వివో U20 VS రియల్మీ 5s : ఏది మీకు బెటర్ ?

వివో U20 VS రియల్మీ 5s : ఏది మీకు బెటర్ ?
HIGHLIGHTS

మీకు ఏది సరైన ఎంపికగా ఉంటుందో తెలుసుకుందాం.

ఇండియాలో వివో తన VIVO U 20 స్మార్ట్ ఫోన్ను విడుదల చేసింది. ఈ స్మార్ట్ ఫోన్, స్నాప్ డ్రాగన్ 675 SoC తోపాటుగా ఒక పెద్ద 5000mAh బ్యాటరీ తో లాంచ్ చెయ్యబడింది. ఈ స్మార్ట్ ఫోన్ను కేవలం రూ .10,990 రూపాయల ప్రారంభ ధర వద్ద విడుదల చేసింది. ఈ స్మార్ట్ ఫోన్ను, ఇటీవల వెనుక నాలుగు కెమేరాలు మరియు పెద్ద బ్యాటరీతో రియల్మీ ఇటీవల ఇండియాలో తీసుకొచ్చిన  Realme 5s తో సరిపోల్చి మీకు ఏది సరైన ఎంపికగా ఉంటుందో తెలుసుకుందాం.

డిస్ప్లే :

Realme 5s స్మార్ట్ ఫోన్, ఒక 6.5 అంగుళాల HD+ రిజల్యూషన్ అందించగల మినీ డ్రాప్ డిజైన్ డిస్ప్లేతో వస్తుంది. ఈ అతి చిన్నని నోచ్ డిజైనులో ఒక సెల్ఫీ కెమేరాని ఇందులో అందించింది. ఈ స్మార్ట్ఫోన్ 89 శాతం స్క్రీన్-టు-బాడీ నిష్పత్తితో వస్తుంది. ఈ వివో యు 20 ఒక పెద్ద 6.35-అంగుళాల FHD + ఐపిఎస్ డిస్ప్లే తో వస్తుంది. ఇది 2340*1080 పిక్సెళ్ళ రిజల్యూషన్ అందిస్తుంది. ఈ విభాగంలో, VIVO U20 డి పైచేయిగా చెప్పొచ్చు.      

ప్రాసెసర్, ర్యామ్ మరియు స్టోరేజి:

ఈ వివో U20 స్మార్ట్‌ ఫోన్ ఒక క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 675AIE ప్రాసెసర్‌తో పనిచేస్తుంది మరియు గేమింగ్ పనితీరును మెరుగుపరచడానికి, ఈ ఫోన్ అల్ట్రా గేమ్ మోడ్‌ను కూడా కలిగి ఉంటుంది. దీనికి జతగా, 4GB/6GB  ర్యామ్ మరియు 64GB  స్టోరేజితో ఎంచుకోవచ్చు. రియల్మీ 5S స్మార్ట్ ఫోన్, ఒక స్నాప్డ్రాగెన్ 665 ఆక్టా కోర్ ప్రాసెసరుతో పనిచేస్తుంది. ఇది గరిష్టంగా, 2.0GHz వరకు క్లాక్ స్పీడును అందిస్తుంది దీని జతగా 4GB మరియు 64GB /128GB స్టోరేజి ఎంపికలతో ఎంచుకోవచ్చు. ఈ విభాగంలో కూడా స్పీడ్ మరియు ప్రాసెసింగ్ పరంగా U 20 కొంచెం అధికంగా ఉంటుందని చెపొచ్చు.

రియర్ కెమేరా :

REALME 5S  స్మార్ట్ ఫోను యొక్క వెనుక భాగంలో ఒక క్వాడ్ కెమేరా సెటప్పును  అందించింది. ఒక ప్రధాన 48MP (samsung GM1) కెమేరాతో కూడిన క్వాడ్ రియర్ కెమెరా ఇందులో ఇవ్వబడింది. అలాగే, ఇది 8MP వైడ్ యాంగిల్ లెన్స్ మరియు 2MP డెప్త్ సెన్సార్ కి జతగా 2MP మాక్రో కెమేరా కలిగి ఉంది. ఈ కెమెరాలో అందించిన కెమేరాతో 10X డిజిటల్ జూమ్ చేసుకోవచ్చు. ఇక U20 విషయానికి వస్తే,  వెనుక భాగంలో AI ట్రిపుల్ కెమెరా సెటప్ అందుబాటులో ఉంది, దీనిలో 16 MP ప్రాధమిక కెమెరా మరియు దానికి జతగా ఒక 8 MP వైడ్ యాంగిల్ కెమెరా మరియు మూడవదిగా  2 MP  మాక్రో సెన్సార్ కూడా ఉన్నాయి. ఈ విభాగంలో రియల్మీ 5s ఫోను కొంచం అధికంగా నిలుస్తుంది.  

సెల్ఫీ కెమేరా :

ముందు కెమెరా విషయానికి వస్తే, వివో U 20  ఫోన్ ముందు భాగంలో 16 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఇవ్వబడింది. రియల్మీ 5s లో ముందు 13 MP  సెల్ఫీ కెమేరాతో వస్తుంది.

బ్యాటరీ & చార్జర్ టెక్నాలజీ

రియల్మీ 5S  లో ఒక 10 W వేగవంతమైన ఛార్జింగ్ టెక్నాలజీ కలిగిన 5000 mAh బ్యాటరీతో వస్తుంది. వివో U 20 మాత్రం, ఒక 5,000 ఎంఏహెచ్ సామర్థ్యం గల బ్యాటరీని ఒక 18W స్పీడ్ ఛార్జింగ్ టెక్నాలజీతో పాటుగా బాక్స్ లోనే ఒక 18W చార్జరుతో ఇచ్చింది.

OS

రియల్మీ 5S స్మార్ట్ ఫోన్ కలర్ OS 6 స్కిన్ తో ఆండ్రాయిడ్ 9 ఫై ఆధారితంగా నడుస్తుంది. U 20  ఫోన్, ఆండ్రాయిడ్ 9 పై ఆధారితంగా Funtouch OS 9.2 స్కిన్ పైన నడుస్తుంది

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo