Realme 5 Pro కేవలం రూ.11,999 ధరకే అమ్ముడవుతోంది

Realme 5 Pro కేవలం రూ.11,999 ధరకే అమ్ముడవుతోంది
HIGHLIGHTS

ఈ ఫోన్ను ICICI బ్యాంక్ యొక్క క్రెడిట్ కార్డుతో కొనేవారికి 10% తక్షణ డిస్కౌంట్ అందుతుంది.

Flipkart  తన ఆన్లైన్ ప్లాట్ఫారం పైన నిర్వహిస్తున్న "Year End Sale" నుండి రియల్మీ స్మార్ట్ ఫోన్ల పైన భారీ డిస్కౌంట్ ప్రకటించింది. వీటిలో ముఖ్యంగా వెనుక ఒక Sony IMX 586 48MP సెన్సార్ గల క్వాడ్ రియర్ కెమేరాతో వచ్చిన, రియల్మీ 5 ప్రో స్మార్ట్ ఫోన్ను ఎన్నడూ చూడనంత తక్కువ ధరకే కొనవచ్చు. ముందుగా, రూ.13,999 రూపాయల ధరలో వచ్చినటువంటి ఈ స్మార్ట్ ఫోన్ ఆల్ టైం తక్కువ ధరకే లభిస్తోందని చెప్పొచ్చు. అధనంగా, ఈ ఫోన్ను ICICI బ్యాంక్ యొక్క క్రెడిట్ కార్డుతో కొనేవారికి 10% తక్షణ డిస్కౌంట్ అందుతుంది.                

Realme 5 Pro ధరలు

1. Realme 5  Pro (4GB + 64GB) ధర – Rs.11,999

2. Realme 5  Pro (6GB + 64GB) ధర – Rs.12,999

3. Realme 5  Pro (8GB + 128GB) ధర – Rs.14,999

రియల్మి 5 ప్రో ప్రత్యేకతలు

రియల్మి 5 ప్రో స్మార్ట్ ఫోన్ ఒక మిడ్-రేంజ్ హ్యాండ్‌సెట్ గా ఇండియన్ మార్కెట్లోకి అడుగుపెట్టింది. ఇది ఒక క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 712 SoC యొక్క శక్తిని కలిగి ఉంది మరియు ఒక 6.3-అంగుళాల Full HD + డిస్ప్లేని 90.6 శాతం స్క్రీన్ టూ బాడీ నిష్పత్తితో కలిగి ఉంది. ఈ డిస్ప్లేలో వాటర్‌డ్రాప్ నోచ్ డిజైన్ ఉంది, ఇందులో  సెల్ఫీ కెమెరా ఉంచబడుతుంది. ఈ స్మార్ట్ ఫోన్, వెనుక ఒక ప్రత్యేకమైన క్రిస్టల్ డిజైన్ కలిగి ఉంది, ఇది హోలోగ్రాఫిక్ కలర్ ఎఫెక్ట్‌ను కలిగి ఉందని మరియు స్పార్క్లింగ్ బ్లూ మరియు క్రిస్టల్ గ్రీన్ కలర్ ఎంపికలతో వస్తుంది.

ఆప్టిక్స్ పరంగా, రియల్మి 5 ప్రో వెనుక భాగంలో క్వాడ్ కెమెరా సెటప్ తో ఉంటుంది. ఇది f / 2.25 ఎపర్చరు లెన్స్ మరియు 119 డిగ్రీల ఫీల్డ్ వ్యూతో ఒక 8 ఎంపి అల్ట్రావైడ్ యాంగిల్ లెన్స్ కలిగి ఉంటుంది. దీనికి జతగా 48MP ప్రాధమిక సోనీ IMX586 సెన్సార్‌తో పాటు, F / 2.4 లెన్స్‌తో 2MP పోర్ట్రెయిట్ లెన్స్ మరియు f / 2.4 మాక్రో లెన్స్‌తో 2MP కెమెరా కూడా ఉన్నాయి. ఈ స్మార్ట్ ఫోన్, మెరుగైన Low -Light చిత్రాలను కూడా అందిస్తుంది. ముందు భాగంలో 16MP సోనీ   IMX471 సెన్సార్, f / 2.0 ఎపర్చర్‌తో ఉంటుంది, ఇది రియల్మి X మాదిరిగానే ఉంటుంది.

రియల్మీ 5 ప్రో గరిష్టంగా 8 జీబీ ర్యామ్ మరియు 128 జీబీ వరకు ఇంటర్నల్ స్టోరేజ్‌తో వస్తుంది. ఈ హ్యాండ్‌సెట్‌లో హైపర్‌బూస్ట్ 2.0 అమర్చారు, ఇది గేమింగ్ ఆడేటప్పుడు మరింత మధురానుభూతిని అందిస్తుంది. అలాగే, ఒక 4035mAh బ్యాటరీతో మద్దతు ఉన్న ఈ హ్యాండ్‌సెట్ టైప్-సి పోర్ట్‌ను కలిగి ఉంది మరియు VOOC 3.0 ఛార్జింగ్‌కు మద్దతు ఇస్తుంది. ఈ VOOC ఛార్జింగ్ 80 నిమిషాల్లో హ్యాండ్‌సెట్ బ్యాటరీని 100 శాతం నింపుతుంది.   

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo