Flipkart Freedom Sale నుంచి iPhone 15 ఫోన్ ఆండ్రాయిడ్ ఫోన్ రేటుకే లభిస్తుంది.!
Flipkart Freedom Sale నుంచి iPhone 15 ఫోన్ ఆండ్రాయిడ్ ఫోన్ రేటుకే లభిస్తుంది
ఫ్లిప్ కార్ట్ ఈరోజు ఈ బిగ్ డీల్ ను కూడా రివీల్ చేసింది
తక్కువ ధరలో ప్రీమియం కెమెరా కలిగిన ఐఫోన్ కొనాలని చూసే వారు ఈ డీల్ ను పరిశీలించవచ్చు
Flipkart Freedom Sale నుంచి iPhone 15 ఫోన్ ఆండ్రాయిడ్ ఫోన్ రేటుకే లభిస్తుంది. సేల్ కంటే ముందుగా ఈ సేల్ టీజర్ పీజీ నుంచి బిగ్ డీల్స్ రివీల్ చేసిన ఫ్లిప్ కార్ట్, ఈరోజు ఈ బిగ్ డీల్ ను కూడా రివీల్ చేసింది. అదేమిటంటే, ప్రస్తుతం మార్కెట్లో మొబైల్ ప్రైస్ బాగా పెరిగిన విషయం తెలిసిందే. ఈ పెరిగిన రేట్లతో ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్ ప్రైస్ బాగా పెరిగిపోయాయి. వీటితో పోలిస్తే ఫ్లిప్ కార్ట్ ఫ్రీడమ్ సేల్ 2026 నుంచి లేటెస్ట్ ఆండ్రాయిడ్ ఫోన్ రేటుకే ఐఫోన్ 15 అందుకోవచ్చని చెబుతోంది. మరి ఈ సేల్ స్టార్ట్ కావడానికి ముందుగానే ఈ ఐఫోన్ 15 డీల్ ఏమిటో చూసేద్దామా.
SurveyFlipkart Freedom Sale : iPhone 15 డీల్
ఐఫోన్ 15 స్మార్ట్ ఫోన్ ఇండియాలో రూ. 79,900 స్టార్టింగ్ ప్రైస్ తో లాంచ్ అయ్యింది. అయితే, కొత్త సిరీస్ ఫోన్ లతో ఈ ఫోన్ ప్రైస్ మెల్లగా తగ్గించబడింది. అయితే, ప్రస్తుతం కూడా ఈ ఫోన్ రూ. 59,900 ధరతో సేల్ అవుతోంది. కానీ ఫ్లిప్ కార్ట్ ఫ్రీడమ్ సేల్ నుంచి ఈ ఫోన్ కేవలం రూ. 52,999 రూపాయల ఆఫర్ ధరలో అందుకోవచ్చని ఫ్లిప్ కార్ట్ టీజింగ్ చేసింది.

పెరిగిన ముడి సరుకుల ధరలతో మొబైల్ ఫోన్ రేట్లు కూడా బాగా పెరిగాయి. ఇటీవల విడుదలైన చాలా ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్ లు రూ. 35,000 నుంచి రూ. 50,000 ధరలో లాంచ్ అవుతున్నాయి. వీటితో పోలిస్తే ఇదే ప్రైస్ తో ఐఫోన్ 15 ఫోన్ ను సొంతం చేసుకోవచ్చు. ఐఫోన్ మీద మక్కువ ఉండి తక్కువ ధరలో ప్రీమియం కెమెరా కలిగిన ఐఫోన్ కొనాలని చూసే వారు ఈ డీల్ ను పరిశీలించవచ్చు.
Also Read : Redmi Note 17 5G భారీ EV గ్రేడ్ 8000 mAh బ్యాటరీ తో వచ్చింది .. ప్రైస్ అండ్ ఆఫర్స్ తెలుసుకోండి.!
iPhone 15 : ఫీచర్స్
ఐఫోన్ 15 ఫోన్ 6.1 అంగుళాల సూపర్ రెటినా XDR OLED స్క్రీన్ కలిగి ఉంటుంది. ఈ స్క్రీన్ (2556 × 1179) రిజల్యూషన్, 60Hz రిఫ్రెష్ రేట్, 2000 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్ మరియు డైనమిక్ ఐల్యాండ్ వంటి ప్రీమియం ఫీచర్స్ తో వస్తుంది. ఈ ఫోన్ Apple A16 Bionic చిప్ తో నడుస్తుంది మరియు తాజా iOS అప్‌డేట్ సపోర్ట్ తో కూడా వస్తుంది. ఇందులో 128GB, 256GB మరియు 512GB స్టోరేజ్ ఆప్షన్ ఉన్నాయి.
ఇది జబర్దస్త్ కెమెరా సెటప్ కలిగి ఉంటుంది. ఇందులో 48MP ప్రధాన కెమెరా (OIS) జతగా 12MP అల్ట్రా వైడ్ కెమెరా కలిగిన డ్యూయల్ రియర్ కెమెరా ఉంది. అలాగే, 12MP TrueDepth సెల్ఫీ కెమెరా కూడా ఉంటుంది. ఈ ఫోన్ 60FPS 4K వీడియో రికార్డింగ్, సినిమాటిక్ మోడ్, యాక్షన్ మోడ్ మరియు Dolby Vision HDR వీడియో రికార్డింగ్ సపోర్ట్ కలిగి ఉంటుంది. అంతేకాదు, ప్రత్యేకమైన యాపిల్ కెమెరా ఫీచర్స్ కూడా కలిగి ఉంటుంది.
ఈ ఫోన్ ఒక రోజంతా బ్యాకప్ అందించే బ్యాటరీ కలిగి ఉంటుంది. ఈ ఫోన్ USB Type-C ఛార్జింగ్ సపోర్ట్, Mag Safe వైర్‌లెస్ ఛార్జింగ్ సపోర్ట్ మరియు Qi వైర్‌లెస్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా కలిగి ఉంటుంది. ఈ ఫోన్ సిరామిక్ షీల్డ్ గ్లాస్ రక్షణ తో వస్తుంది మరియు IP68 రేటింగ్ డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెన్స్ ఫీచర్ తో ఉంటుంది.
Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile
