ఇండియాలో విడుదలకు సిద్ధమైన Realme C21y

HIGHLIGHTS

Realme C21y స్మార్ట్ ఫోన్ ఇండియా లాంచ్ డేట్ ఫిక్స్

ఆగష్టు 23 వ తేదీ లాంచ్ అవుతుంది

ఫ్లిప్ కార్ట్ ప్రత్యేకమైన మైక్రో సైట్ పేజ్ తో టీజింగ్ చేస్తోంది

ఇండియాలో విడుదలకు సిద్ధమైన Realme C21y

రియల్‌మీ గతనెల పిలిపైన్స్ లో ప్రకటించిన Realme C21y స్మార్ట్ ఫోన్ ను ఇప్పుడు ఇండియాలో కూడా విడుదల చెయ్యడానికి సిద్ధమవుతోంది. ఆగష్టు 23 వ తేదీ మధ్యాహ్నం 12:30 గంటలకు ఈ స్మార్ట్ ఫోన్ లాంచ్ ఈవెంట్ స్టార్ట్ అవుతుంది. ఈ ఫోన్ అమ్మకాలను Flipakart నుండి సాగించనుంది. ఎందుకంటే, ఫ్లిప్ కార్ట్ ఈ ఫోన్ ను ఒక ప్రత్యేకమైన మైక్రో సైట్ పేజ్ తో టీజింగ్ చేస్తోంది. ఈ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ స్పెక్స్, అంచనా ధర మరియు మరిన్ని వివరాలను గురించి తెలుసుకుందాం.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

Realme C21y: స్పెక్స్

ఈ Realme C21y స్మార్ట్ ఫోన్ పెద్ద 6.5 అంగుళాల పరిమాణం గల మల్టి టచ్ డిస్ప్లేని HD+ (1600×720 ) పిక్సెల్స్ రిజల్యూషన్ తో మరియు చిన్న వాటర్ డ్రాప్ నాచ్ డిజైనుతో కలిగి వుంటుంది.  ఈ ఫోన్ Unisoc T610 ప్రాసెసర్ శక్తితో పనిచేస్తుంది. ఇది 12nm ఫ్యాబ్రికేషన్ తో గరిష్టంగా 1.8GHz క్లాక్ స్పీడ్ అందిస్తుంది.

ఈ ఫోన్ వెనుక భాగంలో ట్రిపుల్ కెమెరాని అందించింది. ఇందులో ప్రధాన కెమెరాని మంచి రిజల్యూషన్ తో ఫోటోలు తియ్యగల 13MP AI కెమెరాతో అందించింది. ఫోన్ లో పెద్ద 5,000mAh బ్యాటరీని సూపర్ పవర్ సేవింగ్ మోడ్ తో కలిపి ఇచ్చినట్లు ప్రకటించింది.

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile