రియల్ మీ ఇండియాలో లేటెస్ట్ గా విడుదల చేసిన బడ్జెట్ స్మార్ట్ ఫోన్ Raealme C30 ఇప్పుడు Flipkart ద్వారా సేల్ అవుతోంది. రియల్ మీ ఈ స్మార్ట్ ఫోన్ ను కేవలం 7,499 రూపాయలకే సాధారణ యూజర్లకు తగిన మంచి ఫీచర్లతో అందించింది. ఈ స్మార్ట్ ఫోన్ ను మీరు Flipkart మరియు Realme అధికారిక వెబ్సైట్ నుండి కూడా కొనుగోలు చేయవచ్చు. మీ రోజు ఆవిరి అవసరాలకు తగిన పెద్ద 5,000mAh బ్యాటరీ, బడ్జెట్ ప్రాసెసర్, జతగా 3GB ర్యామ్ వంటి ఆకర్షణీయమైన ఫీచర్లతో వస్తుంది. 7 వేలకే లేటెస్ట్ బెస్ట్ స్మార్ట్ ఫోన్ కోసం చూస్తున్నట్లయితే ఈ ఫోన్ పైన ఒక లుక్ వేయండి.
Survey
✅ Thank you for completing the survey!
Realme C30: ధర
ఈ స్మార్ట్ ఫోన్ యొక్క స్టార్టింగ్ వేరియంట్ 2GB ర్యామ్ మరియు 32 స్టోరేజ్ తో రూ.7,499 ధరతో ప్రకటించింది. అలాగే, 3GB ర్యామ్ మరియు 32 స్టోరేజ్ వేరియంట్ ధర రూ.8,299.
రియల్ మీ C30 స్మార్ట్ ఫోన్ 6.5 ఇంచ్ ఫుల్ స్క్రీన్ ని 120Hz టచ్ శాంప్లింగ్ రేట్ తో కలిగి ఉంటుంది. ఈ స్మార్ట్ ఫోన్ Unisoc T612 ఆక్టా కోర్ ప్రాసెసర్ కి జతగా 2GB/3GB ర్యామ్ మరియు 32GB ఇంటర్నల్ స్టోరేజ్ లను కలిగి ఉంటుంది. ప్రత్యేకమైన మెమోరీ కార్డ్ ద్వారా స్టోరేజ్ ను 1TB వరకూ పెంచుకోవచ్చు. ఈ ఫోన్ లేక్ బ్లూ మరియు బ్యాంబూ గ్రీన్ రెండు కలర్ అప్షన్లలో లభిస్తుంది.
కెమెరాల విషయానికి వస్తే, రియల్ మీ C30 స్మార్ట్ ఫోన్ వెనుక కేవలం 8MP సింగల్ కెమెరాతో వస్తుంది. అలాగే, సెల్ఫీల కోసం ముందుభాగంలో 5MP సెల్ఫీ కెమెరా కూడా వుంది. ఈ ఫోన్ పెద్ద 5000mAh బ్యాటరీని 10W సాధారణ ఛార్జింగ్ సపోర్ట్ తో కలిగిఉంటుంది.