iPhone మాదిరి ఫీచర్ తో వచ్చిన Realme C55 ఇప్పుడు ఇండియాలో లాంచ్ కాబోతోంది.!

HIGHLIGHTS

iPhone మాదిరి ఫీచర్ తో వచ్చిన Realme C55 ఇప్పుడు ఇండియాలో లాంచ్ కాబోతోంది

iPhone లాంటి ఫీచర్ తో Realme C55 ఫోన్ ఇటీవల ప్రకటించింది

ఈ ఫోన్ అంచనా ఫీచర్లు మరియు స్పెక్స్ తెలుసుకోండి

iPhone మాదిరి ఫీచర్ తో వచ్చిన Realme C55 ఇప్పుడు ఇండియాలో లాంచ్ కాబోతోంది.!

iPhone మాదిరి ఫీచర్ తో వచ్చిన Realme C55 ఇప్పుడు ఇండియాలో లాంచ్ కాబోతోంది. రియల్ మి చాలా తక్కువ ధరలో iPhone లాంటి ఫీచర్ తో Realme C55 ఫోన్ ఇటీవల ప్రకటించింది. ఈ స్మార్ట్ ఫోన్ ను ముందుగా ఇండోనేషియాలో విడుదల చేసింది మరియు ఇప్పుడు ఇండియాలో విడుదల చేయడానికి సిద్దమవుతోంది. ఈ ఫోన్ యొక్క స్పెషాలిటీ ఏమిటంటే, ప్రీమియం iPhone 14 pro లో కనిపించే డైనమిక్ ఐల్యాండ్ వంటి అమరికను పోలివుండే ఒక ఫీచర్ ను ఈ స్మార్ట్ ఫోన్ లో రియల్ మి అందించింది. ఈ ఫోన్ అంచనా  ఫీచర్లు మరియు స్పెక్స్ తెలుసుకోండి.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

Realme C55 స్మార్ట్ ఫోన్ ను మార్చి 21వ తేదీ మధ్యాహ్నం 12:30 నిముషాలకు ఇండియాలో విడుదల చేయనున్నట్లు ప్రకటించింది.  రియల్ మి ముందుగా ఇండోనేషియాలో లాంచ్ చేసింది. ఇండియా వేరియంట్ కూడా అదేవిధంగా కనిపిస్తోంది. అంతేకాదు, ఈ స్మార్ట్ ఫోన్ యొక్క ముఖ్యమైన ఫీచర్లను గురించి కంపెనీ టీజింగ్ ద్వారా వెల్లడించింది. ఈ ఫీచర్ల ద్వారా ఈ ఫోన్ అదే అవుతుందని చెబుతున్నారు. ఇక ఇండోనేషియా వేరియంట్ ధర మరియు ఫీచర్లు క్రింద చూడవచ్చు.

Realme C55: స్పెక్స్ (ఇండోనేషియా) 

రియల్ మీ C55 స్మార్ట్ ఫోన్ 6.7 ఇంచ్ Layar FHD+ స్క్రీన్ ని 90Hz రిఫ్రెష్ రేట్ తో కలిగి ఉంటుంది. అయితే, ఈ ఫోన్ లో పైన ఉన్న సెల్ఫీలే కెమేరా చుట్టూ ఒక నోటిఫికేషన్ భార్ తో కొత్త ఫీచర్ కనిపిస్తుంది. ఈ బార్ ఫీచర్ ను 'Mini Capsule' గా పిలుస్తోంది. ఈ ఫీచర్ వలన ఫోన్ ప్రీమియం ఫోన్ ఫీల్ మరియు లుక్ ను కలిగివుంది. ఈ స్మార్ట్ ఫోన్ MediaTek Helio G88 ఆక్టా కోర్ ప్రాసెసర్ కి జతగా 6GB/8GB ర్యామ్ మరియు 128GB/256GB ఇంటర్నల్ స్టోరేజ్ లను అప్షన్ లను కలిగి ఉంటుంది. 

కెమెరాల పరంగా, రియల్ మీ C55 స్మార్ట్ ఫోన్ లో డ్యూయల్ రియర్ కెమేరా వుంది. ఇందులో, కేవలం 64MP ప్రైమరీ మరియు 2MP సెకండరీ కెమేరా ఉన్నాయి. సెల్ఫీల కోసం ఫోన్ ముందు భాగంలో 8MP సెల్ఫీ కెమెరా కూడా వుంది. ఈ ఫోన్ పెద్ద 5000mAh బ్యాటరీని 33W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తో కలిగి ఉంటుంది. ఈ ఫోన్ లేటెస్ట్ Android 13 OS ఆధారితమైన Realme UI 4.0 సాఫ్ట్ వేర్ పైన పనిచేస్తుంది.

Realme C55: ఇండోనేషియా ధర 

Realme C55 స్మార్ట్ ఫోన్ బేసిక్ వేరియంట్ (6GB+128GB) వేరియంట్ ధర Rp 2,499,000 (సుమారు రూ.13,300) తో లాంచ్ చెయ్యబడింది. ఈ ఫోన్ ప్రస్తుతం ఇండోనేషియాలో లభిస్తోంది.

Raja Pullagura

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo