింది.
అంటే, ఈ మివి 5.1 ఛానల్ 350W సౌండ్ బార్ ను ఫ్లిప్ కార్ట్ బిగ్ బచాత్ డేస్ సేల్ నుంచి ఈ రెండు బ్యాంక్ కార్డ్ ఆఫర్ తో తీసుకునే వారికి రూ. 599 రూపాయల అదనపు డిస్కౌంట్ లభిస్తుంది. ఈ ఆఫర్ తో ఈ సౌండ్ బార్ కేవలం రూ. 5,400 రూపాయల ధరకే లభిస్తుంది.
Also Read: Ray-Ban AI Glasses: AI సపోర్ట్ తో స్టైలిష్ కళ్ళజోడు లాంచ్ చేసిన రేబాన్.!
Mivi Fort H350 సౌండ్ బార్ : ఫీచర్స్
ఈ మివి సౌండ్ బార్ 5.1 ఛానల్ సెటప్ తో వస్తుంది మరియు ఈ సౌండ్ బార్ టోటల్ 350W సౌండ్ అవుట్ పుట్ అందిస్తుంది. ఈ సౌండ్ బార్ సెటప్ లో మూడు స్పీకర్లు కలిగిన బార్, రెండు శాటిలైట్ స్పీకర్లు మరియు సబ్ ఉఫర్ ఉంటాయి. ఈ సౌండ్ బార్ కాంపాక్ట్ డిజైన్ తో ఆకట్టుకుంటుంది.

ఈ సౌండ్ బార్ USB, HDMI Arc, ఆప్టికల్, AUX మరియు బ్లూటూత్ 5.1 వంటి మల్టీ కనెక్టివిటీ సపోర్ట్ కలిగి ఉంటుంది. ఈ సౌండ్ బార్, మ్యూజిక్, మూవీ, స్పోర్ట్స్ మరియు న్యూస్ నాలుగు ఈక్వలైజర్ మోడ్స్ కలిగి ఉంటుంది. ఈ సౌండ్ బార్ ను ఈరోజు ఫ్లిప్ కార్ట్ సేల్ నుంచి చాలా చవక ధరకు అందుకోవచ్చు.