Realme 11 Pro Series స్మార్ట్ ఫోన్ లాంచ్ కావడానికంటే ముందే ఈ ఫోన్ల యొక్క అన్ని కీలకమైన వివరాలను కంపెనీ ఒక్కొక్కటిగా వెల్లడిస్తోంది. ఈ ఫోన్ లో వున్న డిస్ప్లే, కెమేరా మరియు ర్యామ్ వివరాలను ఇప్పటికే టీజింగ్ ద్వారా వెల్లడించిన రియల్ మి ఇప్పుడు ఈ ఫోన్ లో ఉన్న ఛార్జ్ టెక్ మరియు బ్యాటరీ వివరాలను కూడా టీజింగ్ ద్వారా బయటపెట్టేసింది. రియల్ మి 11 ప్రో సిరీస్ 5జి లో 100W సూపర్ ఉక్ ఛార్జ్ సపోర్ట్ కలిగిన 5000 mAh బ్యాటరీ ఉన్నట్లు రియల్ మి కన్ఫర్మ్ చేసింది.
Survey
✅ Thank you for completing the survey!
ఈ ఫోన్ లో 200MP మెయిన్ కెమేరా ఉన్నట్లు కంపెనీ ప్రారంభం నుండి టీజింగ్ చేస్తోంది మరియు ఇప్పుడు ఈ ఫోన్ యొక్క డిస్ప్లే మరియు బ్యాటరీతో పాటు ఛార్జ్ టెక్ ను కూడా కంపెనీ వెల్లడించింది.
100W సూపర్ ఉక్ ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ కలిగిన 5000mAh బ్యాటరీతో ఈ స్మార్ట్ ఫోన్ వస్తున్నట్లు రియల్ మి తన ట్వీట్ ద్వారా తెలిపింది. అంతేకాదు, ఈ స్మార్ట్ ఫోన్ Curved Vision డిస్ప్లే ని 120Hz రిఫ్రెష్ రేట్ డిస్ప్లే తో కలిగి ఉన్నట్లు కూడా కంపెనీ క్లియర్ చేసింది. ఈ ఫోన్ లో మీరు 12GB వరకూ హై స్పీడ్ ర్యామ్ మరియు 256GB వరకూ హెవీ స్టోరేజ్ కూడా ఉన్నట్లు టీజర్ ద్వారా క్లియర్ చేసింది.