Realme 12X 5G: పవర్ ఫుల్ ఫోన్ తెస్తున్న రియల్ మి.. లీకైన ధర మరియు స్పెక్స్.!
Realme 12X 5G విడుదల చేస్తున్నట్లు అనౌన్స్ చేసింది
ఈ ఫోన్ యొక్క స్పెక్స్ మరియు ఫీచర్స్ తో టీజింగ్ చేస్తోంది
ఫోన్ లో అందించిన అప్గ్రేడ్ వివరాలను కూడా వెల్లడించింది
Realme 12X 5G: రియల్ మి ఇండియాలో కొత్త స్మార్ట్ ఫోన్ ను 12 సిరీస్ నుండి లాంఛ్ చేస్తునట్లు ప్రకటించింది. రియల్ మి 12X 5G స్మార్ట్ ఫోన్ ను విడుదల చేస్తున్నట్లు అనౌన్స్ చేసిన కంపెనీ ఈ ఫోన్ యొక్క స్పెక్స్ మరియు ఫీచర్స్ తో టీజింగ్ చేస్తోంది. ఈ రియల్ మి స్మార్ట్ ఫోన్ యొక్క ధరను కూడా కంపెనీ లీక్ చేసింది.ఈ కొత్త ఫోన్ గురించి సవివరంగా తెలుసుకుందామా.
SurveyRealme 12X 5G Launch Date
రియల్ మి ఈ ఫోన్ ను ఏప్రిల్ 2వ తేదీ ఇండియన్ మర్కెట్ లో విడుదల చేస్తోంది. ఈ ఫోన్ గత సంవత్సరం వచ్చిన రియల్ మి 11X 5జి ఫోన్ యొక్క నెక్స్ట్ జెనెరేషన్ ఫోన్ గా తీసుకు వస్తోంది. ఈ ఫోన్ లో అందించిన అప్గ్రేడ్ వివరాలను కూడా వెల్లడించింది.
Realme 12X 5G: ఫీచర్లు
రియల్ మి ఈ ఫోన్ ను 120Hz రిఫ్రెష్ రేట్ కలిగిన 6.72 ఇంచ్ FHD డిస్ప్లేతో లాంఛ్ చేస్తున్నట్లు తెలిపింది. అంతేకాదు, ఈ డిస్ప్లే 950 నిట్స్ పీక్ బ్రైట్నెస్ ను కలిగి ఉంటుందని కూడా తెలిపింది. ఈ డిజైన్ పరంగా, కేవలం 7.9mm మందం కలిగి చాలా స్లీక్ గా కూడా ఉంటుంది. ఈ ఫోన్ MediaTek Dimesity 6100+ ప్రోసెసర్ శక్తితో పని చేస్తుందని కొద కన్ఫర్మ్ చేసింది.

రియల్ మి 12X 5జి ఫోన్ లో వెనుక 50MP AI డ్యూయల్ రియర్ కెమేరా సెటప్ మరియు ముందు పంచ్ హోల్ సెల్ఫీ కెమేరా ఉన్నాయి. అయితే, ఈ ఫోన్ లో నాలుగు కెమేరాలు ఉన్నట్లు కనిపించేలా డిజైన్ చేసింది. ఈ రియల్ మి అప్ కమింగ్ ఫోన్ లో కూడా Air Gestures, Android 14 OS మరియు IP54 రైన్ వాటర్ స్మార్ట్ టచ్ వంటి ఫీచర్స్ ను అందించింది.
Also Read: మొబైల్ నెంబర్ లింక్ అవ్వకున్నా ఆన్లైన్ లో Aadhaar Card డౌన్ లోడ్ చేసుకోవచ్చు.!
రియల్ మి 12X 5జి ఫోన్ ను ఈ బడ్జెట్ లో వేగవంతమైన 45W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ మరియు 5000 mAh బిగ్ బ్యాటరీ సెటప్ ట్ తీసుకు వస్తున్నట్లు కూడా తెలిపింది.
Realme 12X 5G: Expected Price
రియల్ మి ఈ ఫోన్ 12 వేల సెగ్మెంట్ ఫోన్ అని చెబుతోంది. అంటే, ఈ ఫోన్ 12 వేల రూపాయల కంటే తక్కువ ధరలోనే లాంఛ్ అవుతుందని రియల్ మి కన్ఫర్మ్ చేసింది. దీనికి అనుగుణంగానే ఈ ఫోన్ బేసిక్ వేరియంట్ ను రూ. 10,999 రూపాయల ధరకే లాంఛ్ చేసే వీలుందని నిపుణులు అంచనా వేస్తున్నారు.
Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile