మార్కెట్లోకి వచ్చిన మరొక Realme బడ్జెట్ స్మార్ట్ ఫోన్
Realme మరొక బడ్జెట్ స్మార్ట్ ఫోన్ ను లాంచ్ చేసింది
Realme C21y పేరుతో వచ్చింది
మంచి ఫీచర్లతోనే వచ్చింది
ఈరోజు ఇండియన్ మార్కెట్లోకి Realme మరొక బడ్జెట్ స్మార్ట్ ఫోన్ ను లాంచ్ చేసింది. Realme C21y పేరుతో ఈరోజు విడుదల చేసిన ఈ రియల్ మీ బడ్జెట్ స్మార్ట్ ఫోన్ ఈ ప్రైస్ సెగ్మెంట్ లో మంచి ఫీచర్లతోనే వచ్చింది. ఈ ఫోన్ 13ఎంపి AI ట్రిపుల్ కెమెరా,పెద్ద 5,000 mAh బ్యాటరీ మరియు TUV Rheinlad స్మార్ట్ ఫోన్ హై రిలయబిలిటీ సర్టిఫికేషన్ ట్వంటీ మరిన్ని ఫీచర్లను కలిగివుంది. ఈరోజే ఇండియన్ మార్కెట్లోకి వచ్చిన ఈ లేటెస్ట్ స్మార్ట్ ఫోన్ పూర్తి విశేషాలు తెలుసుకుందాం.
SurveyRealme C21y: ప్రైస్
రియల్ మీ సి21వై రెండు వేరియంట్స్ మరియు రెండు కలర్ అప్షన్ లలో లభిస్తుంది. ఈ ఫోన్ యొక్క బేస్ వేరియంట్ 3జిబి ర్యామ్ మరియు 32జిబి స్టోరేజ్ తో రూ.8,999 ధరతో లాంచ్ అయ్యింది. ఈ ఫోన్ యొక్క మరొక వేరియంట్ 4జిబి ర్యామ్ మరియు 64జిబి స్టోరేజ్ తో రూ.9 ,999 ధరతో లాంచ్ అయ్యింది. ఈ ఫోన్ యోక్క మొదటి సేల్ ఆగష్టు 30వ తేది మధ్యాహ్నం 112 గంటలకి మొదలవుతుంది. ఈ ఫోన్ క్రాస్ బ్లాక్ మరియు క్రాస్ బ్లూ అనే రేడు కలర్లలో లభిస్తుంది.
Realme C21y: స్పెక్స్
ఈ Realme C21y స్మార్ట్ ఫోన్ పెద్ద 6.5 అంగుళాల పరిమాణం గల మల్టి టచ్ డిస్ప్లేని HD+ (1600×720 ) పిక్సెల్స్ రిజల్యూషన్ గల ఇన్ సెల్ LCD డిస్ప్లే మరియు చిన్న వాటర్ డ్రాప్ నాచ్ డిజైనుతో కలిగి వుంటుంది. ఈ ఫోన్ Unisoc T610 ప్రాసెసర్ శక్తితో పనిచేస్తుంది. ఇది 12nm ఫ్యాబ్రికేషన్ తో గరిష్టంగా 1.8GHz క్లాక్ స్పీడ్ అందిస్తుంది. ఇది ఆండ్రాయిడ్ 11 ఆధారితమైన Realme UI తో వస్తుంది.
ఈ ఫోన్ వెనుక భాగంలో ట్రిపుల్ కెమెరాని అందించింది. ఇందులో ప్రధాన కెమెరాని మంచి రిజల్యూషన్ తో ఫోటోలు తియ్యగల 13MP AI కెమెరాతో అందించింది. దీనికి జతగా 2ఎంపి మ్యాక్రో మరియు 2ఎంపి పోర్ట్రైట్ సెన్సార్లను కలిగివుంది. ముందుభాగంలో, సెల్ఫీల కోసం 5ఎంపి సెల్ఫీ కెమెరా కూడా వుంది. ఈ ఫోన్ లో పెద్ద 5,000mAh బ్యాటరీని సూపర్ పవర్ సేవింగ్ మోడ్ తో కలిపి ఇచ్చినట్లు ప్రకటించింది.
Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile
