Realme 16x 5G just launched in India and know price and features
Realme 16x 5G స్మార్ట్ ఫోన్ ఈ రోజు ఇండియాలో లాంచ్ అయ్యింది. రియల్ మీ ఈ స్మార్ట్ ఫోన్ ను ప్రస్తుతం మొబైల్ మార్కెట్ లో ఉన్న చాలా స్మార్ట్ ఫోన్ లకు పోటీగా అందించింది. ఈ కొత్త ఫోన్ బిగ్ బ్యాటరీ మరియు బెస్ట్ డిజైన్ వంటి ఆకట్టుకునే ఫీచర్స్ తో లాంచ్ అయ్యింది. ఈ ఫోన్ పై భారీ లాంచ్ ఆఫర్లు కూడా రియల్ మీ అందించింది. రియల్ మీ సరికొత్తగా విడుదల చేసిన ఈ ఫోన్ ప్రైస్ అండ్ ఫీచర్స్ చూద్దామా.
రియల్ మీ ఈ ఫోన్ ను రెండు కలర్ ఆప్షన్స్ మరియు మూడు వేరియంట్స్ లో అందించింది. ఈ ఫోన్ స్టార్టింగ్ 4GB + 128GB వేరియంట్ ను రూ. 25,999 రూపాయల ధరతో మరియు రెండో 6GB + 128GB వేరియంట్ ను రూ. 27,999 ధరతో అందించింది. అలాగే, ఈ ఫోన్ హై ఎండ్ 6GB + 256GB వేరియంట్ ను రూ. 30,999 రూపాయల ధరతో లాంచ్ చేసింది. ఈ ఫోన్ గ్లోరీ వైట్ మరియు ఎండ్యూరెన్స్ బ్రౌన్ రంగుల్లో లభిస్తుంది.
ఈ స్మార్ట్ ఫోన్ రేపటి నుంచి సేల్ కి అందుబాటులోకి వస్తుంది. అంటే, ఆగస్టు 13వ తేదీ మధ్యాహ్నం 12 గంటల నుంచి సేల్ అవుతుంది. ఈ ఫోన్ ఫ్లిప్ కార్ట్ మరియు రియల్ మీ అఫీషియల్ సైట్ నుంచి సేల్ అవుతుంది. ఇక ఆఫర్స్ విషయానికి వస్తే, ఈ ఫోన్ పై భారీ బ్యాంక్ డిస్కౌంట్ మరియుభారీ ఎక్స్ చేంజ్ బోనస్ ఆఫర్లను రియల్ మీ అందించింది. అవేమిటంటే, ఈ ఫోన్ పై రూ. 2,000 రూపాయల తక్షణ బ్యాంక్ డిస్కౌంట్ మరియు రూ. 2000 రూపాయల అదనపు ఎక్స్ చేంజ్ బోనస్ ఆఫర్ ఈ ఫోన్ పై అందించింది. ఈ ఆఫర్ తో ఈ ఫోన్ రూ. 23,999 ఆఫర్ ధరలో లభిస్తుంది.
Also Read : Amazon GF Sale చివరి రోజు Dolby 5.1 Soundbar ని డెడ్ చీప్ ప్రైస్ లో సేల్ చేస్తోంది.!
రియల్ మీ 16x 5జి స్మార్ట్ ఫోన్ 8.8mm మందంతో స్లీక్ గా ఉంటుంది మరియు మంచి డిజైన్ తో ఆకట్టుకుంటుంది. ఈ ఫోన్ లో 6.81 ఇంచ్ బిగ్ స్క్రీన్ ఉంటుంది. అయితే, ఈ స్క్రీన్ HD+ రిజల్యూషన్ మాత్రమే కలిగి ఉంటుంది. అయితే, ఇది 144Hz రిఫ్రెష్ రేట్ మరియు 1200 నిట్స్ HBM బ్రైట్నెస్ వంటి ఫీచర్స్ కలిగి ఉంటుంది. ఈ ఫోన్ మీడియాటెక్ Dimensity 6300 ఆక్టా కోర్ చిప్ సెట్ తో నడుస్తుంది. ఇందులో 4GB / 6GB ర్యామ్ మరియు 128 GB / 256 GB స్టోరేజ్ ఆప్షన్ ఉన్నాయి.
ఈ ఫోన్ లో 50MP మెయిన్ కెమెరా కలిగిన డ్యూయల్ రియర్ కెమెరా మరియు 8MP సెల్ఫీ కెమెరా కలిగి ఉంటుంది. అయితే, ఈ ఫోన్ FHD వీడియో రికార్డింగ్ మాత్రమే కలిగి ఉంటుంది. కానీ, లేటెస్ట్ AI కెమెరా ఫీచర్స్ మరియు రియల్ మీ కెమెరా ఫీచర్స్ కూడా కలిగి ఉంది. ఈ ఫోన్ లో 7000 mAh భారీ బ్యాటరీ మరియు 45W ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ కూడా ఉన్నాయి. ఇది మిలటరీ గ్రేడ్ డ్యూరబిలిటీ మరియు IP65 రేటింగ్ డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెన్స్ కలిగి ఉంది.