ఇండియాలో రియల్ మీ 200MP కెమేరాతో Realme 11Pro Series 5G స్మార్ట్ ఫోన్ లను విడుదల చేస్తున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఈ సిరీస్ ఫోన్ ల కోసం మరొక కొత్త అప్డేట్ ను రియల్ మి అనౌన్స్ చేసింది. బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ బ్రాండ్ అంబాసిడర్ గా ఈ కొత్త ఫోన్ల ను లాంచ్ చేస్తున్నట్లు కొత్త అనౌన్స్ చేసింది. కొత్త అప్డేట్ వివరాల పైన ఒక లుక్కేద్దామా.
Survey
✅ Thank you for completing the survey!
Realme 11Pro Series 5G
రియల్ మి 11 ప్రో సిరీస్ 5G స్మార్ట్ ఫోన్స్ ను త్వరలో లాంచ్ చేయనున్నట్లు కంపెనీ గత వారం నుండి టీజింగ్ మొదలు పెట్టింది. ఇప్పటి వరకూ ఈ ఫోన్ కెమేరా తప్ప మిగిలిన వివరాలు వెల్లడించలేదు. అయితే, ఈరోజు ఈ అప్ కమింగ్ మిస్ర్టీ ఫోన్ సిరీస్ గురించి కొత్త అప్డేట్ ను అనౌన్స్ చేసింది. ఈ బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ బ్రాండ్ అంబాసిడర్ గా ఈ స్మార్ట్ ఫోన్ లను లాంచ్ చేస్తున్నట్లు ప్రకటించి తన అభిమానులను ఖుషి చేసింది. అంతేకాదు, ఈ ఫోన్ను జూన్ లో లాంచ్ చేస్తునట్లు కూడా ఈ కొత్త టీజర్ ఇమేజ్ ద్వారా చెప్పకనే చెప్పింది.
రియల్ మి తన అధికారిక ట్విట్టర్ హ్యాండిల్ నుండి షారుఖ్ ఖాన్ ను Realme కొత్త బ్రాండ్ అంబాసిడర్ గా ఆహ్వానిస్తున్నట్లు ట్వీట్ ద్వారా తెలిపింది. ఈ ట్వీట్ లో "Realme 11Pro Series 5G, see you in June" అని ప్రత్యేకంగా తెలిపింది. అంటే,ఈ సిరీస్ ను ఇండియన్ మార్కెట్ లో జూన్ నెలలో లాంచ్ చేస్తున్నట్లు కన్ఫర్మ్ చేసింది.
ఈ ఫోన్ కంప్లీట్ బ్యాక్ ప్యానల్ డిజైన్ మరియు కెమేరా వివరాలను ఈ టీజింగ్ లో చూపించింది.