రియల్ మీ లేటెస్ట్ బడ్జెట్ స్మార్ట్ ఫోన్ Realme C21y ఫస్ట్ సేల్

రియల్ మీ లేటెస్ట్ బడ్జెట్ స్మార్ట్ ఫోన్ Realme C21y ఫస్ట్ సేల్
HIGHLIGHTS

రియల్ మీ సి21వై మొదటి సేల్

Realme C21y కేవలం 10 వేల కంటే తక్కువ ధరలో మంచి ఫీచర్లతో వచ్చింది

13ఎంపి AI ట్రిపుల్ కెమెరా,పెద్ద 5,000 mAh బ్యాటరీ

ఈవారం ప్రారంభంలో ఇండియన్ మార్కెట్లో Realme తన మరొక బడ్జెట్ స్మార్ట్ ఫోన్ ను లాంచ్ చేసింది. అదే, Realme C21y మరియు ఇది కేవలం 10 వేల కంటే తక్కువ ధరలో మంచి ఫీచర్లతో వచ్చింది. ఈ ఫోన్ 13ఎంపి AI ట్రిపుల్ కెమెరా,పెద్ద 5,000 mAh బ్యాటరీ మరియు TUV Rheinlad స్మార్ట్ ఫోన్ హై రిలయబిలిటీ సర్టిఫికేషన్ ట్వంటీ మరిన్ని ఫీచర్లను కలిగివుంది. ఈ స్మార్ట్ ఫోన్ యొక్క మొదటి సేల్ రేపు మద్యహ్నం 12 గంటలకి రియల్ మి వెబ్సైట్ మరియు Flipkart నుండి మొదలవుతుంది.

Realme C21y: ప్రైస్

రియల్ మీ సి21వై రెండు వేరియంట్స్ మరియు రెండు కలర్ అప్షన్ లలో లభిస్తుంది. ఈ ఫోన్ యొక్క బేస్ వేరియంట్ 3జిబి ర్యామ్ మరియు 32జిబి స్టోరేజ్ తో రూ.8,999 ధరతో లాంచ్ అయ్యింది.  ఈ ఫోన్ యొక్క మరొక వేరియంట్ 4జిబి ర్యామ్ మరియు 64జిబి స్టోరేజ్ తో రూ.9 ,999 ధరతో లాంచ్ అయ్యింది. ఈ ఫోన్ క్రాస్ బ్లాక్ మరియు క్రాస్ బ్లూ అనే రేడు కలర్లలో లభిస్తుంది.

Realme C21y: స్పెక్స్

ఈ Realme C21y స్మార్ట్ ఫోన్ పెద్ద 6.5 అంగుళాల పరిమాణం గల మల్టి టచ్ డిస్ప్లేని HD+ (1600×720 ) పిక్సెల్స్ రిజల్యూషన్ గల ఇన్ సెల్ LCD డిస్ప్లే మరియు చిన్న వాటర్ డ్రాప్ నాచ్ డిజైనుతో కలిగి వుంటుంది.  ఈ ఫోన్ Unisoc T610 ప్రాసెసర్ శక్తితో పనిచేస్తుంది. ఇది 12nm ఫ్యాబ్రికేషన్ తో గరిష్టంగా 1.8GHz క్లాక్ స్పీడ్ అందిస్తుంది. ఇది ఆండ్రాయిడ్ 11 ఆధారితమైన Realme UI తో వస్తుంది. 

ఈ ఫోన్ వెనుక భాగంలో ట్రిపుల్ కెమెరాని అందించింది. ఇందులో ప్రధాన కెమెరాని మంచి రిజల్యూషన్ తో ఫోటోలు తియ్యగల 13MP AI కెమెరాతో అందించింది. దీనికి జతగా 2ఎంపి మ్యాక్రో మరియు 2ఎంపి పోర్ట్రైట్ సెన్సార్లను కలిగివుంది. ముందుభాగంలో, సెల్ఫీల కోసం 5ఎంపి సెల్ఫీ కెమెరా కూడా వుంది. ఈ ఫోన్ లో పెద్ద 5,000mAh బ్యాటరీని సూపర్ పవర్ సేవింగ్ మోడ్ తో కలిపి ఇచ్చినట్లు ప్రకటించింది.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo