Realme C2 కేవలం రూ.5,999 ధరతో లాంచ్ : స్పెక్స్ మరియు ఆఫర్స్

HIGHLIGHTS

ఈ స్మార్ట్ ఫోన్ ఒక హీలియో P 22 ఆక్టా కోర్ ప్రొసెసరుకి జతగా 2GB ర్యామ్ శక్తితో వస్తుంది.

Realme C2 కేవలం రూ.5,999 ధరతో లాంచ్ : స్పెక్స్ మరియు ఆఫర్స్

ఈ రోజు ఢిల్లీ యూనివర్సిటీలో జరిగిన ఒక ప్రత్యేక కార్యక్రమంలో Realme ఆశ్చర్యకరంగా, తన బడ్జెట్ బీస్ట్ స్మార్ట్ అయినటువంటి రియల్మీ C1 యొక్క తరువాతి తరం అయినటువంటి, రియల్మీ C2 స్మార్ట్ ఫోన్ను విడుదల చేసింది. వాస్తవానికి, రియల్మీ3 ప్రో స్మార్ట్ ఫాంను విడుదల చేయడానికి ఈ రోజు కార్యక్రమాన్ని నిర్వహిస్తుండగా, ఆశ్చర్యకరంగా దాని కంటే ముందుగా రియల్మీ C2 ని విడుదల చేసింది. ఈ స్మార్ట్ ఫోన్ డ్యూయల్ కెమేరా మరియు మంచి ప్రాసెసర్ తో పాటుగా చాల అతక్కువ ధరకే వచ్చింది.                       

Digit.in Survey
✅ Thank you for completing the survey!

రియల్మీ C2 ప్రత్యేకతలు

రియల్మీ C2  స్మార్ట్ ఫోన్, ఒక 6.1 అంగుళాల HD డ్యూ డ్రాప్ నోచ్ డిస్ప్లేతో ఉంటుంది. ఇది 89%  స్క్రీన్-టూ-బాడీ రేషియోని అందిస్తుంది. ఇది ఒక వాటర్ డ్రాప్ నోచ్ మరియు వెనుక ఒక డైమండ్ కట్ డిజైన్ తో వస్తుంది.  అంతేకాదు,ఈ డిస్ప్లే కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 రక్షణతో వస్తుంది. ఈ స్మార్ట్ ఫోన్ ఒక హీలియో P 22 ఆక్టా కోర్ ప్రొసెసరుకి జతగా 2GB ర్యామ్ శక్తితో వస్తుంది.ఇది 3GB ర్యామ్ మరియు 32GB స్టోరేజితో వస్తుంది. అలాగే డ్యూయల్ SIM కార్డులతో పాటుగా ఒక SD మెమొరీ కార్డును కూడా ఒకేసారి వాడుకునేలా ట్రిపుల్ SIM స్లాట్ ఇందులో అందించారు.                

కెమేరాల విషయానికి వస్తే, వెనుక 13MP కెమేరాకు జతగా 2MP సెన్సార్ కలిగిన డ్యూయల్ రియర్ కెమేరాతో ఉంటుంది. ఇక సెల్ఫీ కెమేరా విషయానికి వస్తే, ముందుభాగంలో ఒక 5MP  సెల్ఫీ కెమెరాతో ఉంటుంది మరియు ఇది 8 రకాల బ్యూటీ కస్టమ్ మోడ్లతోవస్తుంది. ఇది ఆండ్రాయిడ్ 9 ఫై ఆధారితంగా కలర్ OS 6 పైన నడుస్తుంది. ఈ స్మార్ట్ ఫోన్ ఒక పెద్ద 4000mAh బ్యాటరీతో వస్తుంది మరియు దీనితో వేగవంతంగా ఛార్జ్ చెయ్యవచ్చని సంస్థ చెబుతోంది.

REALME C2 ధర మరియు ఆఫర్లు

REALME C2 (2GB ర్యామ్ + 16GB స్టోరేజి) – 5,999

REALME C2 (3GB ర్యామ్ + 32GB స్టోరేజి) – 7,999

REALME C2 యొక్క మొదటి సేల్ మే నెల 15వ తేదీన ఫ్లిప్ కార్ట్, రియల్మీ మరియు రిటైల్ స్టోర్లలో లభిస్తుంది. ఈ స్మార్ట్ ఫోన్ను జియో తో పాటుగా ఎంచుకునేవారికి  5300 రూపాయల విలువగల లాభాలను అందుకోవచ్చు.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo