Realme 8 5G పైన భారీ ఆఫర్లు

Realme 8 5G పైన భారీ ఆఫర్లు
HIGHLIGHTS

Flipkart నుండి Realme 8 5G భారీ ఆఫర్లతో అమ్ముడవుతోంది.

HDFC క్రెడిట్ మరియు డెబిట్ కార్డ్ EMI ట్రాన్సక్షన్ తో కొనే వారికీ 12% తగ్గింపుతో లభిస్తోంది.

మీ పాత స్మార్ట్ ఫోన్ తో ఎక్స్చేంజి పైన 14,450 రూపాయల వరకూ అధిక మొత్తాన్ని కూడా ఆఫర్ల చేస్తోంది.

ఇండియాలో అతి తక్కువ ధరలో 5G టెక్నాలజీతో వచ్చిన స్మార్ట్ ఫోనుగా Realme 8 5G నిలుస్తుంది. అయితే, ఇప్పుడు ఈ ఫోన్ మరింత సరసమైన ధరకే లభిస్తుంది. ఎందుకంటే, Flipkart నుండి ఈ ఫోన్ భారీ ఆఫర్లతో అమ్ముడవుతోంది. కేవలం రూ. 14,999 రూపాయల ప్రారంభ ధరతో వచ్చిన ఈ స్మార్ట్ ఫోన్ HDFC క్రెడిట్ మరియు డెబిట్ కార్డ్ EMI ట్రాన్సక్షన్ తో కొనే వారికీ 12% తగ్గింపుతో లభిస్తోంది. అంతేకాదు, మీ పాత స్మార్ట్ ఫోన్ తో ఎక్స్చేంజి పైన 14,450 రూపాయల వరకూ అధిక మొత్తాన్ని కూడా ఆఫర్ల చేస్తోంది.                    

Realme 8 5G : టాప్ ఫీచర్లు

1. డిస్ప్లే

ఈ Realme 85G ఫోన్ 6.5 అంగుళాల పరిమాణంతో 2400×1080 పిక్సెల్స్ రిజల్యూషన్ తో FHD+ డిస్ప్లే  మరియు పంచ్ హోల్ డిజైనుతో ఉంటుంది. ఈ డిస్ప్లే యొక్క అధనపు ఫీచర్ల గురించి చూస్తే, ఇది 90Hz రిఫ్రెష్ రేటుతో వస్తుంది. అంతేకాదు, ఇది గరిష్టంగా 600 నిట్స్ బ్రైట్నెస్ అందించగలదు.                                    

2. ప్రాసెసర్

ఈ ఫోన్ మంచి 5G పర్ఫార్మెన్స్ అందించగల, మీడియాటెక్ యొక్క లేటెస్ట్  ప్రొసెసర్ Dimensity 700 5G ఆక్టా కోర్ ప్రాసెసర్ శక్తితో పనిచేస్తుంది. ఇది 7nm ప్రొడక్షన్ ప్రొసెసర్ తో గరిష్టంగా 2.2GHz క్లాక్ స్పీడ్ అందిస్తుంది. ఇందులో ఉన్న ARM Mali-G57 GPU కారణంగా గ్రాఫిక్స్ కూడా బాగుంటాయిమరియు హెవీ గేమ్స్ కూడా ప్లే చేయవచ్చు.

3. ర్యామ్ & స్టోరేజి

ఈ ఫోన్ను రెండు ర్యామ్ వేరియంట్ ఎంపికలతో ప్రకటించింది. అవి : 4GB ర్యామ్ + 128GB స్టోరేజి మరియు  8GB ర్యామ్ +128GB స్టోరేజి వంటి రెండు వేరియంట్లు . వీటి ధరలు ఈ క్రింద చూడవచ్చు.

Realme 8 Pro : ధరలు

1. Realme 8 5G  : 4GB ర్యామ్ + 128GB స్టోరేజి : Rs.14,999/-

2. Realme 8 5G  : 8GB ర్యామ్ + 128GB స్టోరేజి : Rs.16,999/-

4. కెమేరా

Realme ఈ ఫోన్ లో వెనుక 48MP నైట్ స్కెప్ కెమెరా సెటప్పును అందించింది. ఈ ట్రిపుల్ కెమెరాలో, f/1.8 ఎపర్చర్ కలిగిన ఒక 48MP ప్రధాన కెమెరాని ఇంచింది. రెండవ కెమేరాగా 4CM మ్యాక్రో మరియు B&W సెన్సార్ ని అందించింది. ఇక సెల్ఫీ కెమేరా కేమెరా విషయానికి వస్తే, ముందు పంచ్ హోల్ సెల్ఫీ కెమెరాతో ఈ ఫోన్ వస్తుంది. ఇందులో, ఒక 16MP సెల్ఫీ కెమెరా ఇచ్చింది. ఈ కెమేరాతో మీరు మంచి  HD సెల్ఫీ ఫోటోలు మరియు వీడియోలను కూడా తీయ్యోచ్చు.

5. బ్యాటరీ

ఈ Realme 8 5G  ఒక 5,000mAh బ్యాటరీతో వుంటుంది. అంతేకాదు, ఈ ఫోన్ యొక్క బ్యాటరీని వేగవంతమైన టైప్-C 18W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టుతో క్లైగి వుంటుంది. ఈ వేగవంతమైన ఈ ఛార్జింగ్ టెక్నాలజీతో చాలా వేగంగా బ్యాటరీని ఛార్జ్ చెయ్యొచ్చు.       

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo