8000 mAh భారీ బ్యాటరీ ఫోన్ Realme 16T 5G పై భారీ ఆఫర్స్ అందుకోండి.!

HIGHLIGHTS

Realme 16T 5G స్మార్ట్ ఫోన్ ఇప్పుడు భారీ ఆఫర్స్ తో సేల్ కి అందుబాటులోకి వచ్చింది

ఈ స్మార్ట్ ఫోన్ 8000 mAh భారీ బ్యాటరీ తో లాంచ్ అయ్యింది

ఈ ఫోన్ లాంచ్ లో భాగంగా రియల్ మీ గొప్ప డిస్కౌంట్ ఆఫర్స్ కూడా అందించింది

8000 mAh భారీ బ్యాటరీ ఫోన్ Realme 16T 5G పై భారీ ఆఫర్స్ అందుకోండి.!

రియల్ మీ ఇండియాలో జస్ట్ వారం క్రితం విడుదల చేసిన Realme 16T 5G స్మార్ట్ ఫోన్ ఇప్పుడు భారీ ఆఫర్స్ తో సేల్ కి అందుబాటులోకి వచ్చింది. ఈ స్మార్ట్ ఫోన్ 8000 mAh భారీ బ్యాటరీ తో లాంచ్ అయ్యింది. ఈ ఫోన్ లాంచ్ లో భాగంగా రియల్ మీ గొప్ప డిస్కౌంట్ ఆఫర్స్ కూడా అందించింది. ఈ ఫోన్ ప్రైస్, ఆఫర్స్ మరియు కంప్లీట్ ఫీచర్స్ తెలుసుకోండి.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

Realme 16T 5G : ప్రైస్ అండ్ ఆఫర్స్

ఈ ఫోన్ మిడ్ రేంజ్ ప్రైస్ సెగ్మెంట్ లో లాంచ్ అయ్యింది. ఈ ఫోన్ బేసిక్ (6GB + 128GB) వేరియంట్ ను రూ. 29,999 ధరతో, (8GB + 128GB) వేరియంట్ ను రూ. 31,999 ప్రైస్ తో లాంచ్ చేసింది. రియల్ మీ 16 టి హై ఎండ్ (8GB + 256GB) వేరియంట్ ను రూ. 34,999 ధరతో అందించింది.

ఇక విషయానికి వస్తే, రియల్ మీ ఈ ఫోన్ పై రూ. 2,000 బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్ మరియు రూ. 5,000 రూపాయల భారీ ఎక్స్చేంజ్ బోనస్ ఆఫర్ లను ప్రకటించింది. ఈ రెండు ఆఫర్స్ కాకుండా రియల్ మీ యూజర్లకు రూ. 2,000 రూపాయల స్పెషల్ లోయల్ బోనస్ ఆఫర్ కూడా అందించింది.

Also Read: Xiaomi 17T బ్యాటరీ మరియు చిప్ సెట్ వివరాలు రివీల్ చేసిన షియోమీ.!

Realme 16T 5G : ఫీచర్స్

ఈ రియల్ మీ ఫోన్ పెద్ద 6.8 ఇంచ్ HD+ రిజల్యూషన్ స్క్రీన్ కలిగి ఉంటుంది. ఈ ప్రైస్ సెగ్మెంట్ లో ఇది పెద్ద మైనస్ పాయింట్ అనే చెప్పాలి. అయితే, 144Hz రిఫ్రెష్ రేట్ తో పాటు 1200 నిట్స్ HBM బ్రైట్నెస్ ను ఈ స్క్రీన్ కలిగి ఉంది. ఈ ఫోన్ బడ్జెట్ ఫోన్ లలో ఉండే మీడియాటెక్ Dimensity 6300 చిప్ సెట్ తో లాంచ్ అయ్యింది. 8GB ర్యామ్ మరియు 256GB అంతర్గత స్టోరేజ్ కూడా ఈ ఫోన్ లో ఉంటుంది.

కెమెరా పరంగా, ఈ ఫోన్ 50MP జతగా 50MP డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ తో వస్తుంది. అలాగే, 16MP సెల్ఫీ కెమెరా కూడా ఈ ఫోన్ లో ఉంటుంది. కానీ, ఈ ఫోన్ లో 4K సపోర్ట్ మాత్రం అందించలేదు. ఈ ఫోన్ కేవలం 60FPS తో 1080 (FHD) వీడియో రికార్డింగ్ సపోర్ట్ మాత్రమే కలిగి ఉంటుంది. అయితే, Ai కెమెరా ఫీచర్స్ మాత్రం కలిగి ఉంది. ఈ ఫోన్ కలిగిన బ్యాటరీ పరంగా మాత్రం గొప్పగా ఉంటుంది. ఎందుకంటే, రియల్ మీ ఈ ఫోన్ ను 7 సంవత్సరాల లైఫ్ కలిగిన 8000 mAh భారీ బ్యాటరీతో అందించింది. ఈ ఫోన్ లో 45W ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ ను కూడా ఆఫర్ చేసింది.

Raja Pullagura

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile