Realme C73 5G: లాంచ్ డేట్ మరియు ఫీచర్స్ కన్ఫర్మ్ చేసిన రియల్ మీ.!
రియల్ మీ C Series నుంచి రాబోతున్న అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్
Realme C73 5G ఫోన్ ను బిగ్ బ్యాటరీ ఫోన్ గా లాంచ్ చేస్తోంది
లాంచ్ డేట్ మరియు కీలకమైన ఫీచర్స్ కూడా రియల్ మీ కన్ఫర్మ్ చేసింది
Realme C73 5G: రియల్ మీ C Series నుంచి రాబోతున్న అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ ఈరోజు అనౌన్స్ చేసింది. అదే, రియల్ మీ సి73 5జి స్మార్ట్ ఫోన్ మరియు ఈ ఫోన్ ను బిగ్ బ్యాటరీ ఫోన్ గా లాంచ్ చేస్తోంది. ఈ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ లాంచ్ డేట్ మరియు కీలకమైన ఫీచర్స్ కూడా రియల్ మీ కన్ఫర్మ్ చేసింది. రియల్ మీ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ లాంచ్ డేట్ మరియు ఫీచర్స్ ఏమిటో ఒక లుక్కేద్దాం పదండి.
SurveyRealme C73 5G: లాంచ్ డేట్ ఏమిటీ?
రియల్ మీ సి73 5జి స్మార్ట్ ఫోన్ ను జూన్ 2వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకు మార్కెట్లో విడుదల చేస్తున్నట్లు రియల్ మీ డేట్ మరియు సమయం కన్ఫర్మ్ చేసింది. ఈ ఫోన్ లాంచ్ తో పాటు ఆన్లైన్ సేల్ పార్ట్నర్ ను కూడా కన్ఫర్మ్ చేసింది. ఈ ఫోన్ లాంచ్ తర్వాత ఫ్లిప్ కార్ట్ నుంచి సేల్ అవుతుంది. అందుకే, ఈ ఫోన్ లాంచ్ కోసం ఫ్లిప్ కార్ట్ ప్రత్యేకమైన టీజర్ పేజి అందించింది టీజింగ్ చేస్తోంది. ఈ ప్రత్యేకమైన పీజేఆర్ పేజీ నుంచి ఈ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ కీలకమైన ఫీచర్స్ కూడా వెల్లడించింది.
Realme C73 5G: కీలకమైన ఫీచర్స్ ఏమిటి?
రియల్ మీ సి73 స్మార్ట్ ఫోన్ యొక్క చాలా కీలకమైన ఫీచర్స్ కూడా టీజర్ పేజీ ద్వారా రియల్ మీ బయటపెట్టింది. ఈ ఫోన్ డిజైన్, బ్యాటరీ, స్క్రీన్ మరియు మరిన్ని వివరాలు రియల్ మీ వెల్లడించింది. ఈ స్మార్ట్ ఫోన్ కేవలం 7.94mm మందంతో సూపర్ స్లీక్ డిజైన్ తో ఉంటుంది మరియు ఈ ఫోన్ లో 120Hz రిఫ్రెష్ రేట్ తో స్మూత్ మరియు ఐ ఫ్రెండ్లీ స్క్రీన్ ఉంటుందని రియల్ మీ చెబుతోంది.

రియల్ మీ సి73 మీడియాటెక్ బడ్జెట్ 5G చిప్ సెట్ Dimensity 6300 తో వస్తుంది. ఈ ఫోన్ లో అందించిన చిప్ సెట్ కి జతగా 4GB ఫిజికల్ ర్యామ్ మరియు 8GB వర్చువల్ ర్యామ్ సపోర్ట్ ను అందించినట్లు రియల్ మీ కన్ఫర్మ్ చేసింది. అంతేకాదు, ఈ ఫోన్ మిలటరీ గ్రేడ్ షాక్ రెసిస్టెంట్ ఫీచర్ కూడా కలిగి ఉంటుంది. ఈ ఫోన్ 300% అల్ట్రా వాల్యూమ్ మోడ్ తో గొప్ప సౌండ్ అందించే ఫీచర్ కలిగి ఉంటుంది.
Also Read: Jio Hotstar: రూ. 200 కంటే తక్కువ ధరలో హాట్ స్టార్ యాక్సెస్ అందించే బెస్ట్ రీఛార్జ్ ప్లాన్స్.!
ఇక బ్యాటరీ విషయానికి వస్తే, ఈ ఫోన్ లో 6000 mAh బిగ్ బ్యాటరీ మరియు ఈ బ్యాటరీని వేగంగా ఛార్జ్ చేసే 45W ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ మరియు 5W రివర్స్ ఛార్జ్ ఫీచర్ కూడా ఉంటుంది. ఈ ఫోన్ ను IP64 రేటింగ్ తో డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెంట్ ఫోన్ గా అందిస్తుంది.