Realme C35: సొగసైన డిజైన్.. సరసమైన ధరలో వచ్చింది

HIGHLIGHTS

రియల్ మీ c సిరీస్ నుండి వచ్చిన లేటెస్ట్ ఫోన్ Realme C35

రియల్ మీ సి35 చూడగానే ఆకర్షించే డిజైన్ తో అందించబడింది

50MP AI ట్రిపుల్ రియర్ కెమెరా సిస్టమ్ వంటి మరిన్ని ఫీచర్లతో వచ్చింది

Realme C35: సొగసైన డిజైన్.. సరసమైన ధరలో వచ్చింది

రియల్ మీ c సిరీస్ నుండి లేటెస్ట్ గా Realme C35 స్మార్ట్ ఫోన్ ఇండియన్ మార్కెట్లో విడుదల చేసింది. రియల్ మీ సి35 చూడగానే ఆకర్షించే డిజైన్ తో అందించబడింది. అంతేకాదు, ఈ లేటెస్ట్ రియల్ మీ లేటెస్ట్ స్మార్ట్ ఫోన్ యునిసోక్ టైగర్ T616 ఆక్టా కోర్ ప్రోసెసర్, బిగ్ బ్యాటరీ మరియు 50MP AI ట్రిపుల్ రియర్ కెమెరా సిస్టమ్ వంటి మరిన్ని ఫీచర్లతో వచ్చింది. రియల్ మీ సి35 యొక్క స్పెక్స్, ఫీచర్లు మరియు ధర వివరాలను గురించి పూర్తిగా తెలుసుకుందామా.    

Digit.in Survey
✅ Thank you for completing the survey!

Realme C35: ధర

 రియల్ మీ సి35 స్మార్ట్ ఫోన్ రెండు వేరియంట్స్ లో లభిస్తుంది. ఈ రెండు వేరియంట్స్ ధరలు ఈ క్రింద చూడవచ్చు.    

1. 4GB ర్యామ్ + 64GB స్టోరేజ్ వేరియంట్ ధర : Rs.11,999   

2. 4GB ర్యామ్ + 128GB స్టోరేజ్ వేరియంట్ ధర : Rs.12,999

ఈ ఫోన్ నలుపు మరియు గ్రీన్ కలర్ అప్షన్ లలో లభిస్తుంది. ఈ స్మార్ట్ ఫోన్ యొక్క మొదటి సేల్ మార్చ్ 12వ తేదీ మద్యహ్నం 12 గంటలకి జరుగుతుంది.    

Realme C35: స్పెక్స్

రియల్ మీ సి35 స్మార్ట్ ఫోన్ 6.6 అంగుళాల పరిమాణం గల FHD (2408×1080) రిజల్యూషన్ డిస్ప్లేని కలిగివుంది. ఈ డిస్ప్లే 180 టచ్ శాంప్లింగ్ రేట్ మరియు 600 నిట్స్ పీక్ బ్రైట్నెస్ తో వస్తుంది. ఈ ఫోన్ యునిసోక్ టైగర్ T616 ఆక్టా కోర్ ప్రోసెసర్ శక్తితో పనిచేస్తుంది. దీనికి జతగా 4GB ర్యామ్ మరియు 128GB ఇంటర్నల్ స్టోరేజ్ తో వస్తుంది. ఈ ఫోన్ Android 12 ఆధారంగా Realme UI R స్కిన్ పైన నడుస్తుంది.

Realme C35.jpg

ఈ ఫోన్ వెనుక భాగంలో ట్రిపుల్ కెమెరా సెటప్ వుంది. ఈ సెటప్ లో, 50MP ప్రధాన కెమెరాకి జతగా మ్యాక్రో సెన్సార్ మరియు B&W లెన్స్ ఉన్నాయి. ఇక సెల్ఫీల కోసం ముందుభాగంలో 8ఎంపి సెల్ఫీ కెమెరా కూడా వుంది.  ఈ ఫోన్ 18W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కలిగిన 5,000 mAh బిగ్ బ్యాటరీతో వస్తుంది. ఈ ఫోన్ లో డెడికేటెడ్ మైక్రో SD కార్డ్ స్లాట్, డ్యూయల్ 4G VoLTE, USB-C సాకెట్, సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్, డ్యూయల్-బ్యాండ్ వైఫై మరియు బ్లూటూత్ 5.0 తో వంటి ఫీచర్లతో ఉంటుంది.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo