Realme C31: కేవలం రూ.8,999 ధరలో వచ్చింది…ఫీచర్లు ఎలా ఉన్నాయంటే..!!
రియల్ మీ తన లేటెస్ట్ బడ్జెట్ స్మార్ట్ ఫోన్ Realme C31 ను ఆవిష్కరించింది
ఈ లేటెస్ట్ రియల్ మీ స్మార్ట్ ఫోన్ ప్రీమియం లుక్స్ తో ఆకట్టుకుంటోంది
కేవలం రూ.8,999 రూపాయల ప్రారంభ ధరతో మార్కెట్లో విడుదల
రియల్ మీ తన లేటెస్ట్ బడ్జెట్ స్మార్ట్ ఫోన్ Realme C31 స్మార్ట్ ఫోన్ ను ఆవిష్కరించింది. రియల్ మీ ఈ స్మార్ట్ ఫోన్ ను కేవలం రూ.8,999 రూపాయల ప్రారంభ ధరతో మార్కెట్లో విడుదల చేసింది. అయితే, ఈ లేటెస్ట్ రియల్ మీ స్మార్ట్ ఫోన్ ప్రీమియం లుక్స్ తో ఆకట్టుకోవడం మాత్రమే కాకుండా ఆకర్షణీయమైన ఫీచర్లను కూడా కలిగివుంది. రియల్ మీ సి 31 గురించి మీరు తెలుసుకోవాల్సిన అన్ని విషయాలను సమగ్రంగా చర్చిద్దాం.
SurveyRealme C31: ధర
రియల్ మీ సి 31 రెండు వేరియంట్లలో లభిస్తుంది. ఈ వేరియట్ల ధరలు మరియు వివరాలు క్రింద అందించబడ్డాయి.
Realme C31 (3GB + 32GB) : ధర రూ.8,999/-
Realme C31 (4GB + 64GB) : ధర రూ.9,999/-
అంటే, ఈ ఫోన్ హై ఎండ్ వేరియంట్ కూడా కేవలం 10 వేల రూపాయల కంటే తక్కువకే లభిస్తుంది. ఈ ఫోన్ ఏప్రిల్ న మధ్యాహ్నం 12 గంటల నుండి Flipkart మరియు రియల్ మీ అధికారిక వెబ్ సైట్ నుండి సేల్ కి వస్తుంది.
Realme C31: స్పెక్స్
రియల్ మీ సి31 స్మార్ట్ ఫోన్ 6.5 ఇంచ్ HD (1600×720) రిజల్యూషన్ కలిగిన డిస్ప్లేతో వస్తుంది మరియు 88.7% స్క్రీన్ టూ బాడీ రేషియోతో తో కలిగి వుంటుంది. ఈ స్క్రీన్ పైన 16.7M కలర్స్ ని ఎంజాయ్ చెయ్యవచ్చని కంపెనీ చెబుతోంది. ఈ ఫోన్ కేవలం 8.4mm మందంతో సన్నని డిజైన్ తో కూడా ఉంటుంది. C31 స్మార్ట్ ఫోన్ Unisoc T612 ఆక్టా కోర్ ప్రోసెసర్ జతగా 4GB ర్యామ్ తో పనిచేస్తుంది. మెమొరీ కార్డ్ ద్వారా ఈ ఫోన్ స్టోరేజ్ ను 1TB వరకూ విస్తరించుకోవచ్చు. ఈ ఫోన్ లైట్ సిల్వర్ మరియు డార్క్ గ్రీన్ అనే రెండు కలర్ లలో లభిస్తుంది.
ఇక కెమెరాల విషయానికి వస్తే, Realme C31 స్మార్ట్ ఫోన్ వెనుక ట్రిపుల్ కెమెరా సెటప్ వుంది మరియు ఈ కెమెరా డిజైన్ చాలా ఆకర్షణీయంగా కనిపిస్తోంది. ఈ సెటప్ లో 13MP Sony సెన్సార్ కలిగిన మైన్ కెమెరాకి జతగా ఒక B&W మరియు ఒక మ్యాక్రో సెన్సార్ వున్నాయి. అలాగే, సెల్ఫీల కోసం 5MP AI సెల్ఫీ కెమెరా వుంది. ఈ ఫోన్ 10W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కలిగిన పెద్ద 5000 mAh బ్యాటరీతో వస్తుంది మరియు ఇందులో ఉన్న అల్ట్రా సేవింగ్ మోడ్ తో బ్యాటరీని మరింత సేవ్ చేయవచ్చని రియల్ మీ చెబుతోంది.
సెక్యూరిటీ పరంగా, ఈ ఫోన్ లో సైడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా వుంది. రియల్ మీ సి31 ఆండ్రాయిడ్ 11 ఆధారితంగా Realme UI R Edition స్కిన్ పైన నడుస్తుంది.