రియల్మీ 5s మరియు రెడ్మి నోట్ 8 మధ్య గమనించదగిన వ్యత్యాసాలు ఇవే

రియల్మీ 5s మరియు రెడ్మి నోట్ 8 మధ్య గమనించదగిన వ్యత్యాసాలు ఇవే

ఇండియాలో కేవలం 10,000 కంటే తక్కువధరలో మంచి ఫీచర్లతో కొత్తగా వచినటువంటి స్మార్ట్ ఫోన్లలో దాదాపుగా ఒకే విధమైన ప్రత్యేకతలో వచ్చిన స్మార్ట్ ఫోన్లుగా రెడ్మి నోట్ 8 మరియు రియల్మీ 5S గురించి చెప్పొచ్చు. వాస్తవానికి, ఒకే విధంగా అనిపించినా వీటి మధ్య చాలా వ్యత్యాసాలు వున్నాయి. కాబట్టి ఈ రేడు స్మార్ట్ ఫోన్లా యొక్క స్పెక్స్ ని నిశితంగా పరిశీలించి వాటి మధ్య గల తేడాలేంటో చూద్దాం..       

డిస్ప్లే :

Realme 5s స్మార్ట్ ఫోన్, ఒక 6.5 అంగుళాల HD+ రిజల్యూషన్ అందించగల మినీ డ్రాప్ డిజైన్ డిస్ప్లేతో వస్తుంది. ఈ అతి చిన్నని నోచ్ డిజైనులో ఒక సెల్ఫీ కెమేరాని ఇందులో అందించింది. ఈ స్మార్ట్ఫోన్ 89 శాతం స్క్రీన్-టు-బాడీ నిష్పత్తితో వస్తుంది. ఇక రెడీమి నోట్ 8 విషయానికి వస్తే, రెడ్మి నోట్ 8  ఒక 6.3-అంగుళాల స్క్రీన్‌తో వస్తుంది. ఇది FHD+ రిజల్యూషన్ కలిగి యాస్పెక్ట్ రేషీతో వస్తుంది మరియు ఈ డిస్ప్లే ఒక కార్ణింగ్ గొరిల్లా గ్లాస్ 5 రక్షణతో ఉంటుంది. ఇక వెనుక భాగంలో కూడా ఇది గొరిల్లా గ్లాస్ 5 తో వస్తుంది.

ప్రాసెసర్, ర్యామ్ మరియు స్టోరేజి:

రియల్మీ 5S స్మార్ట్ ఫోన్, ఒక స్నాప్డ్రాగెన్ 665 ఆక్టా కోర్ ప్రాసెసరుతో పనిచేస్తుంది. ఇది గరిష్టంగా, 2.0GHz వరకు క్లాక్ స్పీడును అందిస్తుంది దీని జతగా 4GB మరియు 64GB /128GB స్టోరేజి ఎంపికలతో ఎంచుకోవచ్చు. అలాగే, రెడ్మి నోట్ 8 లో కూడా 2.0Ghz క్లాక్ స్పీడ్ అందించగల ఒక స్నాప్ డ్రాగన్ 665 ఆక్టా కోర్ చిప్‌ సెట్‌ ని అందించారు. దీనికి జతగా, ఒక 4GB/6GB  ర్యామ్ మరియు 64GB/128GB ఇంటర్నల్ స్టోరేజి ఎంపికలతో వస్తుంది.రెండింటిలో కూడా ఒక డేడికేటెడ్ మెమొరీ కార్డు ద్వారా మెమొరీ సామర్ధ్యాన్ని పీచుకునే అవకాశం ఉంది.   

రియర్ కెమేరా :

REALME 5S  స్మార్ట్ ఫోను యొక్క వెనుక భాగంలో ఒక క్వాడ్ కెమేరా సెటప్పును  అందించింది. ఒక ప్రధాన 48MP (samsung GM1) కెమేరాతో కూడిన క్వాడ్ రియర్ కెమెరా ఇందులో ఇవ్వబడింది. అలాగే, ఇది 8MP వైడ్ యాంగిల్ లెన్స్ మరియు 2MP డెప్త్ సెన్సార్ కి జతగా 2MP మాక్రో కెమేరా కలిగి ఉంది. ఈ కెమెరాలో అందించిన కెమేరాతో 10X డిజిటల్ జూమ్ చేసుకోవచ్చు. ఇక రెడ్మి నోట్ 8 విషయానికి వస్తే, ఈ మొబైల్ ఫోనులో గరిష్టంగా ఒక  48 MP(samsung GM1) సెన్సార్ గల క్వాడ్ కెమేరా సేటప్పుతో వస్తుంది. ఈ ప్రధాన కెమేరాకి జతగా ఒక 8MP అల్ట్రా వైడ్ యాంగిల్ సెన్సారుతో పాటుగా ఒక 2MP డెప్త్ సెన్సార్ మరియు  ఒక 2MP మాక్రో సెన్సారుతో కెమెరాను అందించింది.

సెల్ఫీ కెమేరా :

ముందు కెమెరా విషయానికి వస్తే, రియల్మీ 5s వోనులో ముందు 13 MP  సెల్ఫీ కెమేరాతో వస్తుంది. అదే రెడ్మి నోట్ 8 విషయానికి వస్తే, ఈ ఫోన్లో కూడా 13MP సెల్ఫీ కెమెరాను పొందుతారు.

బ్యాటరీ & చార్జర్ టెక్నాలజీ

రియల్మీ 5S  లో ఒక 10 W వేగవంతమైన ఛార్జింగ్ టెక్నాలజీ కలిగిన 5000 mAh బ్యాటరీతో వస్తుంది. రెడ్మి నోట్ 8 మాత్రం, ఒక 4,000 ఎంఏహెచ్ సామర్థ్యం గల బ్యాటరీని ఇచ్చింది. కానీ, ఇది 18W స్పీడ్ ఛార్జింగ్ టెక్నాలజీతో పాటుగా బాక్స్ లోనే ఒక 18W చార్జరుతో వస్తుంది.

OS

రియల్మీ 5S స్మార్ట్ ఫోన్ కలర్ OS 6 స్కిన్ తో ఆండ్రాయిడ్ 9 ఫై ఆధారితంగా నడుస్తుంది. రెడ్మి నోట్ 8 తన సొంత MIUI 10 స్కిన్ పైన ఆండ్రాయిడ్ 9 ఫై  ఆధారితంగా నడుస్తుంది.  

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo