Realme 8s: లాంచ్ డేట్ ఫిక్స్..మార్కెట్లోకి వస్తున్న మరో 5G ఫోన్
Realme 8s లాంచ్ డేట్ ప్రకటించింది
Realme 8i ని కూడా లాంచ్ చేస్తోంది
మార్కెట్లోకి Realme మరొక 5G స్మార్ట్ ఫోన్
రియల్ మీ తన అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ Realme 8s ను ఇండియాలో లాంచ్ చెయ్యడానికి డేట్ ప్రకటించింది. ఈ అప్ కమింగ్ రియల్ మీ స్మార్ట్ ఫోన్ Dimensity 810 తో వస్తున్న మొదటి ఫోన్ అవుతుంది. ఇదే తేదికి Realme 8i ని కూడా లాంచ్ చేస్తున్నట్లు రియల్ మీ ప్రకటించింది. అందరి కంటే ముందుగా బడ్జెట్ ధరకే 5G స్మార్ట్ ఫోన్ ప్రకటించిన Realme ఇప్పుడు మరొక 5G స్మార్ట్ ఫోన్ ను కూడా ఇండియన్ మార్కెట్ లో లాంచ్ చెయ్యడానికి సిద్ధమవుతోంది.
Survey
ప్రముఖ ఇ-కామర్స్ వెబ్‌సైట్ ఫ్లిప్‌కార్ట్ ఇప్పటికే ఈ ఫోన్ కోసం ప్రత్యేకమైన మైక్రోసైట్‌ని ఏర్పాటు చేసింది. అంటే, ఈ ఫోన్ ఫ్లిప్‌కార్ట్ ద్వారా సేల్ అవుతుంది. ఇక మైక్రోసైట్ ద్వారా ఈ ఫోన్ 5G స్మార్ట్‌ఫోన్ అని వెల్లడించింది మరియు ఈ ఫోన్ లేటెస్ట్ మీడియాటెక్ డైమెన్సిటీ 810 చిప్‌సెట్ తో వస్తున్న మొదటి ఫోన్ కూడా అవుతుంది. వాస్తవానికి, రియల్ మీ 8ఎస్ స్మార్ట్ ఫోన్ Realme 8i మరియు Realme Pad తో పాటుగా ప్రకటించబడుతుందని ఆశిస్తున్నారు. అయితే, ఈ ఫోన్ యొక్క లాంచ్ డేట్ ఇంకా ప్రకటించలేదు.
Realme 8S: అంచనా స్పెక్స్
ముందుగా వచ్చిన లీక్స్ ప్రకారం, Realme 8s స్మార్ట్ ఫోన్ వెనుక స్క్వేర్ షేప్ కెమెరా మాడ్యూల్ లో అమర్చిన ట్రిపుల్ కెమెరా సెటప్ తో ఉంటుంది. ఈ ఫోన్ 90Hz రిఫ్రెష్ రేట్ గల 6.5 ఇంచ్ డిస్ప్లే తో వస్తుందని భావిస్తున్నారు. ఈ ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 810 చిప్‌సెట్ శక్తితో పనిచేస్తుంది మరియు 6జిబి మరియు 8జిబి అప్షన్ లతో జతచేయవచ్చు. అలాగే, బిగ్ బ్యాటరీ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తో ఈ ఫోన్ వస్తుందని ఊహిస్తున్నారు.