Realme 16x 5G with 7000 mah battery launch confirmed to 12 august 2026
Realme 16x 5G: జస్ట్ రెండు వారాల క్రితం నార్జో సిరీస్ నుండి కొత్త స్మార్ట్ ఫోన్ లాంచ్ చేసిన రియల్‌మీ, ఈరోజు మరొక స్మార్ట్ ఫోన్ లాంచ్ గురించి టీజర్ రిలీజ్ చేసింది. అదే రియల్‌మీ 16x 5జి స్మార్ట్ ఫోన్ మరియు ఈ ఫోన్ వచ్చేవారం మధ్యలో లాంచ్ అవుతుంది. ఈ ఫోన్ కూడా బిగ్ బ్యాటరీ స్మార్ట్ ఫోన్ గా ఇండియన్ మార్కెట్లో లాంచ్ అవుతుంది.
రియల్‌మీ 16x స్మార్ట్ ఫోన్ ఆగస్టు 12వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకు ఇండియాలో లాంచ్ అవుతుంది. ఈ ఫోన్ కూడా ఫ్లిప్ కార్ట్ ద్వారా టీజింగ్ చేయబడుతోంది. అయితే, చూడటానికి ఈ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ రియల్‌మీ నార్జో 100x స్మార్ట్ ఫోన్ మాదిరిగా కనిపిస్తోంది. అయితే, ఫీచర్స్ లో చాలా మార్పులు ఉండే అవకాశం ఉంటుంది. ఈ అప్ కమింగ్ ఫోన్ లాంచ్ కోసం ఫ్లిప్ కార్ట్ ద్వారా అందించిన టీజర్ పేజీ నుంచి ఈ ఫోన్ కీలక ఫీచర్స్ కూడా రియల్‌మీ రివీల్ చేసింది.
ఈ ఫోన్ డిజైన్ దాదాపు రియల్‌మీ నార్జో 100x మాదిరిగా కనిపిస్తోంది. ఈ ఫోన్ బ్యాక్ ప్యానల్ డిజైన్ మరియు కెమెరా సెటప్ రెండు కూడా దాదాపు ఈ రెండు ఫోన్ లను ఒకే మాదిరిగా కనిపించేలా చేస్తున్నాయి. అయితే, కలర్ లో మార్పులు ఉన్నాయి. ఇక ఫీచర్స్ విషయానికి వస్తే, రియల్‌మీ 16x ఫోన్ 1200 నిట్స్ పీక్ బ్రైట్నెస్ మరియు 144Hz రిఫ్రెష్ రేట్ కలిగిన డిస్ప్లే తో వస్తుంది. ఈ ఫోన్ ను కూడా మిలటరీ గ్రేడ్ MIL-STD 810H డ్యూరబిలిటీతో అందిస్తుంది.
ఈ రియల్‌మీ అప్ కమింగ్ ఫోన్ మీడియాటెక్ Dimensity 6300 చిప్ సెట్ తో లాంచ్ అవుతుంది. అలాగే, ఇందులో 14GB వరకు డైనమిక్ ర్యామ్ మరియు 256GB హెవీ స్టోరేజ్ ఉంటాయి. ఇందులో మంచి గేమింగ్ కోసం GT Boost హైపర్ కూలింగ్ ఫీచర్ మరియు 5300 mm² లార్జ్ వేపర్ ఛాంబర్ కూలింగ్ సిస్టం ఉన్నాయి.
Also Read : Flipkart Freedom Sale నుంచి iPhone 15 ఫోన్ ఆండ్రాయిడ్ ఫోన్ రేటుకే లభిస్తుంది.!
కెమెరా పరంగా, ఈ ఫోన్ లో 50MP AI డ్యూయల్ రియర్ కెమెరా మరియు సెల్ఫీ కెమెరా ఉంటుంది. ఈ ఫోన్ లేటెస్ట్ AI కెమెరా ఫీచర్లు మరియు రియల్‌మీ ప్రత్యేకమైన కెమెరా ఫిల్టర్లు కూడా కలిగి ఉంటుంది. ఈ ఫోన్ లో కూడా కెమెరా సెటప్ తో జతగా నోటిఫికేషన్ లైట్ ఉంటుంది. ఇక బ్యాటరీ విభాగానికి వస్తే, ఈ ఫోన్ లో 7000 mAh భారీ బ్యాటరీ ఉంటుంది. ఇది 45W ఫాస్ట్ ఛార్జ్, రివర్స్ ఛార్జ్ మరియు బైపాస్ ఛార్జ్ సపోర్ట్ కూడా కలిగి ఉంటుంది. అంతేకాదు, ఈ ఫోన్ బ్యాటరీ 6 సంవత్సరాల లాంగ్ లైఫ్ కూడా కలిగి ఉంటుంది.
ఈ ఫోన్ ప్రైస్ వివరాలు ఇంకా బయటకు రాలేదు. కానీ, ఇది బడ్జెట్ యూజర్ ను ఆకట్టుకునే ధరలో వచ్చే అవకాశం ఉండొచ్చని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి.