Realme 16 Pro Harry Potter Edition launching with super design and camera
Realme 16 Pro Harry Potter Edition: రియల్ మీ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ కోసం భారీగా టీజింగ్ చేస్తోంది. అదే రియల్ మ్మి 16 ప్రో హ్యారీ పాటర్ ఎడిషన్ స్మార్ట్ ఫోన్ మరియు ఈ ఫోన్ ను మొబైల్ మార్కెట్లో ఎన్నడూ లేని సరికొత్త డిజైన్ తో అందిస్తుంది. ఈ ఫోన్ లాంచ్ కోసం రిలీజ్ చేసిన టీజర్ ద్వారా ఈ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ కీలక వివరాలు కూడా రివీల్ చేసింది. రియల్ మీ లాంచ్ చేయబోతున్న ఈ ఫోన్ కొత్త ఫోన్ డీటెయిల్స్ పై ఒక లుక్కేద్దామా.
రియల్ మ్మి 16 ప్రో హ్యారీ పాటర్ ఎడిషన్ ఫోన్ సెప్టెంబర్ 21వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకు లాంచ్ అవుతుంది. ఈ ఫోన్ లాంచ్ కోసమే కంపెనీ అఫీషియల్ సైట్ మరియు ఫ్లిప్ కార్ట్ ద్వారా అందించిన ప్రత్యేకమైన మైక్రో సైట్ టీజర్ పేజీ నుంచి ఈ ఫోన్ కీలక ఫీచర్లు మరియు లాంచ్ డీటెయిల్స్ అందించింది.
రియల్ మ్మి 16 ప్రో హ్యారీ పాటర్ ఎడిషన్ ఫోన్ పెరుగు తగ్గట్టుగానే లిమిటెడ్ ఎడిషన్ గిఫ్ట్ బాక్స్ తో వస్తుంది. ఇది హ్యారీ పాటర్ నవల అండ్ సినిమాలో కనిపించే కల్పిత మాయా విద్యాసంస్థ ‘హాగ్వార్ట్స్’ గిఫ్ట్ కిట్ లాగా ఉంటుంది. ఈ ఫోన్ డిజైన్ కూడా ఈ స్కూల్ మాదిరి థీమ్ డిజైన్ లో ప్రీమియం లెథర్ తో ఉంటుంది.
కెమెరా, ఈ ఫోన్ లో ప్రీమియం కేమెరా సెటప్ ను రియల్ మీ సెట్ చేసింది. అదేమిటంటే, ఈ ఫోన్ లో వెనుక 200MP మెయిన్ కెమెరా జతగా 112 డిగ్రీ వైడ్ యాంగిల్ మరియు మరో కెమెరా కలిగిన ట్రిపుల్ రియర్ కెమెరా ఉంటుంది. అలాగే, ఈ ఫోన్ లో ముందు 50MP సెల్ఫీ కెమెరా కూడా ఉంటుంది. ఇందులో హ్యారీ పాటర్ థీమ్ ట్రాన్స్ఫర్మేషన్ మరియు పాప్ అవుట్ ఎలివేషన్ మరియు హ్యారీ పాటర్ మాదిరి థీమ్స్ అందించే మరిన్ని కెమెరా ఫీచర్స్ కూడా ఈ ఫోన్ లో ఉన్నట్లు రియల్ మీ తెలిపింది.
పెర్ఫార్మెన్స్, ఈ ఫోన్ కెమెరా కెమెరా అండ్ డిజైన్ కోసం మాత్రమే కాదు పెర్ఫార్మన్స్ కోసం కూడా నిలబడేలా, ఈ ఫోన్ ను మీడియాటెక్ Dimensity 7300 Max ప్రాసెసర్ తో లాంచ్ చేస్తుంది. ఇది 9,71,755 కంటే అధిక AnTuTu స్కోర్ అందించే శక్తి కలిగి ఉంటుంది. అలాగే, ఇది GT Boost తో మరింత గొప్ప గేమింగ్ పవర్ అందిస్తుంది. ఇందులో 7000 mAh టైటాన్ బ్యాటరీ మరియు 80W ఫాస్ట్ ఛార్జ్ వంటి ప్రీమియం ఫీచర్ కూడా జత చేసింది. అలాగే, రివర్స్ ఛార్జ్, బైపాస్ ఛార్జ్ ఫీచర్ మరియు 6 సంవత్సరాల బ్యాటరీ హెల్త్ వంటి ఫీచర్స్ ఈ ఫోన్ లో ఉన్నాయి.
Also Read: Redmi Note 17 Pro: షియోమీ కొత్త ఫోన్ పాజిటివ్ అండ్ నెగిటివ్ తెలుసుకోండి.!
ఈ ఫోన్ HDR 10+ సపోర్ట్ కలిగిన బిగ్ స్క్రీన్ తో వస్తుంది. ఈ ఫోన్ 6500 నిట్స్ పీక్ బ్రైట్నెస్, 94 శాతం స్క్రీన్ టు బాడీ రేషియో మరియు DC మోడ్ వంటి ప్రీమియం ఫీచర్స్ కలిగి ఉంటుంది. ఈ ఫోన్ IP69K తో ప్రో వాటర్ రెసిస్టెంట్ సపోర్ట్ తో వస్తుంది మరియు అండర్ వాటర్ ఫోటోగ్రఫీ ఫీచర్ తో కూడా వస్తుంది.