రియల్ మీ ఈరోజు తన లేటెస్ట్ బడ్జెట్ స్మార్ట్ ఫోన్ Realme C30 ని ప్రకటించింది. ఈ స్మార్ట్ ఫోన్ ను పెద్ద 5,000mAh బ్యాటరీ మరియు చూడచక్కని డిజైన్ తో ఇండియన్ మార్కెట్లో ప్రకటించింది. అంతేకాదు, కేవలం 8 వేల రూపాయల బడ్జెట్ సెగ్మెంట్ లో ఈ ఫోన్ ను అందించింది. ఈ ఫోన్ బడ్జెట్ ప్రామాణిక Unisoc ప్రాసెసర్, జతగా 3GB వంటి మరిన్ని ఆకర్షణీయమైన ఫీచర్లను కలిగి ఉంటుంది. ఈ లేటెస్ట్ రియల్ మీ స్మార్ట్ ఫోన్ గురించి వివరంగా చూద్దాం.
Survey
✅ Thank you for completing the survey!
Realme C30: స్పెక్స్
రియల్ మీ C30 స్మార్ట్ ఫోన్ 6.5 ఇంచ్ ఫుల్ స్క్రీన్ ని 120Hz టచ్ శాంప్లింగ్ రేట్ తో కలిగి ఉంటుంది. ఈ స్మార్ట్ ఫోన్ Unisoc T612 ఆక్టా కోర్ ప్రాసెసర్ కి జతగా 2GB/3GB ర్యామ్ మరియు 32GB ఇంటర్నల్ స్టోరేజ్ లను కలిగి ఉంటుంది. ప్రత్యేకమైన మెమోరీ కార్డ్ ద్వారా స్టోరేజ్ ను 1TB వరకూ పెంచుకోవచ్చు. ఈ ఫోన్ లేక్ బ్లూ మరియు బ్యాంబూ గ్రీన్ రెండు కలర్ అప్షన్లలో లభిస్తుంది.
కెమెరాల విషయానికి వస్తే, రియల్ మీ C30 స్మార్ట్ ఫోన్ వెనుక కేవలం 8MP సింగల్ కెమెరాతో వస్తుంది. అలాగే, సెల్ఫీల కోసం ముందుభాగంలో 5MP సెల్ఫీ కెమెరా కూడా వుంది. ఈ ఫోన్ పెద్ద 5000mAh బ్యాటరీని 10W సాధారణ ఛార్జింగ్ సపోర్ట్ తో కలిగిఉంటుంది.
Realme C30: ధర
ఈ స్మార్ట్ ఫోన్ యొక్క స్టార్టింగ్ వేరియంట్ 2GB ర్యామ్ మరియు 32 స్టోరేజ్ తో రూ.7,499 ధరతో ప్రకటించింది. అలాగే, 3GB ర్యామ్ మరియు 32 స్టోరేజ్ వేరియంట్ ధర రూ.8,299. ఈ ఫోన్ జూన్ 27 న మొదటిసారిగా అమ్మకాలకు అంధుబాటులో ఉంటుంది.
Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile