ఈరోజే విడుదలైన Realme 12x 5G టాప్ – 5 ఫీచర్స్ మరియు ప్రైస్ తెలుసుకోండి.!

ఈరోజే విడుదలైన Realme 12x 5G టాప్ – 5 ఫీచర్స్ మరియు ప్రైస్ తెలుసుకోండి.!
HIGHLIGHTS

Realme 12x 5G ఇండియన్ మార్కెట్ లో విడుదల చేసింది

12 వేల ఉప బడ్జెట్ లో ఆకర్షణీయమైన ఫీచర్స్ తో తీసుకు వచ్చింది

బ్యాటరీ మరియు ఛార్జ్ టెక్ వరకూ అన్ని ఫీచర్స్ ని ఈ ఫోన్ రేటుకు తగినట్లుగా అందించింది

రియల్ మి ఈరోజు తన బడ్జెట్ స్మార్ట్ ఫోన్ Realme 12x 5G ఇండియన్ మార్కెట్ లో విడుదల చేసింది. ఈ స్మార్ట్ ఫోన్ ను 12 వేల ఉప బడ్జెట్ లో ఆకర్షణీయమైన ఫీచర్స్ తో తీసుకు వచ్చింది. ఈ ఫోన్ లో డిస్ప్లే మొదలుకొని బ్యాటరీ మరియు ఛార్జ్ టెక్ వరకూ అన్ని ఫీచర్స్ ని ఈ ఫోన్ రేటుకు తగినట్లుగా అందించింది . ఈరోజే మార్కెట్ లో సరికొత్తగా విడుదలైన ఈ స్మార్ట్ ఫోన్ యొక్క ధర మరియు టాప్ – 5 ఫీచర్స్ పైన ఒక లుక్కేద్దామా.

Realme 12x 5G Price

రియల్ మి ఈ ఫోన్ ను 4GB, 6GB మరియు 8GB RAM వేరియంట్ లను అందించింది. ఈ ఫోన్ యొక్క బేసిక్ వేరియంట్ (4GB + 128GB) ను రూ. 11,999 ధరతో, (6GB + 128GB) వేరియంట్ ను రూ. 13,499 ధరతో లాంఛ్ చేసింది. ఈ ఫోన్ యొక్క హై ఎండ్ వేరియంట్ (8GB + 128GB) ను రూ. 13,499 ధరతో ప్రకటించింది.

Realme 12x 5G టాప్ – 5 ఫీచర్స్

Realme 12x 5G Top 5 Features
Realme 12x 5G Top 5 Features

Display

రియల్ మి ఈ ఫోన్ ను 6.72 ఇంచ్ బిగ్ డిస్ప్లేని 120 Hz రిఫ్రెష్ రేట్ మరియు FHD+ రిజల్యూషన్ ను కలిగి ఉంటుంది. ఈ ఫోన్ లో అందించి డిస్ప్లే ఈ ప్రైస్ సెగ్మెంట్ లో క్లియర్ డిస్ప్లే అవుతుందని రియల్ మి తెలిపింది.

Performance

Realme 12x 5G Performance
Realme 12x 5G Performance

ఈ స్మార్ట్ ఫోన్ ను మీడియాటెక్ బడ్జెట్ ఫాస్ట్ ప్రోసెసర్ Dimensity 6100+ తో లాంఛ్ చేసింది. ఈ డిస్ప్లే 6nm ఫ్యాబ్రికేషన్ తో వస్తుంది మరియు మంచి 5G కనెక్టివిటీతో పాటుగా వేగంగా పని చేస్తుందని కె కంపెనీ తెలిపింది.

RAM & Storage

ఈ రియల్ మి స్మార్ట్ ఫోన్ 8GB ఫిజికల్ RAM + 8 GB dynamic RAM తో కలిపి టోటల్ 16GB RAM ఫీచర్ ను అందిస్తుంది. అంతేకాదు, ఈ ఫోన్ 128 GB ఇంటర్నల్ స్టోరేజ్ ని కూడా కలిగి ఉంటుంది.

Also Read: Call Forwarding స్కామర్లకు చెక్ పెట్టడానికి ప్రభుత్వం ఈ సర్వీస్ కోడ్ ను తొలగిస్తోంది.!

Camera

రియల్ మి 12X 5G స్మార్ట్ ఫోన్ వెనుక డ్యూయల్ రియర్ కెమేరా సెటప్ ను కలిగి వుంది. ఇందులో 50MP + 2MP సెన్సార్లు ఉన్నాయి మరియు ముందు 8MP సెల్ఫీ కెమేరా కూడా వుంది. 1080p వీడియో రికార్డింగ్ మరియు 720p వద్ద స్లో మోషన్ వీడియో రికార్డింగ్ సపోర్ట్ లను కలిగి వుంది.

Battery & Others

Realme 12x 5G Battery
Realme 12x 5G Battery

ఈ రియల్ మి కొత్త ఫోన్ 45 W SUPERVOOC సపోర్ట్ కలిగిన 5000 mAh బిగ్ బ్యాటరీని కలిగి వుంది. అంతేకాదు, ఈ ఫోన్ లో Hi-Res Audio సర్టిఫికేషన్ కలిగిన డ్యూయల్ స్టీరియో స్పీకర్ లను కలిగి వుంది.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo