Realme 16 Pro Series 5G: కెమెరా ప్రత్యేకమైన కొత్త సిరీస్ లాంచ్ అనౌన్స్ రియల్ మీ.!

HIGHLIGHTS

జస్ట్ రెండు రోజుల క్రితం నార్జో 90 సిరీస్ లాంచ్ అనౌన్స్ చేసిన రియల్ మీ

ఈరోజు అప్ కమింగ్ ప్రీమియం సిరీస్ అనౌన్స్ చేసింది

Realme 16 Pro Series 5G టీజర్ ఇమేజెస్ రిలీజ్ చేసింది

Realme 16 Pro Series 5G: కెమెరా ప్రత్యేకమైన కొత్త సిరీస్ లాంచ్ అనౌన్స్ రియల్ మీ.!

Realme 16 Pro Series 5G : జస్ట్ రెండు రోజుల క్రితం నార్జో 90 సిరీస్ లాంచ్ అనౌన్స్ చేసిన రియల్ మీ, ఈరోజు అప్ కమింగ్ ప్రీమియం సిరీస్ అనౌన్స్ చేసింది. అదే, రియల్ మీ 16 ప్రో సిరీస్ మరియు ఈ సిరీస్ ను కెమెరా ప్రత్యేకమైన కొత్త సిరీస్ గా తీసుకొస్తున్నట్లు గొప్పగా చెబుతోంది. ఈ సిరీస్ లాంచ్ గురించి ఈరోజు రియల్ మీ అఫీషియల్ X అకౌంట్ మరియు వెబ్‌సైట్ నుంచి కూడా అనౌన్స్ చేసింది.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

Realme 16 Pro Series 5G: లాంచ్ డేట్?

రియల్ మీ 16 ప్రో సిరీస్ లాంచ్ గురించి మాత్రమే రియల్ మీ అనౌన్స్ చేసింది. ఈ అప్ కమింగ్ సిరీస్ లాంచ్ డేట్ ఇంకా అనౌన్స్ చేయలేదు. ఈ ఫోన్ కోసం కంపెనీ అధికారిక వెబ్సైట్ నుంచి అందించిన టీజర్ పేజీ నుంచి ఈ ఫోన్ టీజర్ ఇమేజెస్ రిలీజ్ చేసింది.

Realme 16 Pro Series 5G: కీలక ఫీచర్స్

రియల్ మీ 16 ప్రో సిరీస్ ఫోన్లను నెక్స్ట్ జనరేషన్ మాస్టర్ డిజైన్ తో లాంచ్ చేస్తున్నట్లు కంపెనీ చెబుతోంది. ఈ ఫోన్ టీజర్ ఇమేజ్ ద్వారా ఈ ఫోన్ క్వాడ్ కర్వుడ్ డిస్ప్లే మరియు వెనుక కూడా కర్వుడ్ డిజైన్ కలిగి ఉన్నట్లు కనిపిస్తోంది. ఈ అప్ కమింగ్ సిరీస్ ఫోన్లు పెర్ఫార్మెన్స్ లో కాంప్రమైజ్ కానీ ఫాస్ట్ ప్రోసెసర్ తో వస్తాయని రియల్ మీ తెలిపింది.

Realme 16 Pro Series 5G

రియల్ మీ అందించిన టీజర్ ఇమేజ్ నుంచి ఈ సిరీస్ ఫోన్లు క్వాల్కమ్ చిప్ సెట్ తో లాంచ్ అవుతాయని తెలిపింది. ఈ సిరీస్ ఫోన్లు సెగ్మెంట్ బెస్ట్ కెమెరా సెటప్ తో వస్తుందని కూడా రియల్ మీ టీజింగ్ చేసింది. ఈ సిరీస్ నుంచి వచ్చే ఫోన్లలో వెనుక ట్రిపుల్ రియర్ కెమెరా ఉంటుందని కూడా రియల్ మీ కన్ఫర్మ్ చేసింది. ఈ ఫోన్లు 1x నుంచి 10x వరకు గొప్ప డీటెయిల్స్ కలిగిన సూపర్ పోర్ట్రైట్ ఫోటోలు అందిస్తుందని రియల్ మీ చెబుతోంది.

Also Read: Save the Tigers Season 3 గ్లింప్స్ వీడియో రిలీజ్ చేసిన జియో హాట్ స్టార్.. రిలీజ్ ఎప్పుడంటే.!

రియల్ మీ ఫోన్ కెమెరా కోసం ప్రత్యేకంగా అందించిన AI Edit Genie ఈ సిరీస్ లో కూడా అందిస్తుంది. అదికూడా లేటెస్ట్ ఎఐ ఎడిట్ జీనీ 2.0 సపోర్ట్ తో అందిస్తుంది. ఈ ఫీచర్ తో అనేకమైన ఫిల్టర్లు మరియు ఇతర ఫీచర్లు ఉంటాయి.

రియల్ మీ 16 ప్రో సిరీస్ లాంచ్ డేట్ మరియు ఈ అప్ కమింగ్ సిరీస్ కీలక ఫీచర్లు కూడా త్వరగానే విడుదల చేసే అవకాశం ఉంది.

Raja Pullagura

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo