REALME 5S ఒక 48MP గల క్వాడ్ కెమేరా మరియు 5,000 mAh బ్యాటరీతో లాంచ్ అవ్వనుంది

REALME 5S ఒక 48MP గల క్వాడ్ కెమేరా మరియు 5,000 mAh బ్యాటరీతో లాంచ్ అవ్వనుంది
HIGHLIGHTS

ఫ్లిప్‌ కార్ట్‌ లో ఒక కొత్త మైక్రోసైట్ పేజీ కూడా LIVE చెయ్యబడింది.

రియల్మి 5 S ఒక 48MP ప్రధాన కేమెరా కలిగిన క్వాడ్ కెమేరాతో, నవంబర్ 20 న విడుదలకానున్న రియల్మి X 2 ప్రో తో పాటు భారతదేశంలో విడుదలవడానికి సిద్ధంగా ఉన్నట్లు ధృవీకరించబడింది. అంతేకాదు, రియల్మి 5 S కోసం ఫ్లిప్‌ కార్ట్‌ లో ఒక కొత్త మైక్రోసైట్ పేజీ కూడా LIVE చెయ్యబడింది. ఈ హ్యాండ్‌ సెట్ 48MP ప్రైమరీ సెన్సార్‌ తో వెనుక ఒక క్వాడ్ రియర్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంటుందని ఇది సూచిస్తుంది.

రియల్మి 5 ఎస్, ఈ ఏడాది ప్రారంభంలో లాంచ్ అయిన రియల్మి 5 యొక్క అప్‌ గ్రేడ్ వెర్షన్ గా అంటుంది. ఇది ఇప్పటికే భారతదేశంలో తప్పనిసరి BIS (బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్) సర్టిఫికేషన్ మరియు థాయ్‌లాండ్‌లోని NBTC (నేషనల్ బ్రాడ్‌కాస్టింగ్ అండ్ టెలికమ్యూనికేషన్స్ కమిషన్) సర్టిఫికేషన్నుపొందింది, ఈ హ్యాండ్‌సెట్ త్వరలో రెండు దేశాల్లో ప్రారంభించవచ్చని, ఈ అప్డేట్ చెబుతోంది.

రియల్మి 5 ఎస్ ఒక 6.5-అంగుళాల HD + (720×1600 పిక్సెల్స్) డిస్ప్లేను కలిగి ఉంటుంది. ఇది 4GB RAM తో జతగా చేసిన క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 665 చిప్‌ సెట్ శక్తితో అందివ్వగలదు. ఈ స్మార్ట్‌ ఫోన్ 48MP క్వాడ్ రియర్ కెమెరా సెటప్‌ను కలిగి ఉన్నట్లు నిర్ధారించబడింది. ఏదేమైనా, ఇతర మూడు సెన్సార్ల యొక్క ఖచ్చితమైన లక్షణాలు మాత్రం ఇంకా తెలియరాలేదు. ఇంకా, రియల్మి 5 S ముందుభాగంలో ఒక 13MP సెల్ఫీ షూటర్ కలిగి ఉంటాయి. ఇది 5000 ఎంఏహెచ్ బ్యాటరీని కూడా ప్యాక్ చేయవచ్చు.  

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo