Realme 9 5G Sale: భారీ అఫర్ లతో రియల్ మీ కొత్త 5G ఫోన్ల మొదటి సేల్..!!

HIGHLIGHTS

Realme 9 5G మరియు 9 5G (SE) మొదటి సేల్ రేపు మొదలవుతుంది

రేపు మధ్యాహ్నం 12 గంటల నుండి realme.com మరియు ఫ్లిప్ కార్ట్ నుండి లభిస్తాయి

రియల్ మీ కొత్త 5G ఫోన్ల పైన1,500 రూపాయల వరకు డిస్కౌంట్ ఆఫర్ అందుబాటులో వుంది

Realme 9 5G Sale: భారీ అఫర్ లతో రియల్ మీ కొత్త 5G ఫోన్ల మొదటి సేల్..!!

రియల్ మీ ఇండియాలో లేటెస్ట్ గా విడుదల చేసిన Realme 9 5G మరియు 9 5G స్పీడ్ ఎడిషన్(SE) స్మార్ట్ ఫోన్లమొదటి సేల్ రేపు మొదలవుతుంది. రియల్ మీ యొక్క ఈ లేటెస్ట్ 5G స్మార్ట్ ఫోన్లు రేపు మధ్యాహ్నం 12 గంటల నుండి realme.com మరియు ఫ్లిప్ కార్ట్ నుండి లభిస్తాయి. ఈ స్మార్ట్ ఫోన్లను బిగ్ సేవింగ్ డేస్ సేల్ నుండి SBI బ్యాంక్ క్రెడిట్ కార్డ్స్ తో కొనేవారికి డిస్కౌంట్ లభిస్తుంది. అలాగే, realme.com నుండి ICICI బ్యాంక్ కార్డ్స్ తో కొనేవారికి 1500 రూపాయల వరకు డిస్కౌంట్ ఆఫర్ అందుబాటులో వుంది.          

Digit.in Survey
✅ Thank you for completing the survey!

Realme 9 5G: స్పెక్స్

Realme 9 5G స్మార్ట్ ఫోన్ 6.5-అంగుళాల FHD+ రిజల్యూషన్ LCD స్క్రీన్ తో వస్తుంది. ఈ డిస్ప్లే 90Hz రిఫ్రెష్ రేట్ మరియు 180Hz టచ్ శాంప్లింగ్ రేట్ కలిగివుంది మరియు ఇది పంచ్-హోల్‌ డిజైన్ తో వస్తుంది. ఈ ఫోన్ డైమెన్సిటీ 810 ఆక్టా కోర్ ప్రోసెసర్ కి జతగా 6GB ర్యామ్ మరియు 128GB (UFS 2.1) స్టోరేజ్‌తో వస్తుంది.

వెనుకవైపు, ఈ ఫోన్ లో ట్రిపుల్ కెమెరా సెటప్ వుంది. ఇందులో 48MP ప్రైమరీ కెమెరా, 2MP (4cm) మాక్రో సెన్సార్ మరియు 2MP B/W సెన్సార్‌ ఉన్నాయి.ఈ కెమెరాతో 30FPS తో 1080P వీడియో రికార్డింగ్ చేయవచ్చు. అలాగే, ఈ ఫోన్ 5000mAh బ్యాటరీని 18W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో కలిగివుంది. డ్యూయల్ సిమ్, 3.5mm హెడ్‌ఫోన్ జాక్, 5GB వరకు వర్చువల్ ర్యామ్, డ్యూయల్-మోడ్ 5G, సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ రీడర్, బ్లూటూత్ 5.1 మొదలైన ఫీచర్లు కూడా అందుకుంటారు.

Realme 9 5G: ధర

Realme 9 5G యొక్క బేసిక్ వేరియంట్ (4GB+64GB) ధర రూ.14,999 మరియు మరొక వేరియంట్ (6GB +128GB) ధర రూ.17,499. మార్చి 14న మధ్యాహ్నం 12 గంటలకు Flipkart మరియు Realme.com నుండి ఈ రెండు స్మార్ట్ ఫోన్ల మొదటి సేల్ జరుగుతుంది.

Realme 9 SE.jpg

Realme 9 5G స్పీడ్ ఎడిషన్: స్పెక్స్

రియల్ మీ 9 5G SE ఫోన్ 6.6-అంగుళాల 144Hz అడాప్టివ్ రిఫ్రెష్ రేట్ LCD స్క్రీన్‌ను 240Hz టచ్ శాంప్లింగ్ రేట్, HDR10, DCI-P3 కలర్ గామట్ మరియు 600 నిట్స్ పీక్ బ్రైట్నెస్ తో ప్యాక్ చేస్తుంది. స్పీడ్ ఎడిషన్ వెనుకవైపు, 48MP ప్రధాన సెనర్ తో పాటు 2MP మాక్రో ప్లస్ మోనోక్రోమ్ సెన్సార్‌తో కూడిన కెమెరాను పొందుతారు. ఈ ఫోన్ తో మీరు 30 FPS వద్ద 4K వరకు వీడియోని షూట్ చేయవచ్చు.

ఈ స్మార్ట్ ఫోన్ వేగవంతమైన స్నాప్‌డ్రాగన్ 778G ఆక్టా కోర్ ప్రోసెసర్ కి జతగా 8GB LPDDR4x RAM మరియు 128GB UFS 2.2 స్టోరేజ్ లను కలిగివుంది. ఈ ఫోన్‌లో 30W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌ క్లైగిన 5000mAh బ్యాటరీ కూడా ఉంది. ఈ ఫోన్ Android 11 ఆధారిత Realme UI 2.0, డ్యూయల్ 5G సపోర్ట్, 3.5mm జాక్, WiFi 6, బ్లూటూత్ 5.2, మొదలైన వాటితో వస్తుంది.

Realme 9 5G SE: ధర

Realme 9 SE బేస్ వేరియంట్‌(6GB + 128GB) ధర రూ.19,999 మరియు 8GB + 128GB మోడల్‌ ధర రూ.22,999. మార్చి 14న మధ్యాహ్నం 12 గంటలకు Flipkart మరియు Realme.com నుండి ఈ రెండు స్మార్ట్ ఫోన్ల మొదటి సేల్ జరుగుతుంది.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo