రియల్‌మీ 9 ప్రో: 64MP ట్రిపుల్ కెమెరా మరియు SD 695 5G ప్రాసెసర్ తో వచ్చింది

HIGHLIGHTS

Realme 9 Pro స్మార్ట్ ఫోన్ ను మిడ్ రేంజ్ ధరలో ప్రకటించింది

9 Pro ఫోన్ లో స్ట్రీట్ ఫోటో గ్రఫీ మోడ్ 2.0 ని కూడా జతచేసింది

స్నాప్ డ్రాగన్ 695 5G ప్రాసెసర్ వంటి మరిన్ని ఆకట్టుకునే ఫీచర్లతో వచ్చింది

రియల్‌మీ 9 ప్రో: 64MP ట్రిపుల్ కెమెరా మరియు SD 695 5G ప్రాసెసర్ తో వచ్చింది

రియల్‌మీ Realme 9 Pro స్మార్ట్ ఫోన్ ను మిడ్ రేంజ్ ధరలో ప్రకటించింది. ఈ స్మార్ట్ ఫోన్ 64MP ట్రిపుల్ కెమెరా మరియు స్నాప్ డ్రాగన్  695 5G ప్రాసెసర్  వంటి మరిన్ని ఆకట్టుకునే ఫీచర్లతో వచ్చింది. అంతేకాదు, ఈ స్మార్ట్ ఫోన్ లో స్ట్రీట్ ఫోటో గ్రఫీ మోడ్ 2.0 ని కూడా జతచేసింది. రియల్‌మీ ఈరోజు విడుదల చేసిన ఈ లేటెస్ట్ ఫోన్ యొక్క ధర, స్పెక్స్ మరియు మరిన్ని వివరాలను  గురించి తెలుసుకుందాం.   

Digit.in Survey
✅ Thank you for completing the survey!

Realme 9 Pro: ధర

Realme 9 Pro స్మార్ట్ ఫోన్ యొక్క 6GB ర్యామ్ మరియు 128GB స్టోరేజ్ బేసిక్ వేరియంట్ ధర రూ. 17,999. అలాగే, 8GB ర్యామ్ మరియు 128GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 20,999. HDFC బ్యాంక్ కార్డ్స్ మరియు EMI తో కొనేవారికి 2,000 డిస్కౌంట్ అఫర్ ని కూడా రియల్ మీ ప్రకటించింది. ఈ ఫోన్ మిడ్ నైట్ బ్లాక్, అరోరా గ్రీన్, సన్ రైజ్ బ్లూ అనే మూడు కలర్ అప్షన్ లలో లభిస్తుంది.

ఈ ఫోన్ యొక్క మొదటి సేల్ ఫిబ్రవరి 23 న మధ్యాహ్నం 12 గంటలకు Flipkart మరియు Realme అధికారిక వెబ్సైట్ నుండి జరగనుంది.              

Realme 9 Pro : స్పెక్స్

రియల్‌మీ 9 ప్రో స్మార్ట్ ఫోన్ 6.6 ఇంచ్ FHD+ రిజల్యూషన్ కలిగిన డిస్ప్లేని కలిగివుంది మరియు ఇది 120Hz రిఫ్రెష్ రేట్ తో వస్తుంది. ఈ ఫోన్ లో ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ ను కూడా అందించింది. ఈ ఫోన్ క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 695 5G ఆక్టా కోర్ ప్రోసెసర్ జతగా 8GB ర్యామ్ శక్తితో పనిచేస్తుంది. ఇది మాత్రమే కాదు, ఇది 5GB ఎడిషన్ వర్చువల్ RAM కి మద్దతు ఇస్తుంది. ఈ లేటెస్ట్ రియల్ మి ఫోన్  డ్యూయల్ 5G సపోర్ట్ తో అవస్తుంది మరియు Realme UI 3 స్కిన్ పైన లేటెస్ట్ Android 12 OS పైన నడుస్తుంది.      

ఈ ఫోన్ వెనుక ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ని అందించింది. ఇందులో 64MP నైట్ స్కెప్ కెమెరాకి జతగా 8MP అల్ట్రా వైడ్ కెమెరా మరియు 2MP మ్యాక్రో సెన్సార్ వున్నాయి. సెల్ఫీల కోసం 16 మెగాపిక్సెల్ ఇన్ డిస్ప్లే సెల్ఫీ కెమెరాని కలిగి వుంది. ఈ ఫోన్ కెమెరా కోసం స్ట్రీట్ ఫోటోగ్రఫీ 2.0 సపోర్ట్ ను కూడా జతచేసింది.  ఈ ఫోన్ టైప్-C పోర్ట్ తో 33W డార్ట్ ఛార్జ్ సపోర్ట్ కలిగిన 5,000 mAh బ్యాటరీని కలిగివుంది.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo